newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆత్మనిర్భర్‌ భారత్‌...మన పెరట్లోనే ఐఫోన్ 12 తయారీ

22-08-202022-08-2020 19:22:19 IST
Updated On 22-08-2020 20:13:45 ISTUpdated On 22-08-20202020-08-22T13:52:19.229Z22-08-2020 2020-08-22T13:51:51.409Z - 2020-08-22T14:43:45.719Z - 22-08-2020

ఆత్మనిర్భర్‌ భారత్‌...మన పెరట్లోనే ఐఫోన్ 12 తయారీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా సంక్షోభం వేళ ఉద్యోగాలుకు ఎసరు పడింది. ఎన్నో కంపెనీలు ఉద్యోగుల్ని సాగనంపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆపిల్ సంస్థ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. భారత్‌లో ఇప్పటికే ఐఫోన్‌ 6ఎస్‌, ఐఫోన్‌7, ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌, ఐఫోన్‌ 11లను ఉత్పత్తి చేసింది ఆపిల్‌.. ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ కార్యక్రమంలో భాగంగా ఐఫోన్‌ 12 స్థానిక తయారీకి శ్రీకారం చుట్టింది. అంతేకాదు భారీగా ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది.

2017లో ఇండియన్‌ సిలికాన్‌ వ్యాలీ బెంగళూరుకు 70 కిలో మీటర్ల దూరంలో ఉన్న కోలార్‌లో నెలకొల్పిన ఆపిల్‌ ప్లాంటులో అసెంబ్లింగ్‌ ప్రక్రియను విస్ట్రాన్‌ పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. ఇక విస్ట్రాన్‌ ప్రత్యర్థి కంపెనీ ఫాక్స్‌కాన్‌ తన ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ ఐఫోన్ 11ను చెన్నైలోని ప్లాంట్లో తయారు చేయడం ప్రారంభించింది. 

ఆపిల్‌ ఐఫోన్‌ ప్రియులు ఈ ఏడాదే మేడిన్‌ ఇండియా ఐఫోన్‌ 12 అందుకోనున్నారు. దీనికి సంబంధించిన ఉత్పత్తి ప్రక్రియను తైవాన్‌కు చెందిన విస్ట్రాన్‌ కంపెనీ ఇప్పటికే ప్రారంభించింది. కర్ణాటకలోని కోలార్‌ జిల్లా నరసాపురలో గల ప్లాంటులో ఈ మేరకు ఐఫోన్‌ 12 కాంపోనెట్స్‌ ఉత్పత్తి మొదలైందని పేర్కొంది. ఈ నేపథ్యంలో విస్ట్రాన్‌ కంపెనీ దశల వారీగా దాదాపు 10 వేల మంది ఉద్యోగాలు కల్పించే అవకాశం వుంది. ఈ క్రమంలో ఇప్పటికే 2 వేల మంది స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చింది. 

డిప్లొమా గ్రాడ్యుయేట్లకు వాక్-ఇన్‌‌ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. మంచి అనుభవజ్ఞులతో పాటు ఫ్రెషర్స్‌కు కూడా త్వరలోనే మరిన్ని అవకాశాలు రానున్నాయని పేర్కొంది. ఇక ప్రస్తుతం ఐఫోన్‌ 12 కాంపొనెట్స్‌ ట్రయల్‌ ప్రొడక్షన్‌ చేపట్టిన విస్ట్రాన్‌ సెప్టెంబరు నుంచి కమర్షియల్‌ ఉత్పత్తిని ప్రారంభించనుంది. ఐ ఫోన్ బెంగళూరులో ఉత్పత్తి చేయడం ద్వారా 22 శాతం మేర దిగుమతి పన్నులు తగ్గుతాయి. స్థానికులకు కొత్త ఉద్యోగవకాశాలు, తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్లు లభిస్తాయి.

 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle