newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అక్టోబరు 1న భారత్‌లో శాంసంగ్‌ ‘మడత ఫోన్‌’ వస్తోంది

25-09-201925-09-2019 05:56:37 IST
2019-09-25T00:26:37.085Z24-09-2019 2019-09-24T15:18:38.068Z - - 17-04-2021

అక్టోబరు 1న భారత్‌లో శాంసంగ్‌ ‘మడత ఫోన్‌’ వస్తోంది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
శాంసంగ్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన ‘గెలాక్సీ ఫోల్డ్‌’ మన  దేశానికి రాబోతంది. వచ్చే నెల 1న ఈ మొబైల్‌ ఇండియాలో లాంచ్‌ చేయబోతున్నట్లు సమాచారం. దక్షిణ కొరియాలో  ఈ మొబైల్‌ను ఏప్రిల్‌ 26న విడుదల చేసిన సంగతి తెలిసిందే.  అయితే మొబైల్‌లో చాలా లోపాలు బయటపడ్డాయి. స్క్రీన్‌ విరిగిపోవడం, పైన లేయర్లు పోవడం లాంటి సమస్యలతో ఫోల్డ్‌ మొబైళ్లను శాంసంగ్‌ వెనక్కి తెప్పించేసింది. ఇప్పుడు అన్ని రకాల టెస్ట్‌లు, రీటెస్ట్‌లు పూర్తి చేసి భారత్‌లోకి తీసుకొస్తోంది. 

గెలాక్సీ ఫోల్డ్‌లో 7.3 అంగుళాల ఇన్ఫినిటీ ఫ్లెక్స్‌ డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో ఆరు కెమెరాలు ఉంటాయి. ఈ మొబైల్‌లో 4.6 అంగుళాల మరో డిస్‌ప్లే ఉంటుంది. అంటే మొబైల్‌ మడతపెట్టాక ఈ డిస్‌ప్లే పైకి కనిపించేలా ఆన్‌ అవుతుంది. ఇది 12:9 రేషియోలో ఉటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 7 నానో మీటర్‌ టెక్నాలజీతో పని చేస్తుంది. ఇందులో క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 855 ప్రాసెసర్‌ ఉంటుంది. 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ అంతర్గత మెమొరీ ఉంటుంది.  శాంసంగ్‌ నుంచి వస్తున్న నాలుగో 5 జీబీ మొబైల్‌ ఇది. ఇంతకుముందు గెలాక్సీ ఎస్‌ 10, నోట్‌ 10, ఎ 90... 5జీ నెట్‌వర్క్‌ అవైలబిలిటీతో వచ్చాయి. 

భారత్‌లో ఈ మొబైల్‌ ధర రూ.1.5 లక్షల నుంచి రూ. 1.75 లక్షల వరకు ఉంటుందని అంచనా. అంత ధరలో ఈ మొబైల్‌ను ఎవరు కొనుగోలు చేస్తారనేగా మీ ఆలోచన. పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అన్నట్లుగా ఇంత ధర పెట్టి మొబైల్‌ కొనేవాళ్లూ ఉంటారులెండి. అన్నట్లు అక్టోబరు 1నే ఈ మొబైల్‌ ప్రీ ఆర్డర్స్‌ తీసుకుంటారట. మీకు ఆసక్తి ఉంటే ఓ లుక్కేయండి. 

ఫోల్డింగ్‌ మొబైల్‌ను తొలుత బయటకు ప్రదర్శించింది శాంసంగే. అంతేకాదు తొలుత బయటకు తీసుకొచ్చింది శాంసంగే. అయితే ఏప్రిల్‌లో వచ్చిన మొబైల్‌లో చాలా  సమస్యలు కనిపించాయి. రివ్యూ యూనిట్‌ అందుకున్నవారు చాలా ఇబ్బందులు పడ్డారు. దీంతో శాంసంగ్‌ వెనక్కి తీసుకుంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు చేపట్టి విడుదల చేసింది. మరోవైపు హువావే నుంచి ఫోల్డింగ్‌ ఫోన్‌ ‘మేట్‌ ఎక్స్‌’ సిద్ధమైంది. షావోమీ నుంచి కూడా ఓ ఫోన్‌ రాబోతోంది. ఈ సమయంలో శాంసంగ్‌ పోటీని తట్టుకొని ఎలా నిలబడుతుందో చూడాలి. అన్నింటికి మించి నాణ్యత విషయంలో మళ్లీ తప్పులు జరగకుండా చూసుకోవాలి. ఇదంతా శాంసంగ్‌ కత్తి మీద సామే అని పరిశీలకులు చెబుతున్నారు. 

Samsung Galaxy Fold review

Image result for samsung galaxy fold will launch in india on october 1st

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle