newssting
BITING NEWS :
*ఇండియాలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు. గడచిన 24 గంటలలో అత్యధికంగా 27,114 కరోనా పాజిటివ్ కేసులు, 519 కరోనా మరణాలు నమోదు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,20,916. కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 22,123 *కేసీయార్ ఆరోగ్యంపై పిటిషన్.. ఫిర్యాదుదారుపై హైకోర్టు ఆగ్రహం *తెలంగాణలో కరోనా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల నియామకం. 13 మంది ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం. కరోనా కేసులు, బెడ్స్, ల్యాబ్స్ పై సమన్వయం చేయనున్న అధికారులు *ఢిల్లీ: కేంద్రం ఆదేశాలతో ఇంటిని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. లోధీ రోడ్ లో నివాసముంటున్న భవనాన్ని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. వ్యక్తిగత సామాన్లను తల్లి సోనియా గాంధీ ఇంటికి తరలింపు *ఇవాళ తెలంగాణలో 1278 పాజిటివ్ కేసులు నమోదు...8 మంది మృతి..ఇప్పటి వరకు 339 మంది మృతి..హైదరాబాద్ లో 762 పాజిటివ్ కేసులు *బెజవాడలో మరోమారు డ్రగ్స్ కలకలం. డ్రగ్స్, గంజాయి అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్*ఏపీ ఈఎస్ఐ స్కామ్ లో దూకుడు పెంచిన ఏసీబీ.మాజీ మంత్రి పితాని పీఎస్ మురళి అరెస్ట్.మురళీని ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ.పితాని కొడుకు సురేష్ కోసం గాలిస్తున్న ఏసీబీ*కేరళ గోల్డ్ స్మగ్లింగ్ పై కేసు నమోదు చేసిన NIA..నలుగురిపై NIA కేసు నమోదు

ఇంకా 2జీ సేవలనే వినియోగిస్తే ఎలా..5జీ వస్తోందిగా.. ముఖేష్ అంబానీ ప్రశ్న

26-06-202026-06-2020 11:38:18 IST
Updated On 26-06-2020 11:41:04 ISTUpdated On 26-06-20202020-06-26T06:08:18.810Z26-06-2020 2020-06-26T06:08:16.137Z - 2020-06-26T06:11:04.565Z - 26-06-2020

ఇంకా 2జీ సేవలనే వినియోగిస్తే ఎలా..5జీ వస్తోందిగా.. ముఖేష్ అంబానీ ప్రశ్న
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మొబైల్‌, ఇంటర్నెట్‌ వినియోగదారులకు రిలయన్స్‌ జియో శుభవార్త తెలిపింది. త్వరలోనే దేశ ప్రజలకు 5జీ ఎకోసిస్టమ్‌ టెక్నాలజీని అందుబాటులో ఉంచనున్నట్లు రిలయన్స్‌ జియో వార్షిక నివేదికలో ప్రకటించింది.  ఈ విషయమై షేర్‌ హోల్డర్‌ల సమావేశంలో రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌‌ అంబానీ స్పందిస్తూ.. వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు జియో ఎప్పుడు కృషి చేస్తుందని, కానీ ఇప్పటికి లక్షలా మంది వినియోగదారులు 2జీ సేవలనే వినియోగిస్తున్నారని తెలిపారు. 

కాగా 2జీ సేవల వినియోగదారులను 4జీ సేవలను ఉపయోగించే విధంగా రిలయన్స్ సంస్థ కృషి చేసిందన్నారు. అయితే గత రెండు సంవత్సరాలలో 10కోట్ల మందిని 2జీ నుంచి 4జీ సేవలవైపు ఆకర్శించడంలో జియో కీలక పాత్ర పోషిందని పేర్కొన్నారు

మరోవైపు రిలయన్స్ అద్భుత విజయాలతో ప్రపంచ దిగ్గజ కంపెనీ(ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌)లు తమ సంస్థలో పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. కాగా, ప్రస్తుతం దేశంలో 385.7(38కోట్ల)మంది మిలియన్ల వినియోగదారులు జియో సేవలు పొందుతున్నారని ముఖేశ్‌‌ అంబానీ పేర్కొన్నారు. 

కేంద్ర ప్రభుత్వం కూడా స్పెక్ట్రమ్‌ కేటాయింపులు త్వరలో నిర్వహించబోతున్నట్లు ఇటీవల వెల్లడించింది. రిలయన్స్ ఇటీవలి కాలంలో 11 మెగా డీల్స్ సాధించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో చేసుకున్న ఒప్పందాల ద్వారా రిలయన్స్ రుణ రహిత సంస్థగా అవతరించిన విషయం విదితమే.

భారతదేశంలో డిజిటల్ అవకాశాలను మెరుగు పర్చేందుకు ఫేస్‌బుక్ ,  రిలయన్స్ జియో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) చైర్మన్, అపర కుబేరుడు ముకేశ్ అంబానీ వెల్లడించారు.  ఈ ఒప్పందంతో భారతదేశం ప్రపంచంలోని ప్రముఖ డిజిటల్ సొసైటీలలో ఒకటిగా అవతరించనుందని పేర్కొన్నారు. ఇందుకు దీర్ఘకాలిక, గౌరవనీయ భాగస్వామిగా ఫేస్‌బుక్ను స్వాగతిస్తున్నందుకు ఆనందంగా, ఇంతటి ఉత్తేజకరమైన వార్తలను పంచుకోవడానికి సంతోషంగా వుందని అంబానీ తెలిపారు. 

అలాగే  డిజిటల్ టెక్నాలజీతో కొత్త ఉపాధి అవకాశాలను  రాబోతున్నాయని అంబానీ ప్రకటించారు. ఫేస్‌బుక్-జియో అనుసంధానం ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు మూడు కోట్ల కిరాణా దుకాణాలకు భారీ ప్రయోజనాలు  కలగనున్నాయని  చెప్పారు. అలాగే రైతులు, చిన్న, మధ్యతరహా సంస్థలు, విద్యార్థులు , ఉపాధ్యాయుల ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు, అన్నింటికంటే మించి కొత్త భారతదేశానికి పునాది వేసే మహిళలు, యువకులకు డిజిటల్ టెక్నాలజీ ద్వారా కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు.

వాట్సాప్  డిజిటల్ చెల్లింపు సేవను ప్రభుత్వం ఆమోదించిన తరువాత  ఫేస్‌బుక్‌ను జియోలో అతిపెద్ద మైనారిటీ వాటాదారుగా మార్చే ఈ ఒప్పందం అమల్లోకి వస్తుందని తెలిపారు. ఈ కీలకమైన అనుమతితో జియోమార్ట్  ద్వారా చిన్న కిరాణా దుకాణాలు, చిరు వ్యాపారులు ఆన్‌లైన్ బాట పట్టనున్నాయి. తద్వారా స్థానిక దుకాణాలనుండి రోజువారీ వస్తువులను ఆర్డర్ చేయవచ్చు.  పంపిణీ కూడా వేగవంతమవుతుంది. అదే సమయంలో, ఈ దుకాణాలు తమ వ్యాపారాలను పెంచుకోవచ్చు. 

అసోచామ్-పిడబ్ల్యుసి ఇండియా అధ్యయనం ప్రకారం 2023 లో 135.2 బిలియన్ డాలర్ల విలువతో అవతరించబోతున్న డిజిటల్ మార్కెట్ తో ఫేస్‌బుక్ యాజమాన్యంలోని  సంస్థ, గూగుల్ పే , పేటిఎమ్ వంటి వాటితో పోటీ పడేందుకు సిద్ధంగా ఉందన్నారు.  భారతదేశంలో వాట్సాప్  400 మిలియన్ల వినియోగదారులతో,  దాదాపు 80 శాతం స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు చేరువైందని పేర్కొన్నారు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle