newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆల్‌రౌండర్‌ ‘వివాల్డీ’ మొబైల్‌లోకి వచ్చేస్తోంది!

10-09-201910-09-2019 17:14:01 IST
Updated On 10-09-2019 17:18:09 ISTUpdated On 10-09-20192019-09-10T11:44:01.956Z10-09-2019 2019-09-10T11:44:00.177Z - 2019-09-10T11:48:09.768Z - 10-09-2019

ఆల్‌రౌండర్‌ ‘వివాల్డీ’ మొబైల్‌లోకి వచ్చేస్తోంది!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

క్రోమ్‌, ఫైర్‌ ఫాక్స్‌, ఒపెరా, యూసీ... ఇలా మీరు మొబైల్స్‌లో చాలా రకాల బ్రౌజర్లు వాడుంటారు. ఇవి కాకుండా మొబైల్‌ కంపెనీకి సంబంధించిన బ్రౌజర్లు కూడా వాడే ఉంటారు. వీటన్నింటిలో ఉన్న ఆప్షన్లు కలిపి ఓ కొత్త బ్రౌజర్‌ వచ్చింది. అదే వివాల్డీ. ఈ పేరు ఎక్కడో విన్నట్లుగా ఉంది కదా. మూడేళ్ల క్రితం డెస్క్‌టాప్‌ వెర్షన్‌ రూపంలో ఈ బ్రౌజర్‌ను లాంచ్‌ చేశారు. 

ఇన్నాళ్లకు దీని మొబైల్‌ వెర్షన్‌ అందుబాటులోకి వస్తోంది. ఇటీవల దీని బీటా వెర్షన్‌ను ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం ఇది బీటా దశలో ఉంది. త్వరలో అందరూ దీన్ని వాడుకోవచ్చు. ఈ లింక్‌ క్లిక్‌ చేసి మీకు యాక్సెస్‌ ఉంటే ఇప్పుడే ట్రై చేయొచ్చు.

వివాల్డీ ప్రత్యేకతలు:

వివాల్డీ డెస్క్‌ టాప్‌ వెర్షన్‌లో ఉన్న చాలావరకు ఆప్షన్లను మొబైల్‌ వెర్షన్‌లోకి తీసుకొచ్చారు. అవేంటంటే...

* సాధారణంగా ఉండే హ్యామ్‌ బర్గర్‌ మెనూ (మూడు అడ్డ గీతల మెనూ) ఇందులో ఉండదు. దాని స్థానంలో ‘V’ ఆకారంలో ఓ బటన్‌ ఉంది. ఇది క్లిక్‌ చేస్తే ప్రధానమైన ఆప్షన్లు కనిపిస్తాయి.

* ఇందులో క్లోన్‌ ఆప్షన్‌ ప్రత్యేకమైనది. డెస్క్‌టాప్‌ బ్రౌజర్లలో ఉండే డూప్లికేట్‌ ట్యాబ్‌కు మరో రూపమే క్లోన్‌. దీన్ని క్లిక్‌ చేస్తే అప్పటివరకు మీరు చూస్తున్న ట్యాబ్‌కు డూప్లికేట్‌ అయ్యి కొత్త ట్యాబ్‌లో కనిపిస్తుంది.

* దిగువ బార్‌లో ప్యానల్స్‌ అని మరో ఆప్షన్‌ ఉంటుంది. ఇది బుక్‌మార్క్స్‌ అడ్వాన్స్‌డ్‌ రూపం. ఇందులో ఇన్‌బిల్ట్‌గా కొన్ని బుక్‌మార్క్స్‌ సిద్ధంగా ఉంటాయి. టెక్నాలజీ, గేమ్స్‌, న్యూస్‌, షాపింగ్‌ అంటూ కొన్ని సెక్షన్లు ఉంటాయి. వాటిని క్లిక్‌ చేస్తే ఆయా సెక్షన్లలో ముఖ్యమైన వెబ్‌సైట్ల బుక్‌మార్క్స్‌ ఉంటాయి. మీరు కొత్తవి యాడ్‌ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు.

* ఇందులో హోమ్‌ పేజీ షార్ట్ కట్స్‌ను స్పీడ్‌ డయల్స్‌ అని పిలుస్తారు. వీటి ద్వారా ముఖ్యమైన యాప్స్‌ను ఈజీగా యాక్సెస్‌ చేయొచ్చు.

* ఒకేసారి పది ట్యాబ్‌లు ఓపెన్‌ చేసి... ఎందులో ఏముందో చూద్దామంటే ఇప్పుడున్న ప్రధానమైన బ్రౌజర్లలోనూ కష్టమే. వివాల్డీలో థంబ్స్‌ రూపంలో సులభంగా చూసుకోవచ్చు.

* ప్రస్తుత ట్రెండింగ్‌ ఫీచర్‌ ‘డార్క్‌ మోడ్‌’ కూడా ఈ యాప్‌లో అందుబాటులో ఉంది. అయితే బ్రౌజర్‌ కు మాత్రమే.

* ఇన్‌కాగ్నిటో ట్యాబ్‌ తరహాలో ఇందులో ప్రైవేట్‌ ట్యాబ్‌ ఇచ్చారు. దీనిలో బ్రౌజ్‌ చేస్తే మీరు విజిట్‌ చేసిన సైట్స్‌, కుకీస్‌, టెంపరరీ ఫైల్స్‌ ఏవీ ఈ బ్రౌజర్‌ స్టోర్‌ చేయదు.

* బ్రౌజర్‌లో ఏదైనా వార్త, విషయం చూసి బాగుంది అనిపిస్తే మళ్లీ స్క్రీన్‌ షాట్‌ కోసం వేరే యాప్‌ ఓపెన్‌ చేయాలి. లేదంటే మొబైల్‌లో ఉన్న స్క్రీన్‌ ఆప్షన్‌లోకి వెళ్లాలి. కానీ ఈ బ్రౌజర్‌లో ఆ అవసరం లేదు. ఎందుకంటే వివాల్డీ (హోం) బటన్‌ క్లిక్‌ చేస్తే అందులో ‘క్యాప్చర్‌ పేజీ’ అని ఉంటుంది. దాన్ని క్లిక్‌ చేసి మీకు కావాల్సిన భాగం స్క్రీన్‌ షాట్‌ తీసుకోవచ్చు.

* బ్రౌజర్‌ వాడుతున్నప్పుడు ఏదైనా ఆసక్తికర విషయం కనిపిస్తే రాసుకోవడమో లేక నోట్‌లో సేవ్‌ చేసుకుంటారు. ఈ బ్రౌజర్‌లో మీలాంటి వారి కోసం నోట్స్‌ ఫీచర్‌ను తీసుకొచ్చారు. నోట్స్‌లోకి వెళ్తే మీకు కావాల్సిన అంశాలు రాసి దాచుకోవచ్చు. దిగువన ఎడమైపు ఉన్న ప్యానల్‌ బటన్‌ క్లిక్ చేస్తే ఈ నోట్స్‌ ఫీచర్‌ కనిపిస్తుంది. 

వివాల్టీ ఇలా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు

No photo description available.No photo description available.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle