అడోబ్ ఫొటోషాప్ కెమెరా యాప్ అదిరిపోయేలా...
07-11-201907-11-2019 17:38:23 IST
2019-11-07T12:08:23.685Z07-11-2019 2019-11-07T12:08:20.333Z - - 15-04-2021

ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లో థర్డ్ పార్టీ కెమెరాలు చాలానే ఉన్నాయి. సాధారణ కెమెరాకు కొన్ని అదనపు ఫీచర్లు జోడించి ఆ యాప్స్‌ను తీసుకొస్తున్నారు. రంగులు, ఫిల్టర్లు, కంట్రోలర్లు, ఎడిటర్స్ జోడించి ఫొటోలను మరింత మెరుగ్గా చేయడం ఆ యాప్స్ పని. ఇప్పుడు ఈ యాప్స్ విభాగంలోకి అడోబ్ కూడా వస్తోంది. అడోబ్ ఫొటోషాప్ కెమెరా పేరుతో ఓ యాప్‌ను తీసుకొస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా ఈ యాప్ పని చేస్తుంది.
అడోబ్ ఫొటోషాప్ కెమెరా యాప్ ఫీచర్లకు సంబంధించి కొన్ని వివరాలు బయటికొచ్చాయి. ఈ యాప్‌తో ఫొటో తీశాక యాప్‌లో ఏఐ ఆధారంగా కొన్ని ఫిల్టర్లు ఆటోమేటిక్‌గా అప్లై అవుతాయి. దాని వల్ల ఫొటో మరింత ఆకర్షణీయంగా ఉండబోతుంది. రియల్‌టైమ్‌లో ఫిల్టర్లను అప్లై చేసి చూపిస్తుంది. గతంలో తీసిన ఫొటోలను కూడా ఈ యాప్‌తో మీకు నచ్చినట్లుగా మార్చుకునే సౌలభ్యమూ ఉంది. ప్రస్తుతం ఈ యాప్ కొంతమందికి ప్రయోగాత్మకంగా అందుబాటులో ఉంది. ఇందులో ప్రిస్మా తరహాలో ఆర్టిస్ట్‌లు రూపొందించిన ఫిల్టర్లు ఉంటాయి.
అడోబ్ ఫొటోషాప్, లైట్‌రూమ్ తరహాలోనే ఈ యాప్‌తో ఫొటోలను సులభంగా ఎడిట్ చేసుకోవచ్చు. దీనికి తగ్గట్టుగా వ్యూ ఫైండర్‌ను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటుంది. డైనమిక్ రేంజ్, టోనాలిటీ, సీన్ టైప్ ఆధారంగా ఈ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఇవి కాకుండా షాడోస్, హైలైట్స్, వైబ్రెన్స్, ఎక్స్‌పోజర్స్‌ను మాన్యువల్‌గా ఎడిట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆర్టిస్ట్‌లు రూపొందించిన ఫిల్టర్లతో ఫొటోలను మార్చుకోవచ్చు. ఇది కాకుండా వినియెగదారులు కూడా లెన్స్‌లు క్రియేట్ చేసుకోవచ్చు.
అడోబ్ ఫొటోషాప్ కెమెరా యాప్‌లో ఆటో మాస్కింగ్ ఫీచర్ కూడా తీసుకొస్తున్నారు. దీని వల్ల ఫొటోలో సబ్జెక్ట్ చుట్టూరా ఆటోమేటిక్‌గా క్లీన్ చేస్తుంది. ఈ యాప్ ప్రస్తుతం యూజర్లకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. దీని కోసం అడోబ్ ఓ ఫామ్‌ను తీసుకొచ్చింది. అందులో ప్రాథమిక సమాచారాన్ని ఇస్తే మీకు యాప్ లింక్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు యాప్ డౌన్లోడ్ అవుతుంది. అలా మీరే మొదటగా యాప్‌ను యూజ్ చేయొచ్చు. వచ్చే ఏడాది మొదట్లో ఈ యాప్ పూర్తి స్థాయిలో యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
రిజిస్ట్రేషన్ లింక్: https://photoshopcamera.adobelanding.com/limitedpreview/?promoid=R726NS2H&mv=other

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా