అందుబాటులోకి ఆసుస్6Z -128 జీబీ, 256 జీబీ
01-07-201901-07-2019 15:46:09 IST
2019-07-01T10:16:09.127Z01-07-2019 2019-07-01T10:14:53.039Z - - 22-04-2021

అసుస్ కంపెనీ ఇండియాలో తన ఫోన్లను విరివిగా విక్రయిస్తోంది. తక్కువ ధరకు ఎక్కువ ఫీచర్లు అందిస్తుండడంతో ఆదరణ పెరుగుతోంది. అసుస్ 6జెడ్ స్మార్ట్ ఫోన్ ఇండియాలో విడుదల అయింది. 6 GB+ 64 GB వేరియంట్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో గత వారం నుంచి అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు 6 GB+ 128 GB, 8 GB+ 256 GBవేరియంట్లు ఈ రోజు నుంచి తొలిసారిగా అమ్మకాలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఫోన్లు కొన్నవారికి కంపెనీ ఎన్నో అద్భుతమయిన ఆఫర్లను అందిస్తోంది. ఆసుస్ 6Z స్మార్ట్ ఫోన్ ఎన్నో వెరైటీలను అందిస్తోంది. అసుస్ ద్వారా 6 జీబీ + 128 జీబీ, 8జీబీ+256 జీబీ హై ఎండ్ వేరియంట్ లు అందుబాటులో ఉన్నాయి. అసుస్ 6జెడ్ మోడల్స్ ప్రత్యేకతలు * 6.4-అంగుళాల ఫుల్-హెచ్డి + స్క్రీన్ * 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ *ఫ్లిఫ్ డ్యూయల్ కెమెరా మాడ్యూల్ * ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 SoC * ఆసుస్ 6Z 6 జీబీ + 128 జీబీ ధర రూ.34,999 * ఆసుస్ 6 జెడ్ 8 జీబీ + 256 జీబీ ధర రూ.39,999 ఈ రెండు వేరియంట్లు ఇండియాలో ఫ్లిప్‌కార్ట్ ద్వారా దొరుకుతున్నాయి. ఇప్పటికే 6జీబీ + 64జీబీ మోడల్‌ను విక్రయిస్తోంది. దీని ధర రూ.31,999 . ప్రారంభ ఆఫర్లలో భాగంగా ఫ్లిప్‌కార్ట్ కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ ధర 99రూపాయలకు అందిస్తోంది. నిజానికి ఈ ఆఫర్ కావాలంటే 4వేల వరకూ ఖర్చు చేయాలి. యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డులకు 5 శాతం తగ్గింపు ధర అందిస్తోంది. ఆసుస్ 6z ప్రధానంగా ఫ్లిప్ కెమెరా మాడ్యూల్‌కు ప్రసిద్ది చెందింది.ఈ మాడ్యూల్ లో సోనీ IMX586 సెన్సార్ తో 48-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. స్పీడ్ ఛార్జ్ చేయడానికి క్విక్ ఛార్జ్ 4.0 సహాయంతో గల 5000ఎంఎహెచ్ బ్యాటరీని ఏర్పాటుచేసింది. గూగుల్ అసిస్టెంట్ లేదా కస్టమ్ ఫంక్షన్లను స్మార్ట్ కీ ద్వారా ఆపరేట్ చేయవచ్చు.

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం
6 hours ago

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే
17-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021
ఇంకా