newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆపిల్.. శాంసంగ్‌.. వన్‌ప్లస్‌కి పోటీగా మోటోరోలా

30-10-201930-10-2019 18:03:00 IST
Updated On 31-10-2019 14:57:36 ISTUpdated On 31-10-20192019-10-30T12:33:00.712Z30-10-2019 2019-10-30T12:32:58.964Z - 2019-10-31T09:27:36.411Z - 31-10-2019

ఆపిల్.. శాంసంగ్‌.. వన్‌ప్లస్‌కి పోటీగా మోటోరోలా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఫ్లాగ్‌షిప్‌ మొబైల్స్‌ విభాగంలో బలమైన రీ ఎంట్రీ ఇవ్వాలని మోటోరోలా ప్రయత్నిస్తోందా? టెక్‌ వర్గాల సమాచారం ప్రకారం అయితే నిజమే అని తెలుస్తోంది. గతంలో మోటోరోలా నుంచి మోటో ఎక్స్‌,  మోటో జెడ్‌ పేరుతో వరుస ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లు వచ్చేవి. స్టాక్‌ ఆండ్రాయిడ్‌ ఎక్స్‌పీరియన్స్‌తో అవి యూజర్లను ఆకట్టుకున్నాయి. అయితే మోటోరోలాను లెనోవా కొనుక్కున్నాక ఈ తరహా మొబైల్స్‌ రావడం తగ్గిపోయాయి. గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి. ఇప్పుడు దీనిని మార్చాలని మోటోరోలా ఆలోచిస్తోందని సమాచారం. యాపిల్‌, శాంసంగ్‌, వన్‌ప్లస్‌ లాంటి సంస్థలకు దీటుగా ఫ్లాగ్‌షిప్‌ మొబైల్‌ను తీసుకురావాలని చూస్తోందట. అదీ అందుబాటులో ధరలోనే అందించనున్నట్లు సమాచారం. 

మోటో నుంచి ఇటీవల మోటో జీ 8 విడుదలైంది. ఈ సమయంలో మోటో ఈ, మోటో జీ, మోటో వన్‌ సిరీస్‌ కాకుండా ఓ పర్ఫెక్ట్‌ ఫ్లాగ్‌షిప్‌ డివైజ్‌ను తీసుకొచ్చే ఆలోచన ఉందని చెప్పింది. అయితే దానికి సంబంధించిన ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అదే మోటోరోలా  వచ్చే ఏడాది తీసుకురాబోయే ఫ్లాగ్‌షిప్‌ మొబైల్‌ అని తెలుస్తోంది. ప్రస్తుతం మోటోరోలా నుంచి సరైన ఫ్లాగ్‌షిప్‌ మొబైల్‌ లేదు. మోటో జెడ్‌ సిరీస్‌తో కొన్ని ప్రీమియం ఫోన్స్‌ వస్తున్నా అవి మన దేశంలో అందుబాటులో లేవు. మన దేశంలో అయితే మోటో వన్‌ విజన్‌ ఒక్కటే అధిక ధరలో అందుబాటులో ఉంది. అది కూడా ఫ్లాగ్‌షిప్‌ ఫీచర్లతో ఉన్నది కాదు.

మోటో ఇటీవల తన ఎక్స్‌ ఎడిషన్‌ని క్లోజ్‌ చేసేసింది. కాబట్టి కొత్త ఫ్లాగ్‌షిప్‌ మోటో జెడ్‌ నుంచి రావొచ్చని సమాచారం. ప్రస్తుతం అయితే మోటో వన్‌ సిరీస్‌ మీద దృష్టి పెట్టింది. ఇటీవల కాలంలో ఈ సిరీస్‌లో నాలుగు వరకు మొబైళ్లు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికైతే ఈ సిరీస్‌లో మోటో వన్‌ జూమ్‌ బెస్ట్‌ ఫోన్‌గా నిలిచింది. నవంబరు 13న కొత్త అఫొర్డబుల్‌ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ను లాంచ్‌ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం అయితే ఆ రోజు మోటో ఫోల్డింగ్‌ ఫోన్‌ మోటో రేజర్‌ లాంచ్‌ అవుతుంది. దాంతో పాటు కొత్త అఫొర్డబుల్‌ ఫ్లాగ్‌షిప్‌ గురించి సమాచారం తెలియొచ్చు. అన్నట్టు మోటో రేజర్‌ ధర $1500గా నిర్ణయించారట. అంటే మన కరెన్సీ ప్రకారం సుమారు రూ.లక్ష. 

 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle