ఇదేం ఫోన్ ‘అండీ’ బాబూ.. రిమోట్ లా ఉంది
09-10-201909-10-2019 13:02:37 IST
2019-10-09T07:32:37.598Z09-10-2019 2019-10-09T07:32:34.405Z - - 12-04-2021

ఎసెన్సియల్ అంటూ... గూగుల్ మాజీ ఉద్యోగి ఆండీ రూబిన్ ఓ మొబైల్ తీసుకొచ్చాడు. నాచ్ డిస్ ప్లే స్క్రీన్ డిస్ ప్లేతో వచ్చిన ఈ మొబైల్ పెద్దగా యూజర్లను ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత చాలా కాలం కొత్త మొబైల్స్ ఎసెన్సియల్ నుంచి రాలేదు. చాలా కాలం తర్వాత ఇప్పుడు ఓ కొత్త డిజైన్ తో మొబైల్ ని తీసుకొస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు ఇప్పుడు అంతర్జాలంలో హల్ చల్ చేస్తున్నాయి. వీటిని ఆండీ రూబినే షేర్ చేశాడు.
రూబిన్ షేర్ చేసిన ఫొటోల ప్రకారం చూస్తే ఈ మొబైల్ ప్రస్తుత ట్రెండ్ అయిన 21:9 యాస్పెక్ట్ రేషియోకు ఏ మాత్రం సంబంధం లేకుండా ఉంది. ఇప్పుడున్న మొబైల్స్ ఆరు అంగుళాల స్క్రీన్ తో వెడల్పుగా ఉంటాయి. కానీ ఈ మొబైల్ రిమోట్ ఆకారంలో ఉంది. తక్కువ వెడల్పు, ఎక్కువ పొడవుతో కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేసేలా ఉంది. ఈ మొబైల్ నేవిగేషన్ బటన్స్ దిగువ కాకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. అలా అని ఓఎస్, యూఐలో ఎలాంటి మార్పు లేదు.
ఇంకా పేరు పెట్టని ఈ మొబైల్ లో ముందువైపు ఒక్క కెమెరానే ఉంది. వెనుకవైపు కూడా ఒక్క కెమెరానే ఉన్నట్లు సమాచారం. ఫ్లాష్ సౌకర్యం కూడా ఉంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ వెనుకవైపే ఉంటుంది. మిగిలిన ఫోన్ల లాగే వాల్యూమ్ బట్స్, ఇయర్ పీస్ ఉన్నాయి. అయితే ఇది టైప్ సి పోర్టు తోనే వస్తుందని తెలుస్తోంది. దీనికి ఆండీ రూబిన్ జెమ్ అని కోడ్ నేమ్ పెట్టారు.
ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ త పని చేస్తుంది. క్వాల్ కోమ్ స్నాప్ డ్రాగన్ 730 ప్రాసెసర్ ఉండొచ్చు. దీంతోపాటు ఈ మొబైల్ ను ఫింగర్ ప్రింట్ వాకీటాకీగానూ వాడుకోవచ్చు. అంటే వెనుకవైపు ఉన్న ఫింగర్ ప్రింట్ సెన్సర్ ను లాంగ్ ప్రెస్ చేసి కావాల్సిన వారితో మాట్లాడుకునేలా ఇందులో టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు.

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా