newssting
BITING NEWS :
తీవ్ర వివాదాల మధ్యనే పార్లమెంటులో ఆమోదం పొందిన రెండు వ్యవసాయ బిల్లులు. ఆదివారం రాజ్యసభ ఆమోదం పొందిన బిల్లులు. రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఇవి చట్టరూపం. ఈ బిల్లులు వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తాయని, రైతులకు ఇవి మరణ శాసనాలని పేర్కొంటూ ప్రతిపక్ష పార్టీల సభ్యులు రాజ్యసభలో తీవ్ర నిరసన వ్యక్తం చేసినా వెనక్కు తగ్గని కేంద్రం * రాజ్యసభలో కొనసాగుతున్న దుమారం. విపక్షాల ఆందోళన మధ్య వ్యవసాయ బిల్లులకు ఆమోదం లభించిన నేపథ్యంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌పై అవిశ్వాస తీర్మానం. హరివంశ్‌పై అవిశ్వాస తీర్మానానికి ఆదివారం 12 విపక్ష పార్టీలు నోటీసు. ప్రజాస్వామిక విలువలను, సంప్రదాయాలను హరివంశ్‌ తూట్లుపొడిచారాని కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్‌ విమర్శ * అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరపన అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న తమిలనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ ముందస్తు విడుదల కోసం మరోసారి ప్రయత్నాలు. శశికళ విడుదల కోసం అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్‌ ఢిల్లీకి పయనం. సుప్రీం కోర్టు న్యాయవాదులు, న్యాయనిపుణులతో చర్చలు * ఆరు నెలల తర్వాత సోమవారం ఉదయం సందర్శకుల కోసం తెరుచుకున్న ఆగ్రాలోని అంతర్జాతీయ చారిత్రక పర్యాటక కేంద్రం తాజ్‌మహల్‌. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ బారులు తీరిన సందర్శకులు. సోమవారం 160 మంది పర్యాటకులు ఆన్ లైన్ లో టికెట్లు కొనుగోలు. రెండు షిఫ్తుల్లో రెండు వేలమందికి అనుమతులు * మహారాష్ట్రలోని భీవండి నగరంలో తీవ్ర విషాదం. మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలి పది మంది మృతి, మరో 20 మందికి గాయాలు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకున్నట్లు సమాచారం. పోలీసులు, ఫైర్ సిబ్బందితో పాటు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ముమ్మర సహాయక చర్యలు * నేటి నుండి హైకోర్టులో అమరావతి రైతులు, రైతు పరిరక్షణ సమితి, మాజీ ఎంఎల్‌ఏ శ్రవణ్ కుమార్ తదితరులు వేసిన పిటిషన్‌లపై రోజువారీ విచారణ. నేడు ధర్మాసనం ముందు లిస్ట్ అయిన 93 పిటిషన్‌లు విచారణ. ఆన్‌లైన్ ద్వారా రాజధానికి సంబంధించిన కేసులను విచారించనున్న ధర్మాసనం * నేటి నుండి అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనాల పునరుద్ధరణ. ఆలయ ప్రాంగణంలో దేవస్థానం పరిసర ప్రాంతాల్లో కరోనా కేసుల కారణంగా దర్శనాలు నిలిపివేయగా నేటి నుండి తిరిగి దర్శనాలు ప్రారంభం. సామాజిక దూరం పాటిస్తూ, శానిటైజర్‌ వాడుతూ క్యూలైన్‌లో దర్శనం. పిల్లలకు, వృద్ధులకు ఆలయంలోకి నో ఎంట్రీ * భారీ వర్షాలతో పోటెత్తిన కృష్ణా, పెన్నా, తుంగభద్ర నదులకు వరద. పలు గ్రామాలు ముంపునకు గురవడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు. పలు గ్రామాల్లో వరదలలో చిక్కుకున్న 48 మంది రైతులు, వ్యవసాయ కూలీలు, రక్షించిన ఎస్టీఆర్‌ఎఫ్‌ బృందాలు * కేంద్రం జారీ చేసిన కోవిడ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యాశాఖ ఉత్తర్వులు. నేటి నుంచి 50 శాతం మంది టీచర్లు బడులకు హాజరు. సోమవారం నుంచి విద్యార్థులు లేకుండానే కొనసాగనున్న పాఠశాలలు * ఈశాన్య బంగా‌ళా‌ఖాతంలో ఆది‌వారం ఉదయం ఏర్పడిన అల్ప‌పీ‌డనం. సోమ‌వారానికి మ‌రింత బలపడి అను‌బం‌ధంగా 3.1 కి.మీ. నుంచి 7.6 కి.‌మీ. ఎత్తు‌వ‌రకు ఉప‌రి‌తల ఆవ‌ర్తనం. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం.

ఇక జియో వైఫై ఫ్రీ వాయిస్ కాల్స్

08-01-202008-01-2020 17:22:49 IST
Updated On 09-01-2020 10:44:02 ISTUpdated On 09-01-20202020-01-08T11:52:49.496Z08-01-2020 2020-01-08T11:52:46.473Z - 2020-01-09T05:14:02.291Z - 09-01-2020

ఇక జియో వైఫై ఫ్రీ వాయిస్ కాల్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రిలయెన్స్ జియో తన ఖాతాదారులకు శుభవార్త అందించింది. జియో ద్వారా ఏ వైఫై అందుబాటులో ఉన్నా దానినుంచి ఫ్రీ వాయిస్ కాల్స్ చేసుకునే సదుపాయం తీసుకొచ్చింది. ఈ వైఫై ఫ్రీ కాల్స్ 150 హ్యాండ్ సెట్స్ పై పొందవచ్చని జియో వెల్లడించింది. ఇంతకుముందే భారతి ఎయిర్ టెల్ ఈ తరహా వైఫై కాలింగ్ సదుపాయం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. బుధవారం జియో సంస్థ వీడియో మరియు వాయిస్ ఓవర్ వైఫై (వీవోవైఫై) సర్వీసును ఇండియాలో ప్రవేశపెట్టినట్టు తెలిపింది. 

ఈ వీడియో వైఫై కాలింగ్ పై గత కొద్దినెలలుగా పరీక్షలు నిర్వహించింది. ఈ ప్రయోగం విజయవంతం అయిందని తెలిపింది. ఈ జియో సర్వీసు 150 స్మార్ట్ ఫోన్ మోడల్స్ పై అందుకోవచ్చు. ప్రధాన నగరాల్లో ఈ సౌకర్యం పొందవచ్చునని జియో చెబుతోంది. ఈ వాయిస్ మరియు వీడియో కాల్స్ సౌకర్యం వోల్ట్ -వైఫై ద్వారా అందుకునే అవకాశం వుంది. ఈ సౌకర్యం పొందడానికి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలుచేయడం లేదు. 

మీ స్మార్ట్ ఫోన్లలో సెట్టింగ్స్‌లలో వైఫై కాలింగ్ బటన్ ఎనేబుల్ చేసుకోవాలి. జియో వైఫై కాలింగ్ జనవరి 7 నుంచి 16 మధ్య పొందవచ్చు. ప్రస్తుతం ప్రతి జియో కస్టమర్ 900 నిముషాల వాయిస్ కాల్స్ వినియోగిస్తున్నారు.

ఈ కాల్స్ అన్నీ ఇకపై ఫ్రీ వైఫై కాల్స్ గా చేసుకోవచ్చున. దేశమంతా ఈ సౌకర్యం తీసుకొస్తామని జియో డైరెక్టర్ ఆకాష్ అంబానీ చెబుతున్నారు. భారతీ ఎయిర్ టెల్ వైఫై కాలింగ్ కాలింగ్ ఢిల్లీ, ముంబై, తమిళనాడు, కోల్ కత్తా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన ప్రీమియం స్మార్ట్ ఫోన్లలో మాత్రమే అందిస్తోంది. జియో సేవలు అందుబాటులోకి వస్తే ఇతర నెట్ వర్క్ లపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle