newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఇంగ్లిషు వీడియోల అనువాదం ఇక బహుసులభం

20-02-202020-02-2020 16:25:41 IST
2020-02-20T10:55:41.390Z20-02-2020 2020-02-20T10:55:38.912Z - - 11-04-2021

ఇంగ్లిషు వీడియోల అనువాదం ఇక బహుసులభం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇంగ్లిష్‌ భాష నుంచి పలు భారతీయ భాషల్లోకి వివిధ రకాలైన వీడియో క్లిప్‌లను సులభంగా తర్జుమా చేయగలిగే సాంకేతిక సాధనం ఉనికిలోకి వచ్చింది. దాని పేరు లిప్‌గాన్ మాడ్యూల్. ఇది వీడియో క్లిప్స్‌ను ఒక భాష నుంచి మరో భాషలోకి అనువదించే టూల్‌.  ఈ ఘనత ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ– హైదరాబాద్‌ (ఐఐఐటీ–హెచ్‌)కి దక్కడం మరీ విశేషం. భాష ఏదైనా, ఆ మాట్లాడే వ్యక్తి భావాన్ని యథాతథంగా తెలుగు ఆడియో క్లిప్‌ ద్వారా మీకందించే సరికొత్త టూల్‌ ఇది. 

ఈ పరికరం సహాయంతో ఇంగ్లిష్ లోని వీడియో క్లిప్‌ను మరోభాషలోకి తేలికగా అనువదించేందుకు ఈ టూల్ అద్భుతంగా చేస్తుందని ఐఐఐటీ–హెచ్‌ వర్గాలు తెలిపాయి. ఒక భాష నుంచి మరో భాషలోకి తేలికగా అనువదించే ఈ పరికరం యానిమేషన్, డబ్బింగ్, మీడియా, ట్రాన్స్‌లేషన్‌ రంగాలకు చక్కగా ఉపకరిస్తుందని భావిస్తున్నారు. అదే సమయంలో దీన్ని సాధారణ ఉపయోగంలోకి తీసుకువస్తే ఈ రంగాల్లోని అనేకమంది ఉపాధి అవకాశాలకు గండి పడుతుందని కూడా భయపడుతున్నారు.

లిప్‌గాన్ మాడ్యూల్ ఇంతవరకు ఆడియో, వీడియోలను ఇంగ్లిషు తదితర భాషల నుంచి వినడంలో చాలామందికి ఎదురవుతున్న సమస్యను మటుమాయం చేస్తుందని సాంకేతిక నిపుణుల భావన. మిషన్‌ లెర్నింగ్‌ సాంకేతికతలో ఇదో సరికొత్త ఆవిష్కరణ అని ఐఐఐటీ వర్గాలు చెబుతున్నాయి. వీడియో క్లిప్‌ను ఒక భాష నుంచి మరో భాషలోకి తేలికగా అనువదించేందుకు ఈ టూల్‌ అద్భుతంగా పనిచేస్తుందని ఐఐఐటీ–హెచ్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగం డీన్‌ సీవీ జవహర్‌ తెలిపారు.  

ఇది ఎలా పనిచేస్తుంది అంటే.. పెదాల కదలికల ఆధారంగా జరిగే సంభాషణ కూడా ఎలాంటి పొరపాట్లు లేకుండా, లిప్‌ సింక్రనైజేషన్‌ మిస్‌ కాకుండా ఈ పరికరం ద్వారా తర్జుమా చేసుకోవచ్చు. టెక్నాలజీ పరిభాషలో ఈ ఆవిష్కరణను ‘లిప్‌గాన్‌ మాడ్యూల్‌’అంటారు. తర్జుమా అయ్యే భాషకు అనుగుణంగా ఈ మాడ్యూల్‌ వీడియో క్లిప్‌లోని వ్యక్తి లిప్‌ మూమెంట్‌ను సరిచేస్తుంది.

ముఖ్యంగా డబ్బింగ్ రంగంలో దీని ప్రయోజనం ఇంతా అంతా కాదని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా డబ్బింగ్‌ సినిమాల్లో లిప్‌ మూమెంట్‌ సరిగ్గా లేక వీడియో క్లిప్‌ నాణ్యత అంతగా ఉండదనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ లిప్‌గాన్‌ మాడ్యూల్‌తో అటువంటి అవస్థలుండవు. దీని ద్వారా గంటల నిడివి ఉన్న వీడియోలను సైతం సులభంగా భారతీయ భాషల్లోకి తర్జుమా చేసుకోవచ్చు. 

అనువాద రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకురానున్న ఈ మెషీన్‌ టూల్‌పై ‘టువార్డ్స్‌ ఆటోమేటిక్‌ ఫేస్‌ టు ఫేస్‌ ట్రాన్స్‌లేషన్‌' పేరుతో పరిశోధన పత్రాన్ని సిద్ధం చేశారు. ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన అంతర్జాతీయ మల్టీమీడియా సదస్సులోనూ దీన్ని సమర్పించారు. మరిన్ని పరిశోధనలు, ప్రయోగ పరీక్షల అనంతరం ఈ మిషన్‌ లెర్నింగ్‌ సాంకేతికతను ఆయా రంగాలు వినియోగించుకునేలా తీర్చిదిద్దుతామని ఐఐఐటీ–హెచ్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగం డీన్‌ సీవీ జవహర్‌ తెలిపారు.

వీడియో క్లిప్‌లో మాట్లాడుతున్న వ్యక్తి భాష, పెదాల కదలిక అర్థం కాక ఇబ్బందిపడే లక్షలాది మంది వీక్షకుల సమస్య ఇకపై తీరనుంది. ఇంతవరకు ఆటోమేటిక్ ట్రాన్స్‌లేషన్ అంటే టెక్స్టు నుంచి టెక్స్టు నుంచి మొదలై తర్వాత ప్రసంగం నుంచి ప్రసంగానికి అనువాదం అనే అర్థమే వాడుకలో ఉంది. కానీ విజువల్ భాగాన్ని అనువదించడం ఇంతవరకు మనిషి ఆచరణలోకి రాలేదు. దీంతో వీడియోరూపంలోని పెదాల కదలికల ఆధారంగా జరిగే సంభాషణ కూడా ఎలాంటి పొరపాట్లు లేకుండా, లిప్‌ సింక్రనైజేషన్‌ మిస్‌ కాకుండా ఈ పరికరం అనుభవంలోకి తీసుకొచ్చింది. వాక్యాలను యధాతథంగా అనువదిస్తూ అర్థాన్ని మార్చిపడేస్తున్న గూగుల్ ట్రాన్స్‌లేటర్‌తో పోలిస్తే ఈ లిప్‌గాన్ (LipGAN) మాడ్యుల్ ఎంతో కచ్చితమైన, నిర్దిష్టమైన ఫలితాలను ఇస్తుందని హైదరాబాద్ ఐఐఐటీ పరిశోధనా విభాగం డీన్ ఖాయంగా చెబుతున్నారు.

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   9 hours ago


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle