ఆపిల్ మ్యాక్ బుక్ ప్రొ బ్యాటరీ...పేలుతుంది జాగ్రత్త!
21-06-201921-06-2019 13:22:50 IST
Updated On 21-06-2019 13:23:16 ISTUpdated On 21-06-20192019-06-21T07:52:50.423Z21-06-2019 2019-06-21T07:52:47.924Z - 2019-06-21T07:53:16.936Z - 21-06-2019

ఆపిల్ సంస్థ ఉత్పత్తులకు యమా గిరాకీ ఉంటుంది. యాపిల్ ఫోన్లంటే యూత్ బాగా అట్రాక్ట్ అవుతుంది. ఇటీవల విడుదల చేసిన మాక్బుక్ ప్రో డివైస్లు పేలుతున్నాయని వార్తలు వస్తున్నాయి. దీంతో మాక్బుక్ ప్రో యూనిట్లను ఆపిల్ కంపెనీ భారీగా రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించింది. 15 అంగుళాల మాక్బుక్ ప్రో బ్యాటరీ ఓవర్ హీట్ అయ్యి ప్రమాదానికి గురికావచ్చనే ఆందోళనతో వాటిని రీకాల్ చేస్తోంది. ఈ మేరకు వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో 15 అంగుళాల మాక్బుక్ ప్రో యూనిట్లను ఉపయోగించడం మానేయాలని ఆపిల్ వినియోగదారులకు సూచించింది. వినియోగదారులకు సౌకర్యంగా ఉండేందుకు వీటి బ్యాటరీని ఉచితంగా రీప్లేస్ చేసుకోవచ్చని తెలియచేసింది. రెటినా డిస్ప్లే ఉన్న 15-అంగుళాల మాక్బుక్ ప్రో యూనిట్లు, ప్రధానంగా సెప్టెంబర్ 2015- ఫిబ్రవరి 2017 మధ్య అమ్ముడైనవి ప్రమాదానికి గురయ్యే అవకాశం వుందని హెచ్చరించింది. బ్యాటరీ రీప్లేస్మెంట్ వివరాల కోసం apple.com/support/15-inch-macbook-pro-battery-recall సంప్రదించవచ్చని ప్రకటించింది.

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం
20 hours ago

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే
17-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021
ఇంకా