newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

ఆండ్రాయిడ్‌లో 500 వైరస్‌ యాప్స్‌ గుర్తించిన ప్రోమొన్‌

04-12-201904-12-2019 15:55:31 IST
2019-12-04T10:25:31.349Z04-12-2019 2019-12-04T10:25:06.069Z - - 11-08-2020

ఆండ్రాయిడ్‌లో 500 వైరస్‌ యాప్స్‌ గుర్తించిన ప్రోమొన్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పెగాసస్‌ సైబర్‌ అటాక్‌ దెబ్బతో వాట్సాప్‌ ఇబ్బందులు పడుతున్న ఈ సమయంలో... ఆండ్రాయిడ్‌ యాప్స్‌తో మరో సైబర్‌ అటాక్‌ ఎదురయ్యే అవకాశం ఉందంటూ టెక్‌ నిపుణులు వార్నింగ్‌ ఇస్తున్నారు. ఆండ్రాయిడ్‌ వెర్షన్లలో ఉన్న స్ట్రాండ్‌హాగ్‌ అనే దాడికి అవకాశమిచ్చే అంశం ఉండటం వల్ల మొబైల్స్‌ సైబర్‌ దాడికి అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. తాజాగా విడుదలైన ఆండ్రాయిడ్‌ 10 సహా అన్ని ఆండ్రాయిడ్‌ వెర్షన్లలోనూ ఈ ఇబ్బంది ఉందని చెబుతున్నారు. ప్రోమొన్‌ అనే పరిశోధన సంస్థ ఈ మేరకు తన బ్లాగులోరాసుకొచ్చింది. 

స్ట్రాండ్‌హాగ్‌ ఇప్పటికే 500 కీలక యాప్స్‌లో ఉందని ప్రోమొన్‌ చెబుతోంది.  అందులో 36 వైరస్‌ ప్రభావిత యాప్స్‌ను గుర్తించినట్లు చెప్పారు. ఇలాంటి యాప్స్‌ ఇన్‌స్టాల్‌ చేసుకున్న ఫోన్‌ను రూట్‌ చేయకుండానే హ్యకర్లు తమ అధీనంలోకి తెచ్చుకోవచ్చు. ఒక్కసారి అధీనంలోకి తెచ్చుకుంటే కీలకమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. కాల్‌ రికార్డింగ్స్‌, మెసేజ్‌లు, ఫొటోలు, లాగిన్‌ వివరాలు, ఫైల్స్‌, లొకేషన్‌ సమాచారం, కాంటాక్ట్స్‌, కాల్‌ లాగ్స్‌ హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతాయి. 

Related image

ఈ వైరస్‌ యాప్స్‌ సాధారణ యాప్‌ అడిగినట్లుగానే పర్మిషన్లు అడుగుతుంది. ఎస్‌ఎంఎస్‌, కెమెరా, జీపీఎస్‌ అడుగుతుంది. దీంతో యూజర్లకు పెద్ద కొత్తగా ఏమీ కనిపించదు. దీని వల్ల లాగిన్‌ కాకుండానే ఆ యాప్‌ మీ డేటాను తస్కరిస్తుంది.  ఇటీవల ఇలాంటి సమస్యతోనే కామ్‌ స్కానర్‌ యాప్‌ను ప్లే స్టోర్‌ను తొలగించారు. అందులో ట్రోజన్‌ డ్రాపర్‌ అనే అనుమాస్పద మాడ్యుల్‌ను గుర్తించారు. ఇప్పుడు ప్రమొన్‌ చెబుతున్న 500 యాప్స్‌ లోనూ ఆ తరహా మాడ్యుల్‌నే గుర్తించారని తెలుస్తోంది. అయితే ప్రోమొన్‌ ఈ జాబితాను కొన్నాళ్ల క్రితం గూగుల్‌కు అందించిదట. ఆ యాప్స్‌ను తొలగించేసినప్పటికీ.. ఇష్యూను మాత్రం ఫిక్స్‌ చేయలేదని చెబుతోంది. 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle