newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆకాశంలో అద్భుత దృశ్యం రింగ్ ఆఫ్ ఫైర్... సూర్యగ్రహణం నేడే

21-06-202021-06-2020 09:22:00 IST
2020-06-21T03:52:00.231Z21-06-2020 2020-06-21T03:51:56.591Z - - 15-04-2021

ఆకాశంలో అద్భుత దృశ్యం రింగ్ ఆఫ్ ఫైర్... సూర్యగ్రహణం నేడే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆకాశంలో అద్భుత దృశ్యమైన సూర్యగ్రహణాల్లో ఒకటైన వార్షిక సూర్యగ్రహణం ఆదివారం భారత్‌లో కనిపించి కనువిందు చేయనుంది. ఈ సూర్యగ్రహణం సమయంలో చంద్రుడు భూమికి సుదూరంగా వెళ్లడంతో పూర్తిగా సూర్యుడ్ని కప్పి ఉంచలేడు. 70శాతం మాత్రమే కప్పివేయడంతో ఖగోళ అద్భుత దృశ్యాల్లో ఒకటైన రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ కనిపిస్తుంది. 

దేశవ్యాప్తంగా తీసుకుంటే సూర్యగ్రహణం ఉదయం గం.915 గంటలకు మొదలై మధ్యాహ్నం 1210 గంటలకు అత్యున్నత స్థితికి చేరుకొని మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. అయితే ప్రాంతాలను బట్టి సమయంలో కాస్త మార్పులు ఉంటాయని ప్లానెటరీ సొసైటీ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. 

గ్రహణం తెలంగాణలో ఉదయం 10.15 గంటల నుంచి 1.44 గంటల వరకు ఉంటుంది. 51 శాతం గ్రహణం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 10.21 గంటల నుంచి మధ్యాహ్నం 1.49 గంటల వరకు 46 శాతం గ్రహణం ఉంటుంది. విశ్వ వ్యాప్తంగా 3గంటల 33 నిమిషాలపాటు గ్రహణం ఉంటుంది.

పూర్తిస్థాయి వలయాకార సూర్యగ్రహణం విశ్వవ్యాప్తంగా ఉదయం 9.16 గంటల నుంచి మధ్యాహ్నం 3.04 వరకు ఉంటుంది. భారత్‌లో గుజరాత్‌లో మొదట గ్రహణం కనిపిస్తుంది. హైదరాబాద్‌లో పాక్షికంగా కనిపించనుంది. సూర్యగ్రహణం వేళ అతినీలలోహిత కిరణాలు భూమి మీద పడినపుడు కరోనా వైరస్‌ 0.001 శాతం మాత్రమే చనిపోయే అవకాశముంది.

2020లో సంభవించే రెండు సూర్యగ్రహణాల్లో ఇది మొదటిది. ఇది పాక్షిక సూర్య గ్రహణమే. డిసెంబర్‌ 14న ఏర్పడబోయేది సంపూర్ణ సూర్యగ్రహణం. దేశంలో గుజరాత్‌లోని భుజ్‌లో మొదట కనిపిస్తుందని, అస్సాంలోని దిబ్రూగఢ్‌లో చివరిగా మధ్యాహ్నం 229 గంటలకు పూర్తవుతుందని నెహ్రూ ప్లానెటోరియంలోని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఇవాళ్టి వార్షిక సూర్యగ్రహణంలో ఆకాశంలో అద్భుత దృశ్యమైన రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ కనువిందు చేయనుంది. రాజస్తాన్, హరియాణా, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల ప్రజలు దీనిని వీక్షించవచ్చును. రాజస్తాన్‌లో సూరత్‌గఢ్, అనూప్‌గఢ్, హరియాణాలో సిర్సా, రాటియా, కురుక్షేత్రలోనూ, ఉత్తరాఖండ్‌లో డెహ్రాడూన్, చంబా, చమోలిŠ‡లో రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ ఒక్కనిమిషం వరకు కనిపిస్తుంది. సెంట్రల్‌ ఆఫ్రికా, పాకిస్తాన్, దక్షిణ సెంట్రల్‌ చైనా, యూరప్‌లో కొన్ని ప్రాంతాలు, ఆస్ట్రేలియాలోనూ సూర్యగ్రహణం కనిపిస్తుంది. 

సూర్యగ్రహణాన్ని నేరుగా చూస్తే మనిషి కంటిలో రెటీనా దెబ్బ తింటుందని ప్లానెటరీ సొసైటీ ఆఫ్‌ ఇండియా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తగినన్ని రక్షణ జాగ్రత్తలతో ఫిల్టర్‌ కళ్లద్దాలు ధరించిన తర్వాతే రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ దృశ్యాన్ని చూడొచ్చునని వీరు చెబుతున్నారు.

నేడు శ్రీవారి దర్శనం నిలిపివేత

సూర్యగ్రహణం కారణంగా ఆదివారం (నేడు) తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు స్వామివారి దర్శనం ఉండదు. ఈ విషయాన్ని గమనించాల్సిందిగా టీటీడీ భక్తులను కోరుతోంది. కాగా, ఆదివారం సూర్యగ్రహణం సమయంలో ప్రపంచ శాంతి, సృష్టిలోని సకల జీవరాశుల క్షేమాన్ని కోరుతూ తిరుమల శ్రీవారి పుష్కరిణిలో టీటీడీ జపయజ్ఙం నిర్వహించనుంది. ఇందులో భాగంగా అష్టాక్షరి, ద్వాదశాక్షరి, శ్రీ ధన్వంతరి మంత్ర జపాలతోపాటు శ్రీపురుష సూక్త, శ్రీసూక్త, శ్రీ నారాయణ సూక్త పారాయణాలను నిర్వహించనున్నారు. 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle