newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆండ్రాయిడ్‌ మొబైల్స్‌లో 80 లక్షల యాడ్‌వేర్‌లు

28-10-201928-10-2019 10:57:51 IST
2019-10-28T05:27:51.018Z28-10-2019 2019-10-28T05:27:47.887Z - - 17-04-2021

ఆండ్రాయిడ్‌ మొబైల్స్‌లో 80 లక్షల యాడ్‌వేర్‌లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
యాడ్‌వేర్‌... ప్లేస్టోర్‌ ఇప్పుడు చాలామంది యూజర్లను ఇబ్బంది పెడుతోన్న అంశం. రేటింగ్‌ బాగుందని, ఫీచర్లు బాగున్నాయని కొన్ని యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేస్తుంటే వాటితోపాటు మొబైల్‌లో మాల్‌వేర్‌ కూడా డౌన్‌లోడ్‌ అయిపోతోంది. దీంతో యూజర్ల సమాచారం అగంతుకుల చేతికి చేరిపోతోంది.గ త ఏడాదిలో ఇప్పటివరకు మాల్‌వేర్‌ ఉన్న యాప్‌లకు 80 లక్షల  డౌన్‌లోడ్స్‌ వచ్చాయట. అంటే ఎన్ని మొబైల్స్‌ మాల్‌వేర్‌ బారిన పడుంటాయో ఆలోచించండి. ఇన్ని మొబైల్స్‌ను ఇబ్బంది పెట్టిన యాప్స్‌ ఏ లక్షల్లోనో, వేలల్లోనే ఉన్నాయనుకుంటే పొరపాటే. అందుకే కేవలం 42 యాప్స్‌తోనే ఈ ఇబ్బంది వచ్చింది. స్లోవక్‌ ఇంటర్నెట్‌ సెక్యూరిటీ సంస్థ ESET నిర్వహించిన పరిశోదనలో ఈ విషయం వెల్లడైంది. 

గతేడాది జులైలో స్లోవక్‌ ఈ పరిశోధనను ప్రారంభించింది. ఈ క్రమంలో యూజర్ల మొబైల్స్‌లో యాడ్‌వేర్‌ చొప్పిస్తున్న 42 యాప్స్‌ను గమనించారు. వాటిలో ఇంకా మరో 20 వరకు వివిధ సోర్స్‌ల అందుబాటులో ఉన్నాయని స్లోవక్‌ చెబుతోంది.  ‘‘యాడ్‌వేర్‌ యాప్స్‌ గురించి మేం గూగుల్‌కు సమాచారం అందించాం. వాళ్లు వెంటనే స్పందించి వాటిని ప్లే స్టోర్‌ నుంచి తొలగించారు. అయినా థర్డ్‌ పార్టీ వెబ్‌సైట్ల ద్వారా ఇంకా ఆ యాప్స్‌ యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవడం అంతమంచిది కాదు’’ అని స్లోవక్‌ ప్రతినిధి చెబుతున్నారు.

యాడ్‌వేర్‌ యాప్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుంటే అందులో చొప్పించిన ‘ఆషస్‌’ యాడ్‌వేర్‌ మీ మొబైల్‌ హోం కీలోకి చేరుతుంది. అక్కడి నుంచి మీ మొబైల్‌ టైప్‌, ఓఎస్‌ వెర్షన్‌, లాంగ్వేజ్‌, ఇన్‌స్టాల్ట్‌ యాప్స్‌, ఫ్రీ స్టోరేజీ స్పేస్‌, బ్యాటరీ స్టేటస్‌, డెవలపర్‌ మోడ్‌ స్టేటస్‌, రూట్‌ స్టేటస్‌, ఫేస్‌బుక్ యాప్స్‌ స్టేటస్‌ లాంటివి తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఆ డేటాను సంబంధిత సర్వర్‌ పంపిస్తుంది. అప్పుడు మీ మొబైల్‌లో సెంట్రల్‌ సర్వర్‌ నుంచి యాడ్స్‌ వస్తాయి. మీ ఫోన్‌లో ఫుల్‌ స్క్రీన్‌ యాడ్స్‌ వస్తున్నాయంటే మీ మొబైల్‌ యాడ్‌వేర్‌ అటాక్‌ జరిగినట్లే అని స్లోవక్‌ చెబుతోంది. 

మొబైల్‌లోకి యాడ్‌వేర్‌ రాగానే.. తొలుత ఆ మొబైల్‌ గూగుల్‌ ప్లే స్టోర్‌ సెక్యూరిటీ మెకానిజంతో  టెస్టింగ్‌ పూర్తయిందో లేదో చూస్తుంది. ఆ తర్వాత సర్వర్‌తో అనుసంధానమై మీకు కనిపించే యాడ్స్‌ మధ్య ఎంత టైమ్‌ గ్యాప్‌ ఉండాలో నిర్ణయించుకుంటుంది. మరోవైపు ఆ తర్వాత యాడ్స్‌ వస్తాయి. ఆ యాప్‌ ఐకాన్‌ మీ మెనూలో కనిపించకుండా హైడ్‌ చేస్తుంది. ఇలాంటి యాప్స్‌ ఇన్‌స్టాల్‌ అయ్యాక వాటిని తొలగించడం అంత సులభం కాదు. అన్‌ఇన్‌స్టాల్‌ చేసే క్రమంలో కేవలం షార్ట్‌కట్‌ మాత్రమే డిలీట్‌ అవుతుంది.

దీంతో యాప్‌ ఇంకా బ్యాగ్రౌండ్‌లో కంటిన్యూ అవుతుంది. కాబట్టి మీ మొబైల్‌లో యాడ్‌వేర్‌ ఉందని అనుమానం వస్తే వెంటనే మొబైల్‌ను ఫార్మాట్‌ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.  ఈ సమస్య యాప్‌ స్టోర్‌లో కూడా ఉందట. కొన్ని యాప్స్‌  మాల్‌వేర్‌ బారిన పడిందట. అర్థమైందిగా... ఓసారి మీ మొబైల్‌ను చెక్‌ చేసుకోండిమరి. ప్లేస్టోర్‌లో లేని యాప్స్‌ ఏవైనా మీ మొబైల్‌లో ఉన్నాయేమో అని. 

 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle