ఇంటర్నెట్ : యూత్ తెగ వాడేస్తున్నారు!
28-12-201928-12-2019 15:15:08 IST
Updated On 28-12-2019 15:15:04 ISTUpdated On 28-12-20192019-12-28T09:45:08.112Z28-12-2019 2019-12-28T09:42:24.408Z - 2019-12-28T09:45:04.490Z - 28-12-2019

గతంతో పోలిస్తే మనదేశంలో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్, అందులో జీబీల కొద్దీ డేటా. దీంతో జనం తెగ వాడేసున్నారు. భారత్లో ఇంటర్నెట్ డేటా వినియోగం మునుపెన్నడూ లేని విధంగా పెరిగిపోయిందని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ట్రాయ్ విడుదలచేసిన తాజా గణాంకాల ప్రకారం.. 2019 సెప్టెంబర్ వరకు 54,917 మిలియన్ల జీబీ డేటాను భారతీయులు వినియోగించారు. ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లు వాడడం, జియో వంటి సంస్థలు తక్కువ ధరకే డేటా అందించడంతో ఎడాపెడా వాడేశారు.

2014లో కేవలం 828 మిలియన్ల జీబీ డేటాను మాత్రమే భారతీయులు వినియోగించారని ట్రాయ్ తెలిపింది. 2018కి వచ్చే సరికి ఈ వినియోగం 46,406 మిలియన్ల జీబీకి పెరిగింది. తాజాగా ఈ సంవత్సరంలో సెప్టెంబర్ వరకే రికార్డు స్థాయిలో 54,917 మిలియన్ల జీబీ డేటాను భారతీయులు ఉపయోగించారు. 2014లో వైర్లెస్ ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య 281.58 మిలియన్లు ఉండగా.. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి వారి సంఖ్య 664.80 మిలియన్లకు చేరింది.
ఈఏడాది డిసెంబర్ నాటికి మరింత పెరిగిందని తెలుస్తోంది. గతంలో నెలకు ఒక జీబీ డేటాకు అధిక ఛార్జీలు చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రతి నెట్ వర్క్ రోజుకి 1.5 జీబీకి తక్కువ కాకుండా డేటా అందిస్తోంది. దీంతో వినియోగదారులు ముఖ్యంగా యువత ఇంటర్నెట్ ని వాడేస్తోంది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా