newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

960 మంది బ్లాక్‌లిస్ట్‌.. 9 వేలమందికి క్వారంటైన్..

03-04-202003-04-2020 12:01:08 IST
Updated On 03-04-2020 12:15:33 ISTUpdated On 03-04-20202020-04-03T06:31:08.039Z03-04-2020 2020-04-03T06:31:04.734Z - 2020-04-03T06:45:33.770Z - 03-04-2020

960 మంది బ్లాక్‌లిస్ట్‌.. 9 వేలమందికి క్వారంటైన్..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశ రాజధానిలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌లో జరిగిన తబ్లిగీ జమాత్‌ సమావేశాలకు హాజరైన వారిలో అత్యధికులు ప్రాణాంతక కరోనా వైరస్‌ బారిన పడటం కలకలం రేపుతోంది. ఈ కార్యక్రమానికి హాజరైన సుమారు 9,000 మందిని క్వారంటైన్‌లో ఉంచినట్లు కేంద్ర హోం శాఖ గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం మొత్తం 13,702 మంది తబ్లిగీ జమాత్‌ కార్యక్రమానికి హాజరైనట్లు తెలుస్తోంది. 

ప్రత్యేకించి మొబైల్‌ టవర్‌ సిగ్నల్స్‌ విశ్లేషణ ద్వారా సమావేశానికి హాజరైన వారి లెక్కలను అంచనా వేయడంలో ఆంధ్రప్రదేశ్‌ పోలీసు అధికారులు కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. అయితే ఢిల్లీకి వెళ్లిన వారి సంఖ్య భారీగా ఉండటం... వివిధ రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో... వారందరినీ గుర్తించడం అధికారులకు సవాలుగా పరిణమించింది.

ఇక ప్రస్తుతం గుర్తించిన 13,702 మందిలో దాదాపు 7930 మందిపై కరోనా తీవ్ర ప్రభావం చూపనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తబ్లిగీ జమాత్‌కు హాజరైన వారి కారణంగా ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, బిహార్‌, జార్ఖండ్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో అత్యధిక మంది కరోనా వైరస్‌ బారిన పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. కాబట్టి ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని... ఢిల్లీకి వెళ్లిన వారు బాధ్యతగా వ్యవహరించి వైద్య పరీక్షల కోసం ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

కాగా గుంటూరులోని ఓ నియోజవర్గానికి చెందిన ప్రజాప్రతినిధి సమీప బంధువుకు కరోనా సోకడంతో స్థానిక పోలీసులు అప్రమత్తమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీ కార్యక్రమానికి హాజరైన ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కూడా మహమ్మారి బారిన పడినట్లు గుర్తించారు. దీంతో పాలనా యంత్రాంగాలు అప్రమత్తమై వెంటనే రంగంలోకి దిగాయి. కేంద్ర సంస్థలతో సమన్వయమై తబ్లిగ్‌ జమాత్‌కు హాజరైన వారి వివరాలు సేకరిస్తున్నాయి. 

ఇక రాష్ట్రంలో కోవిడ్‌–19ను సమగ్ర వ్యూహంతో ఎదుర్కొంటున్నామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం వీడియో కాన్పరెన్స్ సందర్భంగా  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తెలిపిన విషయం తెలిసిందే.

కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో దేశ రాజధానిలో మర్కజ్‌ నిర్వహించిన ఘటనపై ప్రభుత్వం తబ్లిగీ జమత్‌, నిజాముద్దీన్‌లపై కఠిన చర్యలు చేపట్టింది. ప్రార్ధనలకు హాజరైన 960 మంది విదేశీయులను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చడంతో పాటు వారి టూరిస్ట్‌ వీసాలను రద్దు చేసింది. విదేశీయుల చట్టం 1946,  విపత్తు నిర్వహణ చట్టం-2005 నిబంధనలను ఉల్లంఘించిన 960 మంది విదేశీయులపై చట్టబద్ధ చర్యలు చేపట్టాలని ఢిల్లీ పోలీసులు, డీజీపీని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

దక్షిణ ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో తబ్లిగ్‌ జమత్‌ సమ్మేళనం నిర్వహించిన తర్వాత ఈ ప్రాంతం కరోనా హాట్‌స్పాట్‌గా మారిన క్రమంలో హోంశాఖ ఈ చర్యలు చేపట్టింది. కాగా 9000 మంది తబ్లిగి జమత్‌ సభ్యులు, వారితో సన్నిహితంగా మెలిగిన వారిని ఇప్పటివరకూ క్వారంటైన్‌కు తరలించామని హోం శాఖ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో 2000 మంది తబ్లిగి జమత్‌ సభ్యుల్లో 1804 మందిని క్వారంటైన్‌కు తరలించామని, వారిలో 334 మంది వైరస్‌ అనుమానితులను ఆస్పత్రులకు తరలించామని హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య శ్రీవాస్తవ వెల్లడించారు. 

మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2000 దాటగా 53 మంది మరణించారు. తబ్లీగీ సమావేశంలో పాల్గొన్న వారిలో 1,548 మందిని ఢిల్లీ ప్రభుత్వం గత మూడురోజులుగా పట్టుకుని తరలించింది. ఆ ప్రాంతంలోనే 18 మందికి కరోనా పాజిటివ్ అని తేలటందో మొత్తం ప్రాంతాన్ని పూర్తిగా దిగ్భంధించారు. ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్‌ నుంచి  711 మంది ఆ సమావేశానికి హాజరైనట్లు గుర్తించగా తెలంగాణ నుంచి 400 మంది పాల్గొన్నట్లు తేలడంతో తెలుగు రాష్ట్రాలు కంపించిపోతున్నాయి.

 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   9 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   10 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   12 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   21 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle