ఇండియాలో ఇంటర్నెట్ పరుగులు.. ఎవరి వల్లో తెలుసా?
17-06-201917-06-2019 18:11:23 IST
2019-06-17T12:41:23.110Z17-06-2019 2019-06-17T12:41:17.832Z - - 10-04-2021

ఒకప్పుడు 2జీ, 3జీ సర్వీసులే అందరికీ అందేవి కాదు. కానీ ఇప్పుడు 4జీ సేవలు అందరికీ దగ్గరయ్యాయి. ఇండియాలో 4జీ పుణ్యమా అని ఇంటర్నెట్ వాడకం శృతిమించిపోతోంది. ఇండియాలోని వినియోగదారులు ఇంటర్నెట్ వాడకంలో ఏకంగా అమెరికాను మించిపోవడం విశేషం. యూజర్ బేస్‌లో ప్రపంచవ్యాప్తంగా 12 శాతం వాటాతో ఇండియా ఏకంగా 2వ స్థానంలో ఉందని ఒక సర్వే చెబుతోంది. చైనా 21 శాతం వాటాతో ప్రపంచంలో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. ఈ ఘనత దక్కడంలో, అధికవేగం డేటా సేవల (4జీ)ను, తక్కువ ధరల్లో అందుబాటులోకి తెచ్చిన రిలయన్స్ జియో పాత్ర ఎంతో కీలకమని ఈ నివేదిక పేర్కొంది. అగ్రరాజ్యం అమెరికా మాత్రం వినియోగదారుల వాటా 8 శాతంగా ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది. ఇంటర్నెట్ ట్రెండ్స్‌పై ఈ నివేదిక రూపొందించింది ఒక సంస్థ. జియో సేవల వల్ల భారత్‌లో ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా పెరిగినట్లు మారీ మేకర్ నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 380 కోట్ల మందికి చేరింది. కాగా ప్రపంచ జనాభాలో ఇది సగానికి కంటే ఎక్కువ. జియో దెబ్బకు 3 నెలల్లో వొడాఫోన్-ఐడియా నష్టం రూ.4882 కోట్లకు చేరిందని వెల్లడైంది. జియో నుంచి వస్తున్న తీవ్ర పోటీని తట్టుకోవడానికి ఆగస్ట్ 2018లో ఐడియా - వొడాఫోన్ సంస్థలు రెండూ విలీనమయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వీటి పేరు వొడాఫోన్ ఐడియాగా మారింది. ఇక మార్చితో ముగిసిన క్వార్టర్లో సంస్థ ఆదాయం రూ.11755 కోట్లుగా ఉంది. భారతి ఎయిర్టెల్ రూ.10632 కోట్లు, రిలయన్స్ జియో రూ.11,106 కోట్లు కంటే ఎక్కువ ఆదాయాన్ని వొడాఐడియా సంపాదించింది. అయితే వినియోగదారులను నిలుపుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి ఐడియా-వోడా ఫోన్.

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
3 hours ago

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా