అమెజాన్ పేద్ద క్యాంపస్.. నిరుద్యోగులకు బంపర్ ఆఫర్
22-08-201922-08-2019 16:44:57 IST
2019-08-22T11:14:57.920Z22-08-2019 2019-08-22T11:14:51.500Z - - 14-04-2021

అమెజాన్.. మన దుకాణం అంటూ ఊదరగొడుతున్న మల్టీ నేషనల్ ఈ కామర్స్ సంస్థ. తాజాగా హైదరాబాద్ లో భారీ క్యాంపస్ ఏర్పాటుచేసింది. అమెరికా వెలుపల అదీ తెలంగాణలో ఏర్పాటుచేయడం నిరుద్యోగులకు శుభవార్తే. నానక్ రాం గూడలో 9.5 ఎకరాల ప్రాంగణంలో ఇండియాలోనే అతి పెద్ద అమెజాన్ మొదటి క్యాంపస్ ప్రారంభించారు. ఈక్యాంపస్లో సుమారు15 వేల మంది ఉద్యోగులు పని చేయడానికి అవకాశం ఉంటుంది. అమెజాన్‌లో భారతదేశం మొత్తం మీద ఇప్పటికే సుమారు 62,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. దీని విస్తీర్ణం సుమారు 3 మిలియన్ చదరపు అడుగులు. ఇందులో కార్యాలయం 1.8 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణ స్థలంలో నిర్మించబడింది. ఇందుకోసం భారీగా స్టీల్ ఉపయోగించారు. అమెజాన్ కి చెందిన కార్యాలయాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద భవనం ఇది. అమెజాన్ క్యాంపస్‌ను తెలంగాణ హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీ, అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ అండ్ ఫెసిలిటీస్ డైరెక్టర్ జాన్ స్కోట్లర్ మరియు అమెజాన్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట, కంట్రీ మేనేజర్ అమిత్ అగర్వాల్ ప్రారంభించారు.మూడేళ్లలోనే ఈ క్యాంపస్‌ను నిర్మించారు. వివిధ మతాలకు సంబంధించిన ప్రార్థన గదులు,చంటి బిడ్డల కోసం మరొక గది, నిశ్శబ్ద గదులు, షవర్లు, హెలిప్యాడ్ మరియు రోజంతా ఓపెన్ చేయబడి ఉన్న కెఫెటేరియాలు ఎన్నో సౌకర్యాలున్నాయి. ఈ క్యాంపస్ నిర్మాణానికి అమెజాన్ సంస్థ సుమారు రూ. 400 కోట్ల పెట్టుబడి పెట్టింది.ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ కార్యాలయ నిర్మాణానికి 2016 మార్చిలో నాటి తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్ కి ఆహ్వానం అందినా, ఆయన పనుల వత్తిడిలో రాలేకపోయారు.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా