newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆ దేశాల్లో బోస్ స్టోర్లు క్లోజ్.. ఆన్ లైన్ ఎఫెక్టేనా?

17-01-202017-01-2020 13:42:50 IST
2020-01-17T08:12:50.007Z17-01-2020 2020-01-17T08:12:47.515Z - - 17-04-2021

ఆ దేశాల్లో బోస్ స్టోర్లు క్లోజ్.. ఆన్ లైన్ ఎఫెక్టేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈమధ్య కాలంలో షోరూంకి వెళ్లి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడం తగ్గిపోతోంది. ప్రస్తుతం 16శాతం ఉన్న ఆన్‌లైన్‌ అమ్మకాలు 2026 నాటికి 25శాతానికి పైగా పెరగవచ్చని సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దిగ్గజ ఎలక్ట్రానిక్ సంస్థలు తమ షోరూంలకు చరమగీతం పాడుతున్నాయి. హంగు ఆర్భాటాలతో లక్షలు ఖర్చుపెట్టడానికి అవి వెనుకాడుతున్నాయి. ఐకియా వంటి స్టోర్లు సైతం ఆన్ లైన్ అమ్మకాలకు తెరతీస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో ప్రముఖ సంస్థ బోస్ చేరింది.

ఉత్తర అమెరికా, యూరప్‌, జపాన్‌, ఆస్ట్రేలియా తదితర దేశాలలో 119 రిటైల్‌ దుకాణాలను మూసివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ప్రజలు ఆన్‌లైన్‌ షాపింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఖర్చులు తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. ఆడియో, స్పీకర్లు, హెడ్‌ఫోన్స్‌ తదితర ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులతో బోస్‌ రిటైలర్స్‌ తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్‌ సంపాదించింది. 

ప్రస్తుతం ప్రజలు ఆన్‌లైన్‌ షాపింగ్‌ వైపే మొగ్గు చూపుతున్నందున షాపులు మూసివేయడం, ఆన్ లైన్లో ఆర్డర్లు తీసుకుని వారికి డెలివరీ చేయడంపై ఫోకస్ పెడుతున్నట్టు తెలిపింది. దీనివల్ల ఎంత మంది ఉద్యోగులపై ప్రభావం పడుతుందనేది తెలియడం లేదు. ఇటీవల బోస్ వైస్‌ ప్రెసిడెంట్‌ కోలెట్‌ బ్రూక్‌ స్పందించారు. కంపెనీ తీసుకున్న నిర్ణయం చాలా కష్టమైనదని, అంతిమంగా వినియోగదారుల అవసరాలే తమకు ముఖ్యమన్నారు. 

2018లో భారీ సంస్థలు 60శాతం వరకూ రిటైల్ స్టోర్లను మూసివేశాయి. ఇక, 2019లో యుఎస్ రిటైలర్లు 9,302 స్టోర్లు మూసివేశాయి. 2020లో వీటిసంఖ్య మరింతగా పెరగగలదని అంటున్నారు. మొత్తం మీద ఆన్ లైన్ ఈ కామర్స్ వ్యాపారాలు రిటైల్ దుకాణాలు మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయని చెప్పవచ్చు. 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle