newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆపిల్‌పై సైబర్‌ దాడులు... రెండో దేశంలో భారత్‌

30-09-201930-09-2019 10:48:24 IST
2019-09-30T05:18:24.414Z30-09-2019 2019-09-30T05:18:22.979Z - - 17-04-2021

ఆపిల్‌పై సైబర్‌ దాడులు... రెండో దేశంలో భారత్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆపిల్‌ మొబైల్స్‌, మ్యాక్ కంప్యూటర్లు వాడుతున్నారా.. అయితే ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండండి. వీటి లక్ష్యంగా అంతర్జాలంలో అగంతుకుల దాడులు పెరిగిపోతున్నాయట. ఈ మేరకు ప్రముఖ యాంటీ వైరస్‌ సంస్థ కాస్పర్‌ స్కై ప్రకటించింది. ఆపిల్‌కు ఐవోఎస్‌, మ్యాక్‌ ఓఎస్‌ లక్ష్యంగా ఇటీవల కాలంలో దాడులు పెరిగాయని కాస్పర్‌స్కై పేర్కొంది. అయితే విండోస్‌, ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌తో తో పోలిస్తే ఈ దాడులు తక్కువే అని చెప్పింది. 

‘థ్రెట్‌ టు మ్యాక్‌ యూజర్స్‌ - 2019’ పేరుతో కాస్పర్‌స్కై ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో ఈ హ్యాకర్ల దాడుల గురించి ప్రస్తావించింది. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో మ్యాక్‌, ఐఓఎస్‌ ఆధారిత మొబైల్‌ ఫోన్లపై దాదాపు 16 లక్షల ఫిషింగ్‌ దాడులు జరిగాయని తెలిపింది. 2018లో జరిగిన సైబర్‌ దాడుల కంటే ఇది దాదాపు తొమ్మిది శాతం అధికమని కాస్పర్‌స్కై తెలిపింది.

ఆపిల్‌ ఉత్పత్తులపై జరిగే దాడుల్లో అధిక శాతం ఐక్లౌడ్‌ ద్వారా ఎక్కువ జరుగుతున్నాయని కాస్పర్‌ స్కై తెలిపింది. హ్యాకర్లు దాడులు చేసి ఆపిల్‌ ఐడీ ఖాతాల వివరాలను దొంగిలంచి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిపింది.

ఆపిల్‌ మొబైల్‌ వినియోగదారులకు లింక్‌ల రూపంలో యాపిల్‌ టెక్నికల్‌ సపోర్ట్‌ పేరుతో ఈమెయిల్స్‌ వస్తున్నాయి. పరిశీలన కోసం పంపిన లింక్‌ను క్లిక్‌ చేయమని మెయిల్‌లో వినియోగదారులకు సూచిస్తున్నారు. ఒకవేళ క్లిక్‌ చేయకపోతే ఆపిల్‌ ఖాతా డీయాక్టివేట్‌ చేస్తామని అందులో రాస్తున్నారు. దీంతో చాలా మంది వినియోగదారులు అసలు విషయాన్ని గుర్తించకుండా లింక్‌ను క్లిక్‌ చేసి ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ తరహా సైబరు దాడులకు బ్రెజిల్‌ అతిపెద్ద బాధిత దేశమని కాస్పర్‌స్కై పేర్కొంది. ఆ తర్వాతి స్థానంలో భారత్‌, ఫ్రాన్స్‌ ఉన్నట్లు తెలిపింది. 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle