అదిరే... యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో వచ్చేసింది
29-10-201929-10-2019 17:56:11 IST
Updated On 03-11-2019 10:27:11 ISTUpdated On 03-11-20192019-10-29T12:26:11.846Z29-10-2019 2019-10-29T12:26:08.130Z - 2019-11-03T04:57:11.561Z - 03-11-2019

సరికొత్త ఎయిర్ పాడ్స్ తీసుకొస్తామంటూ చాలా కాలంగా ఊరిస్తూ వస్తోన్న ఆపిల్ ఎట్టకేలకు ఎయిర్‌పాడ్స్ ప్రో పేరుతో లాంచ్ చేసింది. $249 ధరతో లాంచ్ చేసిన వీటిని ఈ నెల 30 నుంచి అంతర్జాతీయ మార్కెట్లో సేల్‌కి తీసుకొస్తున్నారు. కొత్త పాడ్స్ వచ్చిన పాత ఎయిర్ పాడ్స్‌ను కంటిన్యూ చేస్తామని ఆపిల్ ప్రకటించింది. కొత్త ఎయిర్ పాడ్స్ లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌ను ప్రధానంగా తీసుకొస్తున్నారు. వాటర్ రెసిస్టెంట్ డిజైన్ ఈ పాడ్స్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఎయిర్ పాడ్స్‌లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ చాలా కాలం క్రితమే తీసుకురావాల్సి ఉంది. ఇన్నాళ్లకి ఎయిర్ ప్యాడ్స్ ప్రోతో సాధ్యమైంది.
ఎయిర్పాడ్స్ప్రో ఇయర్ టిప్‌లో మార్పులు చేశారు. సిలికాన్ ఇయర్ టిప్‌ను తీసుకొచ్చారు. ఇప్పటివరకు ప్లాస్టిక్ టిప్స్ మాత్రమే ఉండేవి. దీని వల్ల చెవిలో పాడ్స్ సరిగ్గా ఫిట్ అయ్యి... ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆపిల్ చెబుతోంది. ఇప్పటికే ఇతర సంస్థల బ్లూటూత్ హెడ్ ఫోన్స్, ఎయిర్ పాడ్స్ సిలికాన్ టిప్‌తో వస్తున్నాయి. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కోసం పాడ్స్‌లో రెండు మైక్రో ఫోన్స్ ఉండబోతున్నాయి.
దీని కోసం పాడ్స్ బయటివైపు ఒకటి, లోపల ఇంకొకటి మైక్రోఫోన్స్ ఉండబోతున్నాయి. బయటివైపు ఉన్న మైక్రో ఫోన్ ఆంబియంట్ నాయిస్‌ని మోనిటర్ చేస్తుంది. దానికి తగ్గట్టుగా ఇన్వర్స్ ఆడియో సిగ్నల్స్‌ను క్రియేట్ చేస్తుంది. లోపల ఉండే మైక్రోఫోన్ సౌండ్‌ని మోనిటర్ చేస్తుంది. దానికి తగ్గట్టుగా నాయిస్ క్యాన్సిలేషన్‌ను అడ్జస్ట్ చేస్తుంది.
ఎయిర్‌పాడ్స్ ప్రోలో ట్రాన్సపరెన్నీ అనే మరో కీలక ఫీచర్ కూడా ఉంది. ఇది ఒక విధంగా నాయిస్ క్యాన్సిలేషన్‌కు విరుద్ధమైంది అనుకోవచ్చు. దీన్ని యాక్టివ్ చేసుకుంటే మీ చుట్టు పక్కల వచ్చే శబ్దాలను మరింత క్లియర్‌గా వినొచ్చు. ట్రాన్సపరెన్సీ ఆప్షన్ యాక్టివ్ చేసుకుంటే మీ సౌండ్‌లో చుట్టుపక్కల శబ్దాలు కలసి వినిపిస్తాయి. అంటే ఎయిర్ పోర్ట్‌లో ఉన్నారనుకోండి. పాటలు వింటుంటే ఏదైనా అనౌన్స్మెంట్ వస్తే అది కూడా వినిపిస్తుంది. కొత్త పాడ్స్‌లో ఐపీఎక్స్4 వాటర్, స్వెట్ రెసిస్టెంట్ ఫీచర్ ఉంటుంది. కాబట్టి జిమ్‌లో కసరత్తులు చేస్తున్నప్పుడు సైతం వీటిని వాడొచ్చు. అలా అని స్విమ్మింగ్ చేసేటప్పుడు మాత్రం వాడకూడదు.
కొత్త ఎయిర్ పాడ్స్‌ను ప్రెజర్ సెన్సిటివ్ ఫీచర్‌తో తీసుకొస్తున్నారు. అంటే వీటిని నిర్దేశిత పద్ధతుల్లో ఒత్తి యాక్సెస్ చేయొచ్చు. టాగుల్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, ట్రాన్సపరెన్సీ మోడ్‌ను యాక్టివ్ చేసుకోవచ్చు. ఒకసారి బటన్‌ను ప్రెస్ చేస్తే ప్లే/ పాజ్ అవుతుంది. రెండుసార్లు ప్రెస్ చేస్తే పాటల్ని స్కిప్ చేయొచ్చు. మూడు సార్లు ట్యాప్ చేస్తే స్కిప్ చేయొచ్చు.. అలాగే బ్యాక్ చేయొచ్చు.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా