ఇక్కడ మొబైల్స్ సెలక్ట్ చేసుకోవడం చాలా ఈజీ
12-06-201912-06-2019 15:47:56 IST
Updated On 14-06-2019 12:27:50 ISTUpdated On 14-06-20192019-06-12T10:17:56.845Z12-06-2019 2019-06-12T10:13:44.159Z - 2019-06-14T06:57:50.841Z - 14-06-2019

రోజురోజుకీ టెక్నాలజీ మారిపోతోంది. ప్రతి ఒక్కరి దగ్గర రెండు మూడు మొబైల్స్ ఖచ్చితంగా ఉంటున్నాయి. దీంతో వివిధ సంస్థలు వందలాది మొబైల్స్ విక్రయకేంద్రాలు ఏర్పాటుచేస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ‘సెలెక్ట్’ మొబైల్ సంస్థ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తోంది. మాదాపూర్ లోని సెలెక్ట్ షోరూం వినియోగదారులకు ఎక్కువగా ఆకట్టుకుంటోంది.

తిరుపతిలో గత ఏడాది తొలి షోరూం ప్రారంభమయింది. ఇండియా వ్యాప్తంగా ఇప్పటివరకూ 55 షోరూంలు ఏర్పాటుచేసింది. ఈ ఏడాది చివరినాటికి 100 షోరూంలు ఏర్పాటుచేయాలని భావిస్తున్నామని షోరూం మేనేజర్ ప్రశాంత్ ‘న్యూస్ స్టింగ్’ తో చెప్పారు. మిగతా షోరూంల కంటే తమదగ్గర ప్రత్యేకతలు అనేకం ఉన్నాయంటున్నారు. ప్రతి వినియోగదారుడు తమకు కావల్సిన మొబైల్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. వినియోగదారులపై తాము ఎలాంటి వత్తిడి చేయడం లేదన్నారు. తమదగ్గర ఉన్న మొబైల్ ఎక్స్ పర్ట్ సూచన మేరకు వినియోగదారులు తమ బడ్జెట్, అభిరుచికి తగ్గట్టుగా మొబైల్స్ కొనుక్కోవచ్చంటున్నారు.
మొబైల్స్ కొనుగోలుతోనే తమ పని అయిపోయిందని ఈ సంస్థ భావించడంలేదు. మొబైల్స్ కి డ్యామేజీ ప్రొటెక్షన్ అందిస్తోంది. సెలెక్ట్ షోరూంకే హైలైట్ గా నిలిచే సీసేఫ్ పథకానికి అనూహ్య స్పందన లభిస్తోందని ప్రశాంత్ ‘న్యూస్ స్టింగ్’ కి చెప్పారు. సీసేఫ్తో వినియోగదారులకు ఎంతో మేలు జరుగుతోందన్నారు. అంతేకాదు సెలెక్ట్ సేఫ్ సీసేఫ్ ఆప్షన్ తీసుకుంటే ఎంత ఖరీదైన మొబైల్ అయినా, ఎలాంటి డ్యామేజ్ అయినా తామే భరిస్తామని, దీనికి నిబంధనలు ఏం ఉండవు. ఆరునెలలు, ఏడాదికి ప్యాకేజ్ తీసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్లు 25 వేలు ఖర్చుంటే. డిస్ ప్లే పాడయితే తామే బాగుచేయించి ఇస్తాం. దీనికి తక్కువ ప్రీమియం ఉంటుందని ప్రశాంత్ వివరించారు. వినియోగదారులు కూడా ఈ పథకం పట్ల సంతృప్తిగా ఉన్నారు.
కొత్తగా వచ్చిన వీవో 11 ప్రో ..ఇతర మోడల్స్ గురించి సెలెక్ట్ ఎక్స్ పర్ట్ ఏం చెబుతున్నారో చూద్దాం. ఈ మోడల్స్ యూత్‌ని బాగా ఆకట్టుకుంటున్నాయని సెలక్ట్ నిపుణులు చెబుతున్నారు. సెలెక్ట్ బ్రాండ్ అంబాసిడర్ జూనియర్ ఎన్టీఆర్ కావడంతో ఆయన అభిమానులు ఎక్కువగా తమ షోరూంకి వస్తున్నారని ప్రశాంత్ ఆనందంగా చెప్పారు.
బయటి షోరూంలతో పోలిస్తే తమ దగ్గర ధర తక్కువగా ఉంటుందన్నారు. లైవ్ డెమో ద్వారా తమకు నచ్చిన ఫోన్లు వినియోగదారులు ఫీలై కొనుక్కోవచ్చునని..తమ షోరూంలో. రూ.500 నుంచి లక్షా 25 వేలు వరకూ అత్యాధునిక ఫోన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. 99 రూపాయల నుంచి 50 వేల వరకూ అన్నిరకాల యాక్సెసరీస్ ఇక్కడ దొరుకుతున్నాయి. అంతేకాదు ఇయర్ ఫోన్స్ కూడా డెమోలో చూసి కొనుక్కోవచ్చు.
యూత్ ఎక్కువగా సెల్ఫీ కెమేరాలు, పాప్ అప్ కెమేరాలు ఉన్న అత్యాధునికి ఫోన్లు కొంటున్నారు. దానిని దృష్టిలో ఉంచుకుని వివో, ఎంఐ, శాంసంగ్, ఒప్పో, నోకియా బ్రాండ్లను షోరూంలో ఉంచామన్నారు షోరూం మేనేజర్ ప్రశాంత్. రూ 10 వేల లోపు ఎంఐ, శాంసంగ్, వివో ఫోన్లు, రూ.10 వేల నుంచి 30 వేల లోపు ఎంఐ, శాంసంగ్, వివో, ఒప్పో, హానర్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. యూత్ ఎక్కువగా వివో వీ15 ప్రొ, ఎంఐ 7 ప్రొ, శాంసంగ్ ఎ 50, ఎ 70, ఒప్పో ఎఫ్ 11 ప్రొ ఫోన్లను ఆదరిస్తున్నారని ప్రశాంత్ వెల్లడించారు.
మొత్తం మీద స్మార్ట్ ఫోన్ వినియోగదారులు కోరుకునే అన్నిరకాల ఫోన్లు సెలెక్ట్ లో దొరుకుతాయని, తమ షోరూం ఎగ్జిక్యూటివ్స్ వినియోగదారులకు ఎలాంటి మొబైల్స్ అందుబాటులో ఉన్నాయో వివరించి, వారికి అన్నివిధాలుగా సహాయపడతారన్నారు. ఒకసారి తమ షోరూంకి వచ్చి ధరల తేడా, ఇతర ప్రత్యేకతలను ఫీల్ కావచ్చని అంటున్నారు ప్రశాంత్.


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా