newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆపిల్ నయా అవతార్.. అప్పుడు మాస్కులు.. ఇప్పుడు ఫేస్ షీల్డ్స్

07-04-202007-04-2020 08:21:00 IST
Updated On 07-04-2020 09:03:35 ISTUpdated On 07-04-20202020-04-07T02:51:00.682Z07-04-2020 2020-04-07T02:50:54.367Z - 2020-04-07T03:33:35.296Z - 07-04-2020

ఆపిల్ నయా అవతార్.. అప్పుడు మాస్కులు.. ఇప్పుడు ఫేస్ షీల్డ్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ సంస్థ కరోనా వ్యాప్తి నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నుంచి జనాన్ని రక్షించేందుకు ముఖాలకు రక్షణ కల్పించే కవచాలను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలని భావిస్తోంది. ఈ ముఖ కవచాలు కరోనా చికిత్సలో పాలుపంచుకునే వైద్యసిబ్బందికి విశేషంగా ఉపకరిస్తాయని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ తెలిపారు. ఈ ఫేస్ షీల్డ్స్ ను డిజైన్ చేసే క్రమంలో ఆపిల్ సంస్థ తన ప్రొడక్ట్ డిజైనర్లను, ఇంజినీరింగ్ ఉద్యోగులను, ప్యాకేజింగ్ సిబ్బందిని ఒక్కచోటికి చేర్చింది.

‘ది క్యూపర్టినో’ అనే కాలిఫోర్నియా సంస్థ ఈ ఫేస్ షీల్డ్స్ తయారుచేస్తోంది. వారానికి పది లక్షల కవచాలు తయారుచేయాలని నిర్ణయించారు. వీటిని ప్రస్తుతానికి అమెరికాలో వినియోగించనున్నారు. మున్ముందు ప్రపంచవ్యాప్తంగా అందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

ఆపిల్ సంస్థ కరోనా కారణంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. కరోనా వైరస్ ప్రారంభదశ వుహాన్ లో వెలుగులోకి వచ్చింది. కరోనా వైరస్ కారణంగా వుహాన్ లో పరిశ్రమలు అన్నీ మూతబడ్డాయి. యాపిల్ సంస్థకు అక్కడ అనేక కార్యాలయాలు వున్నాయి. ఆర్ అండ్ డీ కూడా వుంది. వైరస్ ప్రమాదకరంగా మారడంతో ఉద్యోగులను ఆఫీసుకి రాకుండా.. ఇంటినుంచే పనిచేసే అవకాశం కల్పించింది.

యాపిల్ సంస్థకు చైనాలో వివిధ మొబైల్ విడి పరికరాలు తయారవుతాయి. వుహాన్ ఉక్కిరిబిక్కిరి కావడంతో యాపిల్ సంస్థ కార్యకలాపాలపై తీవ్ర ఇక్కట్లు పడింది. కొన్నాళ్ళపాటు మొబైల్స్ తయారీ పక్కన పెట్టి మాస్కులు తయారుచేసింది. తాజాగా వుహాన్లో పరిస్థితి చక్కబడుతోంది. అమెరికాలో మాస్కులు, ఫేస్ షీల్డ్స్ అవసరం ఎంతో ఉంది దీంతో యాపిల్ సంస్థ అమెరికా అవసరాలపై ఫోకస్ పెట్టింది. ఆపిల్ తన ప్రొడక్ట్ డిజైనర్లను, ఇంజినీరింగ్ ఉద్యోగులను, ప్యాకేజింగ్ సిబ్బందిని ఒక్కచోటికి చేర్చింది. ‘ది క్యూపర్టినో’ అనే కాలిఫోర్నియా సంస్థ ఈ ఫేస్ షీల్డ్స్ తయారుచేస్తోంది.

 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   3 hours ago


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle