newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అమృత ప్రీతమ్‌కి గూగుల్ ఘననివాళి

31-08-201931-08-2019 14:51:55 IST
Updated On 31-08-2019 14:52:51 ISTUpdated On 31-08-20192019-08-31T09:21:55.023Z31-08-2019 2019-08-31T09:21:52.954Z - 2019-08-31T09:22:51.468Z - 31-08-2019

 అమృత ప్రీతమ్‌కి గూగుల్ ఘననివాళి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రముఖ పంజాబీ రచయిత్రి, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత  అమృత ప్రీతమ్‌ శతజయంతి ఇవాళ. ఈసందర్భంగా గూగుల్ ఘన నివాళి అర్పించింది. సాహిత్యరంగంలో ఆమె బాట అందరికీ ఆదర్శం అని కొనియాడింది.  అమృత ప్రీతమ్‌ కోసం గూగుల్‌ ప్రత్యేక డూడుల్‌ రూపొందించడం విశేషం. ఆమె ఆత్మకథ “కాలా గులాబ్‌”ని గుర్తుచేసేలా ఈ డూడుల్‌ని తీర్చిదిద్దింది.

Image result for అమృత ప్రీతమ్‌

కాలా గులాబ్‌ ఆత్మకథతో ఆమె జీవితంలోని పలు చీకటి కోణాలు వెలుగులోకి వచ్చాయి. వీటి స్ఫూర్తితో మహిళలు వారి సమస్యలపై గొంతు వినిపించడం ప్రారంభించారు. ముఖ్యంగా ప్రేమ, వివాహానికి సంబంధించి మహిళలు భయం లేకుండా మాట్లాడడానికి రచయిత్రి జీవిత చరిత్ర ఎంతో స్ఫూర్తినిచ్చిందని ఎంతోమంది సాహితీ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. 

1947కి ముందు ఉమ్మడి పంజాబ్ రాష్ట్రంలో ఉన్న గుజ్రాన్‌వాలా ప్రాంతంలో అమృత ప్రీతమ్‌ జన్మించారు. ఆమె తండ్రిపేరు కర్తార్ సింగ్ హిట్కార్. ఆరు దశాబ్దాల జీవితంలో ఆమె సుమారు 100 పుస్తకాలను రచించింది. వాటిలో కవిత్వం, కల్పనా కథలు, జీవిత చరిత్రలు, వ్యాసాలు, పంజాబీ జానపద పాటల సేకరణ, స్వీయ చరిత్ర ఉన్నాయి.

అవి ఇతర భారతీయ భాషలు, విదేశీయ భాషలలోనికి అనువదించబడ్డాయి. 1935లో లాహోర్ లోని అనార్కలీ బజార్ లోని ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు "ప్రీతం సింగ్"తో అమృతా వివాహం జరిగింది. 1960లో ఆమె తన భర్తను విడిచిపెట్టింది. 1956లో ఆమె రాసిన "సనెహాడ్" రచనకు గాను సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న తొలి మహిళగా అమృతి ప్రీతమ్‌ నిలిచారు. అనంతరం 1981లో జ్ఞానపీఠ్‌ అవార్డును అందుకున్నారు. ఆమె పంజాబ్ రత్న పురస్కారాన్ని అందుకున్న మొదటి వ్యక్తి. అప్పటి పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఈ పురస్కారాన్ని అందచేశారు..

ఢిల్లీ విశ్వవిద్యాలయం(1973), జబల్‌పూర్ విశ్వవిద్యాలయం (1973), విశ్వభారతి (1987) లతో పాటు అనేక విశ్వవిద్యాలయాలనుండి ఆమెకు డి.లిట్, గౌరవ డిగ్రీలతో సత్కరించాయి2004లో పద్మ విభూషణ్‌ అవార్డును అందుకున్నారు. ఆమె రచించిన ప్రముఖ నవల “పింజర్‌”ను బాలివుడ్‌లో సినిమాగా తెరకెక్కించారు. ఈ చిత్రానికి దేశ సమైక్యతా విభాగంలో ఉత్తమ జాతీయ చిత్రంగా అవార్డు లభించింది. దేశ విభజన నేపథ్యంలో వచ్చిన నవలగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 1986లో అమృత ప్రీతమ్‌ రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2005 అక్టోబరు 31న అనారోగ్యంతో ప్రీతమ్‌ తుదిశ్వాస విడిచారు.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle