newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆ సీరియల్స్‌తో డీడీకి 650 శాతం అధిక వ్యూయర్‌షిప్.. బిత్తరపోతున్న ప్రైవేట్ చానల్స్

11-04-202011-04-2020 16:18:26 IST
Updated On 11-04-2020 16:22:51 ISTUpdated On 11-04-20202020-04-11T10:48:26.544Z11-04-2020 2020-04-11T10:48:24.589Z - 2020-04-11T10:52:51.247Z - 11-04-2020

ఆ సీరియల్స్‌తో డీడీకి 650 శాతం అధిక వ్యూయర్‌షిప్.. బిత్తరపోతున్న ప్రైవేట్ చానల్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రైవేట్ చానల్స్ విజృంభణతో ఒకనాటి వైభోగాన్ని, ప్రజాదరణను కోల్పోయి ఎంతో వెనుకబడిపోయిన దూరదర్శన్ ‌మళ్లీ ఒక్కసారిగా టాప్ రేటింగ్‌ అందుకుంది. దానికి కారణం ప్రత్యక్షంగా రామాయణం, మహాభారతం వంటి అలనాటి సీరియల్స్ అయితే పరోక్షంగా కరోనా వైరస్ ఎంతగానో దోహదపడింది. ఆధునిక ప్రపంచంలో సాంకేతిక ఆవిష్కరణల పుణ్యమా అని ఎంట‌ర్‌టైన్‌మెంట్ విభాగంలో ఇప్ప‌టికే సినిమాలు, సీరియ‌ళ్లు, వీడియోగేమ్‌లు, అమెజాన్‌ప్రైమ్‌లు.. అబ్బో చాలానే వ‌చ్చేశాయి. 

అయినప్ప‌టికీ మ‌న భార‌తీయుల‌కు రామాయ‌ణ‌, మ‌హాభార‌తం లాంటి పౌరాణిక గాధ‌ల‌పై మ‌మ‌కారం ఏమాత్రం త‌గ్గ‌లేదు. అప్ప‌టికీ, ఇప్ప‌టికీ అదే ఆద‌ర‌ణ‌, అదే భ‌క్తి వాత్స‌ల్యం. దీనికి నిద‌ర్శ‌న‌మే ఇప్పుడు దూర‌ద‌ర్శ‌న్ ఛానెల్‌కు ల‌భిస్తున్న రేటింగ్‌. ప్ర‌స్తుతం దూర‌ద‌ర్శ‌న్‌లో ప్ర‌సార‌మ‌వుతున్న రామాయ‌ణ్, మ‌హాభార‌త్  సీరియల్స్‌.. రేటింగ్స్‌లో దుమ్ముదులిపే రికార్డుల‌ను సాధిస్తుంది. 33 ఏళ్ల క్రితం  ప్ర‌సార‌మైన ఈ సీరియ‌ల్స్‌..లాక్‌డౌన్ పుణ్య‌మా అని మ‌ళ్లీ టెలికాస్ట్ అయ్యాయి. 

రామానంద్‌సాగ‌ర్, బిఆర్ చోప్రా ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన రామాయ‌ణ్‌, మ‌హాభార‌త్ సీరియ‌ళ్ల‌కు భారీ ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. దూర‌ద‌ర్శ‌న్‌లో ప్ర‌సార‌మ‌వుతున్న ఈ సీరియ‌ల్స్ మొద‌టి నాలుగు ఎపిసోడ్‌ల‌కు 170 మిలియ‌న్ వ్యూస్ వ‌చ్చిన‌ట్లు బార్క్ ఇండియా తెలిపింది. వీటిలో ఆదివారం ప్ర‌సార‌మైన ఒక్క ఎపిసోడ్‌కే 5 కోట్ల వ్యూయ‌ర్‌షిప్ న‌మోదైంది. దేశ చ‌రిత్ర‌లోనే సీరియ‌ల్స్‌కు ఈ  రేంజ్‌లో వ్యూయ‌ర్‌షిప్ రావ‌డం ఇదే మొద‌టిసారి. దీంతో డీడీ ఛాన‌ల్ వ్యూయ‌ర్‌షిప్ అమాంతం పెరిగింది. దీంతో డీడీ ఛాన‌ల్‌కి మునుపెన్న‌డూ లేనంత‌గా 650 శాతం లాభాల్లో దూసుకుపోయింది. 

దీనిపై దూద‌ర్శ‌న్ సీఈవో శ‌శి శేఖ‌ర్ మాట్లాడుతూ.."దూరదర్శన్ వీక్షకులందరికీ  చాలా ధ‌న్య‌వాదాలు. భార‌త‌దేశం అంత‌టా అత్య‌ధిక వీక్షించిన ఛానెల్ ఇదే. మీ అంద‌రి మ‌ద్ద‌తుకు కృతఙ్ఞ‌త‌లు. ఇంట్లోనే ఉండండి. సుర‌క్షితంగా ఉండండి‌ "అంటూ ట్వీట్ చేశారు. 

మార్చి 28న రీ టెలికాస్ట్ అయిన ఈ సీరియ‌ల్స్‌.. పాత రికార్డుల‌ను బ‌ద్ద‌లుకొడుతూ కొత్త రికార్డుల‌ను సెట్‌చేసింది. పైగా దీని ద్వారా ఈ త‌రం వారికి పౌర‌ణిక గాధ‌ల‌పై అవ‌గాహ‌న ఏర్ప‌డే మంచి అవ‌కాశం ల‌భించింది. 

కరోనా వైరస్ నేపథ్యంలో రామాయణ్ సీరియల్ తొలి నాలుగు షోలను ఇంతవరకు ప్రదర్శించిన దూరదర్శన్ 17 కోట్ల హిట్లను సాధించింది. ఒకే ఒక్క వారంలో వ్యూయర్ షిప్‌లో 650 శాతం వృద్దిని సాధించిన దూరదర్శన్ అన్ని రికార్డులను కొల్లగొడుతోంది. 

మార్చి 28న డీడీ నేషనల్‌లో రామాయణ్, డీడీ భారతిలో మహాభారత్ సీరియల్స్‌ని మళ్లీ ప్రసారం చేశారు. వీటికి వచ్చిన అపూర్వ జనాదరణతో అలనాటి డీడీ క్లాసిక్స్ అయిన వ్యోమకేష్ భక్షి, శక్తిమాన్, బునియాద్, దేఖ్ బాయ్ దేఖ్, అలిఫ్ లైలా, జంగిల్ బుక్ వంటి సీరియల్స్ కూడా పున: ప్రసారానికి నోచుకుని 30 ఏళ్ల అనంతరం కూడా మరోసారి ప్రజాదరణ చూరగొంటున్నాయి.

 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle