newssting
BITING NEWS :
*బాలీవుడ్ లో కరోనా కలకలం.. బిగ్ బి ఫ్యామిలీలో అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్ *దేశంలో భారీగా నమోదవుతున్న కేసులు.. 7,60,761, మరణాలు 21,018, రికవరీ అయినవారు 4,69,325 *బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో రాజస్థాన్‌‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ భేటీ *ఇవాళ జైపూర్ లో రాజస్థాన్‌ సీఎల్పీ సమావేశం..సీఎం అశోక్‌ గెహ్లాత్‌ నివాసంలో భేటీకానున్న శాసనసభాపక్షం*తెలంగాణ: నేటి నుంచి అమల్లోకి ఈ-పాస్‌ విధానం....అధికారిక లావాదేవీలు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం *కోస్తాంధ్ర మీదుగా ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి..తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం *మహబూబ్‌నగర్‌ లో మంత్రి కేటీఆర్‌ పర్యటన.డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను ప్రారంభించనున్న కేటీఆర్‌ *సికింద్రాబాద్‌ మహంకాళి బోనాల్లో రంగం కార్యక్రమం..భవిష్యవాణి వినిపించనున్న స్వర్ణలత * నేటి నుంచి మూతపడనున్న గుంటూరు మిర్చియార్డు.. ఈనెల 19వరకు మిర్చియార్డు మూసివేత *ఏపీలో మరో 1914 కరోనా పాజిటివ్‌ కేసులు.. మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,168

ఆరువారాలు.... ఆరు కంపెనీలు. .జియోలో రూ.87వేల కోట్ల పెట్టుబడులు

05-06-202005-06-2020 12:44:35 IST
Updated On 05-06-2020 13:53:11 ISTUpdated On 05-06-20202020-06-05T07:14:35.739Z05-06-2020 2020-06-05T07:06:45.706Z - 2020-06-05T08:23:11.669Z - 05-06-2020

ఆరువారాలు.... ఆరు కంపెనీలు. .జియోలో రూ.87వేల కోట్ల పెట్టుబడులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశీయ టెలికాం రంగంలో జియో యమా స్పీడ్ గా దూసుకువచ్చింది. ప్రత్యర్ధులకు వెన్నులో వణుకు పుట్టించింది. తాజాగా జియో విదేశీ సంస్థలను ఆకర్షించడంలో ముందుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆరువారాల్లో ఆరుడీల్స్ సాధించింది.  జియో ప్లాట్‌ఫామ్స్‌లో మరో భారీ ఒప్పందాన్ని అధికారికంగా అంబానీ ప్రకటించారు.  దీంతో ఈ ఏడాది  ఏప్రిల్ నుంచి  ఇప్పటివరకు ఆరు వారాల్లో ఆరు ప్రముఖ కంపెనీల నుంచి భారీ పెట్టుబడులను ఆకర్షించింది. దేశీయంగా స్తబ్ధంగా వున్నా అంబానీ మాత్రం తన దూకుడు ప్రదర్శించారనే చెప్పాలి. 

మిగతా కంపెనీల కంటే ఫేస్ బుక్ వాటాయే ఎక్కువగా ఉంది. ఫేస్ బుక్ చేతిలో వున్న వాట్సాప్, ఇన్ స్టాగ్రాంలలో భారతీయ కస్టమర్లే ఎక్కువగా వున్నారు. ఇప్పుడు జియోతో జతకడితే మరింతగా విస్తరించుకోవచ్చని సీఈవో మార్క్ జుకర్ బర్గ్ అన్నారు. ప్రతిభ కలిగిన పారిశ్రామికవేత్తలకి భారత్ నిలయమని, డిజిటల్ వైపు భారత్ అడుగులు వేస్తున్న వేళ ఫేస్ బుక్-జియో బంధంపై సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. తమ ఒప్పందం  దేశవ్యాప్తంగా ప్రజలకు వాణిజ్య అవకాశాలను అందించేందుకు కట్టుబడి ఉందన్నారు. 

జియోలో ఫేస్ బుక్ భారీ పెట్టుబడి

తాజాగా ఆర్‌ఐఎల్ టెలికాం విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌లో అబుదాబికి చెందిన ముబదాలా ఇన్వెస్ట్‌మెంట్‌  సంస్థ 1.85 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. దీని విలువ రూ. 9,093.6 కోట్లు. ఈక్విటీ విలువ, రూ. 4.91 లక్షల కోట్లు కాగా ఎంటర్‌ప్రైజ్‌ విలువ రూ. 5.16 లక్షల కోట్లు అని రిలయన్స్  ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో జియో సేకరించిన మొత్తం పెట్టుబడులు విలువ రూ.87,655.35 కోట్లకు  చేరింది. ఆరు భారీ ఒప్పందాల ద్వారా 18.97 శాతం వాటాలను విక్రయించింది. 

జియో వాటాల అమ్మకాల ద్వారా రూ. 85వేల నుంచి రూ. 90 వేల కోట్లు సేకరించాలని ఆర్‌ఐఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి పెట్టుబడుల ప్రవాహం వస్తూనే వుంది.  ఏప్రిల్‌ 22న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ పెట్టుబడులు పెడతామని ప్రకటించింది. అప్పటినుంచి ఈ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే వుంది. ఫేస్ బుక్ తర్వాత  సిల్వర్‌ లేక్‌,  విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్‌, జనరల్‌ అట్లాంటిక్‌, కేకేఆర్ , తాజాగా ముబదాలా లాంటి అగ్రశ్రేణి సంస్థలు జియోలోకి పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించాయి. 

జియోలో మొత్తం పెట్టుబడులు

* ఫేస్‌బుక్  పెట్టుబడులు రూ. 43,574 కోట్లు  9.99 శాతం వాటా

*  సిల్వర్‌లేక్ పార్ట్‌నర్స్ పెట్టుబడి రూ.5,656 కోట్లు 1.15 శాతం వాటా

* విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్ పెట్టుబడి రూ.11,367 కోట్లు 2.32 శాతం వాటా

* జనరిక్ అట్లాంటిక్ పెట్టుబడులు రూ.6,598 కోట్లు 1.34 శాతం వాటా

* కేకేఆర్ పెట్టుబడులు రూ.11,367 కోట్లు 2.32 శాతం వాటాతో  

* ముబదాల పెట్టుబడులు రూ.9,094 కోట్లు 1.8 5శాతం వాటా


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle