అతి తక్కువ ధరకే అంబానీ స్మార్ట్ ఫోన్ తీసుకుని వస్తున్నాడా..?
22-09-202022-09-2020 19:46:21 IST
2020-09-22T14:16:21.165Z22-09-2020 2020-09-22T14:16:15.563Z - - 11-04-2021

అతి తక్కువ ధరకు మొబైల్ ఫోన్ లను అందించాలని చాలా సంస్థలు ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఇప్పటికే మార్కెట్ లోకి వచ్చాయి కానీ భారతీయులను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. అతి త్వరలో చాలా తక్కువ ధరకు మొబైల్ ఫోన్ ను తీసుకుని రావాలని జియో సంస్థ ప్రయత్నిస్తోంది.
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ చైనా కంపెనీ అయిన షియోమీపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు నేషనల్ మీడియా చెబుతోంది. అత్యంత చవకగా రూ.4 వేలకే స్మార్ట్ ఫోన్ అందించాలన్న ఉద్దేశ్యంతో భారత్ లోని మొబైల్ ఫోన్ తయారీదారులతో చర్చలు జరుపుతున్నారు. గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్ తో నడిచే స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకుని రావాలని ప్రయత్నిస్తున్నారు. వచ్చే రెండేళ్లలో 200 మిలియన్ల స్మార్ట్ ఫోన్లు విక్రయించాలన్నది లక్ష్యంగా కనిపిస్తోంది.
భారత్ లోనే ఎంతో విలువైన కంపెనీ అయిన రిలయన్స్ 4 వేల రూపాయలకే స్మార్ట్ ఫోన్ అందిస్తే మాత్రం అదొక ట్రెండ్ సెట్టర్ గా మారే అవకాశం ఉంది. ఇప్పటికే జియోతో టెలికాం రంగంలో తీసుకుని వచ్చిన సునామీని ఎవరూ మరచిపోలేకపోతున్నారు. ఇక స్మార్ట్ ఫోన్ రంగంలో కూడా ప్రకంపనలు సృష్టించాలని భావిస్తోంది జియో. డిక్సన్ టెక్నాలజీ, లావా, కార్బన్ లాంటి కంపెనీలతో జియో అధికారులు సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. స్వదేశీ కంపెనీలతో స్మార్ట్ ఫోన్ లను తయారీ చేయించడం వలన ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది.

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
11 hours ago

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా