newssting
BITING NEWS :
*దిశ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృదం.. శంషాబాద్ డీసీపీ నేతృత్వంలో విచారణ కమిటీ *హైదరాబాద్ మెట్రోలో పెప్పర్ స్ప్రేలకు అనుమతి * ఎన్‌ఆర్‌సీ బిల్లుకిమంత్రివర్గం ఆమోదం*కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొనసాగుతున్న పోలింగ్*రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక గత మూడు నెలలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు*చిత్తూరుజిల్లాలో దారుణం... కాలేజి నుండి వస్తుండగా బాలిక కిడ్నాప్*విజయవాడలో అజిత్ సింగ్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు*నేడు పోలీస్‌ కస్టడీకి దిశ నిందితులు..నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు..వారం రోజుల పాటు విచారణ*నేడు ఆర్బీఐ విధాన సమీక్ష.. వడ్డీరేట్ల పై కీలక ప్రకటన చేయనున్న ఆర్బీఐ *శబరిమల సన్నిధిలో సెల్ ఫోన్లు బంద్... స్వామి గర్భగుడి పరిసర ప్రాంతాల్లో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేదించిన ట్రావెన్ కోర్ బోర్డు *తెలంగాణ సెక్యూరిటీ కమిషన్, పోలీస్ కంప్లైట్ అథారిటీని ఈ నెల 27వ తేదీలోగా ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశం*వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. రోజుకు నలుగురిని విచారించిన సిట్ బృందం.. రేపు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించనున్న సిట్

ఇది అది కాదు... అదే ఇది: మరో షావోమీ మార్క్‌ డివైజ్‌

02-12-201902-12-2019 09:42:22 IST
2019-12-02T04:12:22.457Z02-12-2019 2019-12-02T04:12:20.626Z - - 06-12-2019

ఇది అది కాదు... అదే ఇది: మరో షావోమీ మార్క్‌ డివైజ్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏదైనా వస్తువు అలానే ఉండాలి అని ఎక్కడైనా రాసి ఉందా అంటే లేదనే చెప్పాలి. అందుకే కొంతమంది ఔత్సాహికులు సాధారణంగా ఉండాల్సిన డిజైనలో కాకుండా.. కాస్త కొత్తగా ప్రయత్నిస్తుంటారు. నేలవిడిచిసాము చేయని కొన్ని డిజైన్లకు మంచి ఆదరణే లభిస్తుంటుంది.  చైనా గ్యాడ్జెట్ల దిగ్గజం షావోమీ అలాంటి ప్రయత్నమే చేసింది. స్మార్ట్‌ ఫోన్లు వాడేవాళ్లందరికీ కచ్చితంగా అవసరమవుతున్న పవర్‌ బ్యాంకును పాటల పెట్టెలా మార్చేసింది. అదేనండి ఎఫ్‌ ఎం రేడియో ఆకారంలో పవర్‌ బ్యాంకును లాంచ్‌ చేసింది. 

షావోమీ కొత్త పవర్‌ బ్యాంకు మీ మొబైళ్లనే కాదు.. పాటలతో మీ మూడ్‌ని కూడా ఛార్జ్‌ చేస్తుంది. దీనిని ఛార్జింగ్‌ పెట్టినప్పుడు కూడా వేరే గ్యాడ్జెట్లను ఛార్జ్‌ చేయగలదు. దీని ప్రత్యేకలలో ఇదొకటి.  ఇందులో రెండు యూఎస్‌బీ -ఎ పోర్టులు ఉంటాయి. దీని డిజైన్‌ విషయానికొస్తే ఇది పూర్తిగా రెట్రో రేడియో అంటే అలనాటి రేడియోలా కనిపిస్తుంది. ఇందులో 10,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. దీని ధర చైనా కరెన్సీని మన కరెన్సీలోకి కన్వర్ట్‌ చేస్తే సుమారు రూ. 1,500. అయితే ఈ పవర్‌ బ్యాంకు మన దేశానికి ఎప్పుడు తీసుకొస్తారనేది తెలియాల్సి ఉంది. 

షావోమీ కొత్త పవర్‌ బ్యాంకును ప్లాస్టిక్‌తో పోర్టబుల్‌ డిజైన్‌ రూపంలో తీర్చిదిద్దింది. 5 వాట్‌.. 2.1 యాంప్‌ కెపాసిటీతో దీని ద్వారా డివైజ్‌లను ఛార్జ్‌ చేయొచ్చు. ఈ ఎఫ్‌ఎంను టైమ్‌ ఫ్లైస్‌, ది ఏజ్‌ ఆఫ్‌ ఎల్వీస్‌ అంటూ షావోమీ నాటి రోజులు గుర్తు చేస్తూ మార్కెటింగ్‌ చేస్తోంది. ఈ ఎఫ్‌ఎం కమ్‌ పవర్‌ బ్యాంకులో యూఎస్‌బీ 2.0 పోర్టు ఉంటుంది. ఇదొక్కటే ఇందులో డ్రాబ్యాక్‌ అని చెప్పొచ్చు. యూఎస్‌బీ 3.0 పోర్టుల కాలంలో 2.0 అంటే ఇబ్బందే అని చెప్పాలి. కొత్త పోర్టుతో మరో పవర్‌ బ్యాంకు తీసుకొస్తారేమో చూడాలి. 

Image result for xiaomi launches new power bank with fm radio


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle