ఆంబ్రేన్ మేడిన్ ఇండియా పవర్ బ్యాంక్స్... ఫాస్ట్ ఛార్జింగ్
23-08-202023-08-2020 10:10:11 IST
2020-08-23T04:40:11.976Z23-08-2020 2020-08-23T04:38:10.320Z - - 12-04-2021

ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ల వాడకం బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఛార్జింగ్ ఇబ్బందులు అందరినీ వెంటాడుతున్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ పవర్ బ్యాంక్ ల వాడకం వైపు మొగ్గుతున్నారు. ఆంబ్రేన్ సంస్థ మేడిన్ ఇండియా కాన్సెప్ట్ తో వివిధ మోడల్స్ లో అతి తక్కువ ధరలకు పవర్ బ్యాంకులు విడుదలచేసింది. ఆంబ్రేన్ ఇండియా పవర్ లిట్ ఎక్స్ఎల్, పవర్ లిట్ ప్రొ పేరుతో రెండు పవర్ బ్యాంక్ లు విడుదలచేసింది. ఆంబ్రేన్ ఇండియా విడుదలచేసిన ఈ పవర్ లిట్ పవర్ బ్యాంక్ లు త్వరగా ఛార్జ్ అవుతాయి. మీ మొబైల్ ఫోన్లు క్షణాల్లో రీఛార్జ్ అవుతాయంటోంది కంపెనీ. అత్యాధునిక టెక్నాలజీతో ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది. పవర్ లిట్ ఎక్స్ ఎల్ మోడల్ సామర్ధ్యం 20వేల ఎంఏహెచ్ కాగా, పవర్ లిట్ ప్రొ మోడల్ సామర్ధ్యం 10వేల ఎంఎహెచ్. ఈ రెండు మోడల్స్ ఎంతో ఆకర్షణీయంగానే కాదు చాలా స్లిమ్ గా వున్నాయి. అత్యంత ఎక్కువ డెన్సిటీ కలిగిన లిథియం పాలిమర్ బ్యాటరీలు ఇందులో వాడడంవల్ల విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు వచ్చినా తట్టుకుంటాయి. ఎక్కువ కాలం పనిచేస్తాయి. పీడీ టెక్నాలజీ వాడడం వల్ల క్విక్ ఛార్జ్ అవుతాయి. పవర్ బ్యాంక్ ఛార్జింగ్ అయిన వెంటనే అవి ఆటోమేటిక్ గా ఆగిపోతాయి. మీ మొబైల్ ఏదైనా ఈ పవర్ బ్యాంక్ ల ద్వారా త్వరగా ఛార్జ్ అవుతాయి. 0 నుంచి 50 శాతం ఛార్జి కావడానికి కేవలం 30 నిముషాలు సరిపోతుంది. అంటే మీ ఫోన్ ఛార్జింగ్ లేకపోతే అరగంటలో సగం ఛార్జింగ్ చేసుకునే అవకాశం వుంటుంది. ఈ పవర్ బ్యాంకులలో 9 లేయర్స్ వుంటాయి, అందువల్ల వీటి రక్షణకు మంచి అవకాశం వుంది. 20వేల ఎంఎ హెచ్ పవర్ బ్యాంక్ లలో 2 యుఎస్ బి పోర్టులుంటాయి. 1 టైప్ సీ పోర్ట్ వుంటుంది. పవర్ లిట్ ప్రొలో 1 యుఎస్ బిపోర్ట్, 1 సీపోర్ట్ వుంటుంది. ఈ రెండు పవర్ బ్యాంకులకు 18 డబ్ల్యు ఛార్జింగ్ అవుతుంది. ఈ పవర్ బ్యాంక్ లపై ఆరునెలల వారంటీ వుంది. ఫ్లిప్ కార్ట్ ద్వారా దీనిని ఆర్డర్ చేయవచ్చు. కోవిడ్ టైంలో తమ కంపెనీ పవర్ బ్యాంక్ లు ఎక్కువగా అమ్ముడు పోయినట్టు ఆంబ్రేన్ ఇండియా తెలిపింది. ట్రావెలింగ్ లో ఈ పవర్ బ్యాంక్ లు బాగా ఉపయోగపడతాయి. వీటి ధరలు కూడా అందరికీ అందుబాటులో వున్నాయి,. పవర్ లిట్ ఎక్స్ ఎల్ పవర్ బ్యాంక్ లు మెటాలిక్ బ్లాక్, గ్రీన్ కలర్స్, పవర్ లిట్ ప్రొ పవర్ బ్యాంక్ లు మెటాలిక్ రెడ్, బ్లాక్ రంగుల్లో అందుబాటులో వున్నాయి. 20 వేల ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ రూ1499, 10వేల ఎంఎహెచ్ పవర్ బ్యాంక్ కేవలం రూ.999కి లభిస్తోంది.

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా