ఆపిల్.. అమెజాన్‌లకు పోటీగా 'ఫేస్బుక్' కొత్త ఆయుధం..
16-09-201916-09-2019 09:43:30 IST
Updated On 16-09-2019 09:43:22 ISTUpdated On 16-09-20192019-09-16T04:13:30.833Z16-09-2019 2019-09-16T04:13:14.633Z - 2019-09-16T04:13:22.025Z - 16-09-2019

టీవీలో సీరియళ్లు, సినిమాలు, షోలు చూసే రోజులు త్వరలో కనుమరుగవుతాయా... ఏమో ప్రస్తుతం స్ట్రీమింగ్ సర్వీసు అందిస్తున్న సంస్థలు చెప్పే మాటలు, కొందరు టెక్ నిపుణులు చెబుతున్న సూత్రాలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. అందుకే చాలా సంస్థలు ఈ వైపు ఆలోచిస్తున్నాయి. మరికొన్ని అయితే స్ట్రీమింగ్ డివైజ్‌లు సిద్ధం చేస్తున్నాయి. యాపిల్ నుంచి యాపిల్ టీవీ, అమెజాన్ నుంచి ఫైర్ టీవీ ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మరో పెద్ద సంస్థ ఈ రంగంలోకి రాబోతోంది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కూడా ఇటువైపు చూస్తోంది.
స్ట్రీమింగ్ అంటే ఇష్టపడేవారికి ఇది శుభవార్తే. ‘పోర్టల్’ పేరుతో ఫేస్బుక్ ఓ స్ట్రీమింగ్ సర్వీసును ప్రారంభిస్తోంది. దీనికి సంబంధించి కొంత సమాచారం బయటికొచ్చింది. ఫేస్బుక్ తీసుకురానున్న ఈ కొత్త సర్వీసులో వీడియో కాలింగ్ ఫీచర్ కూడా ఉండబోతోంది. దీని కోసం ప్రత్యేకంగా ఫార్ ఫీల్డ్ మైక్రో ఫోన్స్‌లో ఇందులో ఏర్పాటు చేస్తున్నారట. ‘పోర్టల్’లో కంటెంట్ కోసం ఫేస్బుక్ ఇప్పటికే డిస్నీ, నెట్‌ఫ్లిక్స్ లాంటి సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. దీని కోసం ఫేస్బుక్ ఓ యాప్ కూడా సిద్ధం చేసిందట.
ఫైర్ స్టిక్, యాపిల్ టీవీ స్టైల్లో ‘పోర్టల్’ ఉండదట. దీనికి టీవి పైన అటాచ్ చేసుకునేలా రూపొందించారని తెలుస్తోంది. దీనికే సౌండ్ స్పీకర్లను అమర్చారట. వీడియో కాల్స్ కోసం ఉపయుక్తంగా ఉండేలా ఈ ఏర్పాటు చేశారు. ఇందులో ఓ కెమెరా కూడా ఉంటుంది. ఆ కెమెరాలో ఆగ్యుమెంటడ్ రియాలిటీ (ఏఆర్) ఉండబోతోంది. దీని ద్వారా వీడియో కాల్స్‌లో వైవిధ్యం కనిపించబోతోంది. మరి ఆపిల్, అమెజాన్‌కు పోటీగా ఫేస్బుక్ నిలవగలుగుతుందా. తక్కువ ధరలో సర్వీసులు ఇవ్వడం, సరికొత్త సినిమాలు, షోలు ఇవ్వడం అంత సులభం అయితే కాదు. కానీ ఫేస్బుక్ తలచుకుంటే సాధ్యం కానిది లేదు అంటుంటారు టెక్ విశ్లేషకులు.



ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా