newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అమెరికాలో టిక్ టాక్ కథ క్లోజ్.. నిషేధం విధించిన ట్రంప్

07-08-202007-08-2020 10:09:48 IST
2020-08-07T04:39:48.616Z07-08-2020 2020-08-07T04:39:40.765Z - - 19-04-2021

 అమెరికాలో టిక్ టాక్ కథ క్లోజ్.. నిషేధం విధించిన ట్రంప్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చైనా యాప్స్‌పై భారతదేశంతో సహా పలు దేశాల్లో బ్యాన్ కొనసాగుతోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పనీ చేశారు. అమెరికాలో టిక్ టాక్ పీకనొక్కేశారు. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టిక్‌టాక్‌పై బ్యాన్ విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఈ బ్యాన్ 45 రోజుల్లోగా అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. అంతకముందు ట్రంప్ చైనాకు చెందిన బైట్‌డాన్స్ కంపెనీని టిక్‌టాక్‌ను అమెరికా సంస్థకు విక్రయించాలని.. లేదంటే బ్యాన్ తప్పదని హెచ్చరించారు. గడువు కూడా విధించారు.

ఈ నేపధ్యంలోనే సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ టిక్‌టాక్‌ను కొనుగోలు చేయాలని చూస్తోంది. దీనికి సంబంధించిన చర్చలు కూడా జరిగాయి. సెప్టెంబర్ 15కు ఫైనల్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ క్రమంలోనే టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డాన్స్‌తో 45 రోజుల్లోగా లావాదేవీలను నిషేధిస్తూ ట్రంప్ తాజాగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను జారీ చేయడం కలకలం రేపుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభం అయినప్పటినుంచీ అమెరికా-చైనా మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. 

అమెరికాను ఆర్ధికంగా దెబ్బతీయడానికి చైనా చూస్తోందంటూ ట్రంప్ నిప్పులు చెరుగుతూనే వున్నారు. టిక్ టాక్, వీ చాట్ వంటి యాప్స్ ద్వారా అమెరికన్ల వ్యక్తిగత సమాచారాన్ని ఆయా కంపెనీలు చైనా కమ్యునిస్ట్ ప్రభుత్వానికి అందజేస్తున్నాయని ట్రంప్ విమర్శలు చేశారు. ట్రంప్ నిర్ణయం పట్ల చైనా ఎలా స్పందిస్తుందో చూడాలి.  భారత్‌లో కూడా చైనాకు సంబంధించిన 59 యాప్స్ బ్యాన్ విధించింది. 

 

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle