ఇన్ స్టాగ్రామ్ నుంచి మరో ఆసక్తికరమైన యాప్...
04-10-201904-10-2019 11:06:49 IST
2019-10-04T05:36:49.729Z04-10-2019 2019-10-04T05:36:46.797Z - - 11-04-2021

ఫేస్ బుక్ కు ఆదరణ తగ్గుతోందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. యువత ఫేస్ బుక్ నుంచి ఇతర యాప్స్ వైపు వెళ్తున్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ట్రెండ్ ను చూసిన ఫేస్ బుక్ ... ఇన్ స్టాగ్రామ్ ను డెవలప్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు అందులో మరికొన్ని మార్పులు చేస్తూ కొత్త యాప్స్ ను తీసుకొస్తోంది. ‘థ్రెడ్స్’ పేరుతో కొత్త యా ప్ ను తీసుకొస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లోని క్లోజ్ ఫ్రెండ్స్ తరహాలోనే ఈ యాప్ పని చేస్తుంది. ఇన్ స్టాగ్రామ్ లో స్టోరీ షేర్ చేసినప్పుడు ఈ క్లోజ్ ఫ్రెండ్స్ ఆప్షన్ కనిపిస్తుంది.
ఇన్ స్టాగ్రామ్ ఫుల్ వెర్షన్ అనుకుంటే థ్రెడ్స్ ని స్పెషల్ వెర్షన్ అనుకోవచ్చు. ఇందులో ఇన్ స్టాగ్రామ్ లోని మొత్తం ఆప్షన్లు లేకపోయినా ఆసక్తికరమైన క్లోజ్ ఫ్రెండ్స్ ఆప్షన్ ఉంటుంది. స్నేహితులతో వేగంగా ఫొటోలు పంచుకోవడం, స్టేటస్ పెట్టడం లాంటివి చేయొచ్చు. దీంతోపాటు వీడియో కాల్ సౌకర్యం కూడా ఉంది. ఛాటింగ్ లో పంపించే ఫొటోలు ఎంతసేపు ఉండాలి అనేది సెండర్ నిర్ణయించుకోవచ్చు. అంటే మీరు పంపిన ఫొటో అవతలి వ్యక్తి చూడగానే డిలీట్ అయిపోవాలా, లేక రీప్లే చేస్తే కనిపించాలా అనేది సెండర్ నిర్ణయించుకోవచ్చు.
థ్రెడ్స్ లో ఇన్ స్టాగ్రామ్ ఫ్రెండ్స్ సులభంగా యాడ్, డిలీట్ చేసుకోవచ్చు. అలాగే థ్రెడ్స్ కెమెరాలో షార్ట్ కట్స్ పెట్టుకోవచ్చు. అంటే మీరు తీసిన ఫొటో వెంటనే షార్ట్ కట్ లో ఉన్న ఫ్రెండ్ కి పంపించొచ్చు. ఈ ఫీచర్ ను స్నాప్ ఛాట్ నుంచి స్ఫూర్తి పొంది తీసుకొచ్చారు. అయితే ఇన్ స్టాగ్రామ్ కు ఇది కొత్తేం కాదు.
థ్రెడ్స్ లో ఆటో స్టేటస్ ఫీచర్ ఉంది. మీ ప్రొఫైల్ ఐకాన్ దగ్గర మీ స్టేటస్ పెట్టుకోవచ్చు. అంటే మీరు గేమ్ ఆడుతుంటే స్టేటస్ లో గేమ్ అని సెలెక్ట్ చేస్తే మీ ప్రొఫైల్ ఐకాన్ దగ్గర గేమింగ్ జాయ్ స్టిక్ ఐకాన్ కనిపిస్తుంది. దీంతోపాటు మీరు లొకేషన్ యాక్సెస్ ఇస్తే మీరు ఎక్కడికెళ్తే అక్కడి స్టేటస్ అప్ డేట్ అయిపోతోంది. అంటే మీరు కేఫ్ కి వెళ్తే వెంటనే మీ స్టేటస్ లో ‘ఎట్ కేఫ్’ అని మారిపోతుంది.



ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా