newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఇక మొబైల్స్, కరెన్సీ వైరస్ ఫ్రీ .. డీఆర్‌డీవో నయా సృష్టి

12-05-202012-05-2020 09:23:18 IST
Updated On 12-05-2020 09:29:31 ISTUpdated On 12-05-20202020-05-12T03:53:18.865Z12-05-2020 2020-05-12T03:53:03.292Z - 2020-05-12T03:59:31.382Z - 12-05-2020

ఇక మొబైల్స్, కరెన్సీ వైరస్ ఫ్రీ .. డీఆర్‌డీవో నయా సృష్టి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ వ్యాపిస్తున్న వేళ ఏ వస్తువును, ఏ ఎలక్ట్రానిక్స్ పరికరాన్ని ముట్టుకోవాలన్నా ఇబ్బందిగానే వుంది. ఎందులో వైరస్ వుందో అర్థంకాని పరిస్థితి. అయితే ఇప్పుడా చింత లేదు. ఎంచక్కా మీరు మీ ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ ని నిరభ్యంతరంగా వాడుకోవచ్చంటున్నారు డీఆర్ డీవో సైంటిస్టులు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌ , ప్రీమియర్ ల్యాబ్, హైదరాబాద్ కేంద్రంగా ప‌ని చేస్తున్న‌ రీసెర్చ్ సెంటర్ ఇమారత్) ఆటోమేటెడ్ కాంటాక్ట్‌లెస్ యూవీసీ శానిటైజేషన్ పరికరాన్ని అభివృద్ధి చేసింది. 

దీనికి డిఫెన్స్ రీసెర్చ్ అతినీల లోహిత శానిటైజర్(డీఆర్‌యూవీఎస్) అని పేరుపెట్టారు. ఈ ప‌రిక‌రం ద్వారా మొబైల్ ఫోన్లు, ఐప్యాడ్‌లు, ల్యాప్‌టాప్‌లు, కరెన్సీ నోట్లు, చెక్ లీఫ్‌లు, చలాన్లు, పాస్ బుక్‌లు, పేపర్, ఎన్వలప్‌లు మొదలైన వాటిని వైరస్ ఫ్రీగా మార్చవచ్చు. వీటిని త‌గిన విధంగా శ‌భ్రపరిచేలా దీనిని రూపొందించారు. డీఆర్‌యూవీఎస్ క్యాబినెట్ కాంటాక్ట్‌లెస్ ఆపరేషన్ కలిగి ఉంటుంది.వైరస్ వ్యాప్తిని క‌ట్ట‌డి చేసేందుకు గాను ఇది ఎంత‌గానో ఉప‌యుక్తంగా ఉండనుంది. 

సామీప్య సెన్సార్ స్విచ్‌లు, డ్రాయర్ ఓపెనింగ్ మరియు క్లోజింగ్ మెకానిజంతో దీని ఆపరేషన్‌ను ఆ‌టోమేటిక్ మరియు కాంటాక్ట్‌లెస్‌గా చేస్తోంది. క్యాబినెట్ లోపల ఉంచిన వస్తువులకు యూవీసీ 360 డిగ్రీల పూర్తి ఎక్స్ పోజర్స్ ని అందిస్తుంది. శానిటైజేషన్ పూర్తయిన తర్వాత సిస్టమ్ దానంత‌ట అదే స్లీప్ మోడ్‌లోకి వెళుతుంది, దీంతో ఆపరేటర్ పరికరం దగ్గర వేచి ఉండక్కర్లేదు. అంతేకాదు కరోనా వైరస్ నేపథ్యంలో డీఆర్‌యూవీఎస్ క్యాబినెట్‌ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఎంతో ఉపకరిస్తుంది.

కరెన్సీ నోట్ల‌ను శుభ్రపరిచే పరికరం ద్వారా నోట్లు క్లీన్ అవుతాయి. ఆర్‌సీఐ సంస్థ స్వయంచాలక యూవీసీ కరెన్సీ శానిటైజింగ్ పరికరాన్ని కూడా అభివృద్ధి చేసింది. దీనికి నోట్స్‌క్లీన్‌ అని నామ‌క‌ర‌ణం చేశారు. కరెన్సీ నోట్ల కట్టలను డీఆర్‌యూవీఎస్ ఉపయోగించి శుభ్రపరచవచ్చు. అయితే ప్రతి కరెన్సీ నోట్లను క్రిమిసంహారణ‌ చేయడం సమయం తీసుకునే ప్రక్రియ అవుతుంది. దీని కోసం ఒక పరిశుభ్ర మయిన విధానం అవసరం. ఈపరికరం యొక్క ఇన్ పుట్ స్లాట్ వద్ద వదులుగా ఉన్న కరెన్సీ నోట్లను ఉంచితే..ఇది నోట్లను ఒక్కొక్కటిగా ఎంచుకొంటూ పూర్తి క్రిమిసంహారణ చేస్తుంది. అత్యంత శక్తివంతమయిన వెలుగులో కరెన్సీ నోట్లు శుభ్రం అవుతాయి.  దీంతో కరెన్సీ నోట్లు వైర‌స్ ర‌హితంగా శుభ్ర‌ప‌ర‌చ‌బ‌డ‌తాయి. వీటిని కస్టమర్లకు ఇవ్వడానికి, వారు తీసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం వుండదు. కస్టమర్లు డిపాజిట్ చేసే నోట్లను కూడా శుభ్రం చేసి స్ట్రాంగ్ రూంలోకి పంపించవచ్చు. 

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   6 hours ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle