newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఇక ఆన్ లైన్లో కరోనా టెస్ట్.. ఎలాగో తెలుసా?

31-03-202031-03-2020 17:00:34 IST
Updated On 31-03-2020 19:34:26 ISTUpdated On 31-03-20202020-03-31T11:30:34.944Z31-03-2020 2020-03-31T11:29:44.129Z - 2020-03-31T14:04:26.087Z - 31-03-2020

ఇక ఆన్ లైన్లో కరోనా టెస్ట్.. ఎలాగో తెలుసా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ అందరినీ భయపెడుతూనే వుంది. కరోనావైరస్ టెస్టులను ఇకపై ఆన్ లైన్ లోనే బుక్ చేసుకునే అవకాశం వచ్చిందని మీకు తెలుసా? ప్రముఖ మెడికల్ ప్లాట్ ఫాం ప్రాక్టో ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు తెలిపింది. ఇవి ప్రారంభదశలో ముంబైలోనే అందుబాటులో ఉన్నాయి. త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానుంది. కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్)ల అనుమతులను కూడా ప్రాక్టో పొందింది. ఈ టెస్టులను నిర్వహించడానికి థైరోకేర్ తో ఒప్పందం కుదుర్చుకుంది.

Image may contain: text

Image may contain: text

Image may contain: possible text that says 'Highly recommended for people with Frequent Headaches Acute respiratory problems Sore throat High fever fever Shortness of breath Pneumonia Includes 1 Test Covid 19 Virus Qualitative Pcr Throat Swab'

No photo description available.

No photo description available.

 

ఎలా చేస్తారు?

డాక్టర్ ప్రిస్క్రిప్షన్, ఫిజీషియన్ సంతకం చేసిన టెస్ట్ ఫారం, ఫొటో ఐడీ కార్డులను టెస్టు సమయంలో అందించాలి. ఈ టెస్టును బుక్ చేసుకోవడానికి రూ.4,500 ఖర్చు అవుతుందని తెలిపింది. వెబ్ సైట్ల ద్వారా ఈ టెస్టును ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చని ప్రాక్టో తెలిపింది. అత్యంత నైపుణ్యం ఉన్న వైద్యులు నేరుగా ఇంటికి వచ్చి మీ శాంపిల్స్ ను సేకరిస్తారని వెల్లడించింది. 

శాంపిల్స్ తీసుకునేటప్పుడు ఐసీఎంఆర్ నియమాలన్నిటినీ తుచ తప్పకుండా పాటిస్తారని తెలిపింది. తర్వాత 24 నుంచి 48 గంటల్లో దీనికి సంబంధించిన ఫలితాలను పేషెంట్లు ప్రాక్టో వెబ్ సైట్లో చూసుకోవచ్చు.  కోవిడ్-19 వేగంగా వ్యాప్తిస్తున్నందున వీలైనంత ఎక్కువమందికి ఈ టెస్టు చేయాల్సిన అవసరం ఉందని ప్రాక్టో చీఫ్ హెల్త్ స్ట్రాటజీ ఆఫీసర్ అలెగ్జాండర్ కురువిల్లా తెలిపారు.

వ్యాధి లక్షణాలు కనిపించిన ప్రతి ఒక్కరికీ దీనికి సంబంధించిన టెస్టులు జరిగేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుందని పేర్కొన్నారు. వైద్యపరమైన సలహాలు, పరీక్షలు, మందుల డెలివరీ వంటి అంశాల్లో ప్రభుత్వానికి తమ నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో భారతీయులందరికీ నాణ్యమైన వైద్యసేవలు అందించడమే తమ లక్ష్యమని అలెగ్జాండర్ కురువిల్లా తెలిపారు. కరోనా టెస్టుల్లో వచ్చే ఫలితాలు గోప్యంగా ఉంటాయని, టెస్టు ఫలితాలను బట్టి వెంటనే చికిత్స తీసుకోవడం ద్వారా రిస్క్ తగ్గించుకోవచ్చని సంస్థ తెలిపింది. వేలాదిరూపాయలు గుంజేసే టెస్ట్ లు చేయించే ప్రైవేటు సంస్థలతో పోలిస్తే తమ సేవలు విశ్వసనీయతతో, నాణ్యతలో వుంటాయంటోంది. దేశవ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్న వేళ ఈ ఆన్ లైన్ టెస్ట్ ఉపశమనంగా భావించవచ్చు. 

https://www.practo.com/covid-test, https://covid.thyrocare.com/

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle