newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆండ్రాయిడ్‌ ‘గూగుల్‌ ప్లే మ్యూజిక్‌’ని తీసేస్తోంది.. కొత్తగా ఏమొస్తోందో తెలుసా?

30-09-201930-09-2019 13:52:22 IST
2019-09-30T08:22:22.067Z30-09-2019 2019-09-30T08:22:20.155Z - - 11-04-2021

ఆండ్రాయిడ్‌ ‘గూగుల్‌ ప్లే మ్యూజిక్‌’ని తీసేస్తోంది.. కొత్తగా ఏమొస్తోందో తెలుసా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గూగుల్‌ తన అమ్ములపొదిలోని కొన్ని యాప్స్‌ను క్లోజ్‌ చేస్తూ వస్తోంది. చాలా రోజుల క్రితం ‘గూగుల్‌ ఆలో’ను ఆపేసింది. మొన్నటికిమొన్న ‘గూగుల్‌ హ్యాంగవుట్‌’ సర్వీసుల్ని నిలిపేసింది. తర్వాత వేటు ‘గూగుల్‌ ప్లే మ్యూజిక్‌’పైనే అని తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో మీ మొబైల్‌లో ప్లే మ్యూజిక్‌ యాప్‌ కనిపించకపోవచ్చు. ఇప్పటికే ఈ యాప్‌ను చాలా తక్కువ మంది వాడుతున్నారని సమాచారం. సబ్‌స్క్రైబ్‌ రూపంలోనూ, ఉచితంగానూ ఈ యాప్‌ ప్రస్తుతం అందుబాటులో ఉంది. దీన్ని క్లోజ్‌ చేసి దాని స్థానంలో మరో యాప్‌ను తీసుకొస్తున్నారట. 

యూట్యూబ్‌ నుంచి ఇటీవల యూట్యూబ్‌ మ్యూజిక్‌ వచ్చింది. దీనికి పెయిడ్‌ సర్వీసు కూడా గూగుల్‌ ప్రకటించింది. ఇప్పుడు ఈ యాప్‌నే గూగుల్‌ ప్లే మ్యూజిక్‌ బదులు వాడనున్నారట. ఆండ్రాయిడ్‌ 10, ఆండ్రాయిడ్‌ 9 ఆధారిత మొబైల్స్‌లో గూగుల్‌ ప్లే మ్యూజిక్ బదులు యూట్యూబ్‌ మ్యూజిక్‌ ప్రీ ఇన్‌స్టాల్డ్‌గా ఉండబోతోంది. ‘‘ఇకపై ఆండ్రాయిడ్‌ మొబైల్‌ వినియోగదారులు యూట్యూబ్‌ మ్యూజిక్‌లో పాటలు వినొచ్చు. పిక్సెల్‌ సిరీస్‌ మొబైళ్లు, ఆండ్రాయిడ్‌ 10, ఆండ్రాయిడ్‌ 9పై ఈ మార్పు మీరు చూడొచ్చు’’ అంటూ గూగుల్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

‘‘మీరు కొత్త మొబైల్‌ను ఆన్‌ చేయగానే మీకు యూట్యూబ్‌ మ్యూజిక్‌ యాప్‌ కనిపిస్తుంది. ఎంచక్కా పాటలు వినేయండి. ఒకవేళ మీ మొబైల్‌లో ఆ యాప్‌ లేకపోతే ప్లే స్టోర్‌ లోకి వెళ్లి డౌన్‌లోడ్‌ చేసుకోండి’’ గూగుల్‌ చెప్పింది. మూడేళ్ల క్రితం యూట్యూబ్‌ మ్యూజిక్‌ యాప్‌ను గూగుల్‌ లాంచ్‌ చేసింది. ఇటీవలే మన దేశంలోకి తీసుకొచ్చింది. గూగుల్‌ ప్లే మ్యూజిక్‌లో ఉన్న కీలకమైన పర్సనల్‌ స్పాటిఫై ఆప్షన్‌ను యూట్యూబ్‌ మ్యూజిక్‌లోనూ తీసుకొస్తామని గూగుల్ తెలిపింది. ఇకపై యూట్యూబ్‌ మ్యూజిక్‌లో లోకల్‌ ఎంపీ3 పాటలను ప్లే చేయొచ్చు. ఇకపై యూట్యూబ్‌ మ్యూజిక్‌లో పాటల్ని మొబైల్‌లో సేవ్‌ చేయొచ్చు కూడా. 

Image result for android closing google play music

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle