newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అమ్రిష్ పురికి గూగుల్ నివాళి

22-06-201922-06-2019 10:36:34 IST
Updated On 22-06-2019 10:49:25 ISTUpdated On 22-06-20192019-06-22T05:06:34.349Z22-06-2019 2019-06-22T05:06:25.735Z - 2019-06-22T05:19:25.865Z - 22-06-2019

అమ్రిష్ పురికి గూగుల్ నివాళి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రముఖ భారతీయ నటుడు, ప్రతినాయకుడు అమ్రిష్ పురికి ప్రముఖ సెర్చింజన్ గూగుల్ ఘన నివాళి అందించింది. ప్రత్యేకంగా రూపొందించిన డూడుల్ వైరల్ అవుతోంది. ఎన్నో తెలుగు చిత్రాల్లో ఆయన నటించారు. ముఖ్యంగా జగదేకవీరుడు అతిలోక సుందరిలో ఆయన నటన ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో కలకలం గుర్తుండిపోతుంది. జూన్‌ 22, 1932లో పంజాబ్‌లోని జలంధర్‌లో పుట్టిన ఆయన 72 ఏళ్లు జీవించారు. జనవరి 12, 2005న ముంబైలో ఆయన కన్నుమూశారు.

Image may contain: 1 person, closeup

అమ్రిష్‌ పురి పూర్తి పేరు అమ్రిష్‌లాల్‌ పురి. హిందీ, తెలుగు, కన్నడ, మరాఠీ, పంజాబీ, మలయాళం, తమిళ్, ఆంగ్లం వంటి భాషల్లో దాదాపు 400పైగా చిత్రాల్లో ఆయన నటించి మెప్పించారు. లింఫేర్‌తో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు అమ్రిష్ పురి.

ఆయన సోదరులు కూడా నటులే. మదన్‌పురి, చమన్‌ పురిలు అమ్రిష్‌ కంటే ముందే నటులుగా నిలదొక్కుకున్నారు. వారిలా నటుడుగా మారాలనే అమ్రిష్‌ పూరి జలంధర్‌ నుంచి ముంబై వెళ్లాడు. మొదటి ప్రయత్నంలోనే కెమెరా ముందు పరీక్షలో విఫలం అయ్యాడు. దీంతో ముంబైలోనే ఉద్యోగం వెతుక్కోవలసి వచ్చింది. ఉద్యోగం చేస్తూనే నాటక ప్రదర్శనలిస్తూ నటనలో శిక్షణ పొందాడు. 

Image may contain: 4 people, people smiling, beard

1979లో మొదటిసారి‘సంగీత్‌ నాటక్‌ అకాడమీ’ అవార్డు అందుకున్నారు.  ‘ప్రేమ్‌ పూజారి’ చిత్రంతో బాలీవుడ్‌లో ప్రవేశించారు. ‘మేరీ జంగ్‌’ ‘సూరజ్‌ కా సత్వాన్‌ ఘోదా’, ‘ఘటక్‌’, ‘విరాసాట్‌’ వంటి చిత్రాలు బాలీవుడ్‌లో ఆయనకు పేరు తెచ్చిపెట్టాయి.  ‘సౌధాగర్‌’, ‘తెహల్కా’, ‘ముస్కురాత్‌’, ‘దామిని’, ‘గార్డిష్‌’, ‘కరణ్‌ అర్జున్‌’, ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’, ‘కోయ్లా’, ‘బాద్‌షా’ వంటి సినిమాలతో భారీ విజయాలందుకున్నారు.

Image may contain: 2 people

‘మిస్టర్‌ ఇండియా’లో అద్భుత నటన కనబరిచారు. తెలుగులో చిరంజీవి, శ్రీదేవి నటించిన ‘జగదేకవీరుడు..అతిలోకసుందరి’లో ‘మహాదృష్ట...కాపాళిక’ అన్న మాటలు తెలుగు ప్రేక్షకుల మదిలో ఎప్పుడూ గుర్తుండిపోతాయి. అలాగే వెంకటేష్‌ నటించిన ‘కొండవీటి దొంగ’లో ‘కాళీ కబాలి పాతాల్‌ కాళీ’, ‘అబ్రకదబ్ర’ వంటి మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అంతేకాదు, రిచర్డ్‌ అటెన్‌ బరో తీసిన ‘గాంధీ’ చిత్రంలో పాత్ర ద్వారా అంతర్జాతీయ ప్రేక్షకకులకు పరిచయం అయ్యారు. ఇవాళ అమ్రిష్ పురి జయంతి సందర్భంగా గూగుల్ డూడుల్ రూపొందించడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. 

 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   2 hours ago


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle