అమెజాన్ మ్యూజిక్... ఇప్పుడు మరింత కొత్తగా..!
19-09-201919-09-2019 09:47:42 IST
2019-09-19T04:17:42.923Z19-09-2019 2019-09-19T04:17:39.544Z - - 17-04-2021

ఒకప్పుడు పాటలు ఎంపీ3 రూపంలో డౌన్లోడ్ చేసుకొని మొబైల్లో వినేవాళ్లు. మధ్యమధ్యలో ఎఫ్ఎంలో వినేవాళ్లు. ఇప్పుడు జియో వచ్చిన తర్వాత అందరూ ఆన్లైన్లోనే వింటున్నారు. వింక్, సావన్, అమెజాన్ మ్యూజిక్, హంగామా అంటూ ఆన్లైన్ మ్యూజిక్ వైపు వచ్చేశారు. వాళ్లు కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త పాటలతో అలరిస్తూనే ఉన్నారు. దానికితోడు సరికొత్త ఫీచర్లు, ప్లే లిస్ట్‌లు తీసుకొచ్చి మా దగ్గరే పాటలు వినండి అనేలా యూజర్లను మొహమాట పెట్టేస్తున్నారు. పెయిడ్ వెర్షన్ తీసుకున్న వారికి మరింత మెరుగ్గా సేవలు అందిస్తున్నారు.
తాజాగా అమెజాన్ మ్యూజిక్ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం వీడియోలు చూసే యాప్‌లో ఉండే ‘క్వాలిటీ’ ఫీచర్‌ను మ్యూజిక్ యాప్‌లకు కూడా తీసుకొస్తున్నారు. త్వరలో అమెజాన్ ప్రైమ్‌లో అల్ట్రా హెచ్డీ నాణ్యతతో పాటలు వినొచ్చు. 24 బిట్‌తో 192 KHz నాణ్యతతో పాటలు వినేలా అమెజాన్ మార్పులు చేస్తోంది. ప్రస్తుతం అమెజాన్‌లో హెచ్డీ నాణ్యతతో 50 మిలియన్లకుపైగా పాటలు ఉన్నాయి. అవి 16 బిట్‌తో 44.1 KHz నాణ్యతతో వినిపిస్తాయి. దీని బట్టి అల్ట్రా హెచ్డీ నాణ్యత ఎలా ఉండబోతోందో మీకు ఇప్పటికే అర్థమైపోయుంటుంది.
హెచ్డీ నాణ్యతలో పాటలు వినాలంటే 1.5- 2 ఎంబీపీఎస్ ఎల్టీఈ కనెక్షన్ ఉండాలి. కొత్తగా రాబోతున్న అల్ట్రా హెచ్డీ నాణ్యతలో పాటలు వినాలంటే 5 -10 ఎంబీపీఎస్ వేగంతో డేటా ఉండాలి. హెచ్డీ నాణ్యత ఉన్న నాలుగు నిమిషాల పాట సుమారు 51 ఎంబీ ఉంటుంది. అదే అల్ట్రా హెచ్డీలో అయితే 153 ఎంబీ వరకు ఉంటుంది. వీటిని కూడా హెచ్డీ పాటల స్టైల్లోనే వైఫై లో ఆఫ్‌లైన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అల్ట్రా హెచ్డీ కేవలం అమెరికా, బ్రిటన్, జర్మనీ, జపాన్‌లో అందుబాటులో ఉంటుంది. త్వరలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అయితే దీని ధర గురించి స్పష్టత లేదు.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా