newssting
Radio
BITING NEWS :
కరోనా సంక్షోభ తరుణంలోనూ వైద్యరంగంలో విశేష సేవలందిస్తున్న సంస్థలు, వైద్యులను ప్రముఖ మార్కెట్‌ రిసెర్చ్‌ కంపెనీ ‘టాప్‌ గ్యాలెంట్‌ మీడియా’ అవార్డులతో సత్కరించనుంది. ఈ సంవత్సరానికి(2020)గానూ సర్జికల్‌ అంకాలజీలో అత్యంత విశ్వసనీయ ఆస్పత్రిగా హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రిని ఎంపిక చేయడం విశేషం * సుక్మా జిల్లాలోని టల్మెటాలా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలపై మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. ఐఈడీ బ్లాస్ట్‌లతో విరుచుకుపడ్డారు. ఈ దాడి శనివారం అర్థరాత్రి జరిగింది. ఈ దాడిలో సీఆర్పీఎఫ్‌ కోబ్రాకి చెందిన ఎనిమిది మంది జవాన్లు గాయపడగా ఓ సీఆర్పీఎఫ్ అధికారి ప్రాణాలను కోల్పోయారు * కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశరాజధాని ఢిల్లీలో భారీఎత్తున రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. బురారి ప్రాంతంలోని నిరంకార్‌ మైదానంలో నిరసనకు పోలీసులు అనుమతిచ్చిన నేపథ్యంలో వేలమంది రైతులు నిరసన స్థలికి చేరుకుని కేంద్రంపై నిరసన వ్యక్తం చేశారు * పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. తొమ్మిది రోజులుగా చమురు ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఈనెల 19 నుంచి శనివారం వరకు (25వ తేదీ మినహా) ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి కూడా మరోసారి ధరలు పెరిగాయి. గడిచిన పది రోజుల్లో పెట్రోల్‌పై లీటర్‌కు రూ.1.28, డీజిల్‌ రూ.2.09 చొప్పున పెరిగింది * బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదివారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుని.. 10:45 గంటలకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు * రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రత భారీగా పడిపోయింది. మెదక్‌లో అతితక్కువగా 14.8 డిగ్రీలు, హైదరాబాద్‌లో 17డిగ్రీల కనిష్ఠ ఉష్ణో గ్రత నమోదైంది. గాలిలో తేమ శాతం పెరిగింది * బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి బయలుదేరింది. ఇది తుపాన్‌గా మారే అవకాశాలు ఉండడంతో దీనికి బురేవి అని నామకరణం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రభావంతో ఆదివారం నుంచి సముద్ర తీరాల్లో వర్షాలు పడ నున్నాయి. ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది * జాతీయ ప్రవేశ పరీక్షలు... నీట్‌, జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు తమ ప్రతిభా సామర్థ్యాలను పరీక్షించుకునేందుకు ‘కోటా’ ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్ట్‌ సిరీస్‌ సిద్ధం చేసినట్లు ఐఐటీ, జేఈఈ ఫోరమ్‌ కన్వీనర్‌ లలిత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు www.iitjeeforum.com వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావొచ్చన్నారు * వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా భక్తులకు పదిరోజుల పాటు వైకుంఠ ద్వార ప్రవేశాన్ని కల్పించనున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. డిసెంబరు 25నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచాలని నిర్ణయించినట్టు వివరించారు.

60 వేలకు చేరువలో కరోనా కేసులు.. తాజా కేసులు, మృతుల్లో భారత్ రికార్డు

10-05-202010-05-2020 08:21:47 IST
2020-05-10T02:51:47.391Z10-05-2020 2020-05-10T02:51:45.159Z - - 29-11-2020

60 వేలకు చేరువలో కరోనా కేసులు.. తాజా కేసులు, మృతుల్లో భారత్ రికార్డు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారతదేశంలో కరోనా విజృంభణ ఆగడం లేదు. ఈ వైరస్‌ వల్ల మరణాలు 2 వేలను దాటగా, పాజిటివ్‌ కేసులు 60 వేలకు చేరుకున్నాయి. గత రెండు రోజుల్లో కరోనా కేసుల్లో 13 శాతం పెరుగుదల నమోదు కావడంతో కేంద్ర ఆరోగ్య శాఖలో కలవరం మొదలైంది. జపాన్, సింగపూర్ దేశాల కంటే ఎక్కువ శాతం పెరుగుదల నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేవలం 11 రోజుల వ్యవధిలో భారత్‌లో కేసుల సంఖ్య రెట్టింపు కావడం ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. కేసుల సంఖ్య ఇదేరీతిలో పెరుగతూపోతే నాలుగురోజుల్లోనే 60 వేలనుంచి 75 వేలకు కరోనా కేసులు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

శుక్రవారం నుంచి శనివారం వరకు ఒక్కరోజులో 95 మంది కరోనా కాటుతో మృతిచెందారు. కొత్తగా 3,320 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటిదాకా మొత్తం మరణాలు 1,981కు, పాజిటివ్‌ కేసులు 59,662కు చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం ప్రకటించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కరోనా కేసులు 39,834 కాగా, 17,846 మంది చికిత్స అనంతరం కోలుకున్నారు. రికవరీ రేటు 29.91 శాతానికి పెరిగింది.

దేశంలో కరోనా కేసులు 60 వేలను, మృతుల సంఖ్య 2 వేలను దాటింది.. కేంద్ర కుటుంబ సంక్షేమ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం శనివారం ఉదయం నాటికి గడిచిన 24 గంటల్లో 3,320 కేసులు రికార్డవగా 95 మంది ప్రాణాలు కోల్పోయారు. కేసుల సంఖ్యను 59,662గా, మరణాలను 1,981గా మంత్రిత్వ శాఖ పేర్కొంది. రాష్ట్రాల నుంచి అందిన సమాచారం ప్రకారం చూస్తే ఈ సంఖ్యలు పెరుగుతున్నాయి. కాగా, రోగుల్లో 29.91 శాతం మంది కోలుకున్నారని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. 

మహారాష్ట్రలో మరో 1,165 కేసులు రికార్డయ్యాయి. 48 మంది చనిపోయారు. ఇందులో ముంబైవాసులే 27 మంది. సరిగ్గా రెండు నెలల్లోనే రాష్ట్రంలో కేసులు 20 వేలకు చేరడం గమనార్హం. ముంబై ఆర్థర్‌ రోడ్‌ జైలులో నివారణ చర్యలు తీసుకోవాలని బొంబాయి హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గుజరాత్‌లో మరో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. అహ్మదాబాద్‌లోనే 280 కేసులు నమోదయ్యా యి. 20 మంది మృతిచెందారు. ఇక్కడ మొత్తం 5 వేల పైన కేసులు తేలగా, 363 మంది చనిపోయారు. 

ఈ నేపథ్యంలో దేశంలో కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్‌ తెలిపారు. ప్రస్తుతం రోజుకు దాదాపు 95 వేల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటిదాకా 15,25,631 పరీక్షలు నిర్వహించామన్నారు. 332 ప్రభుత్వ, 121 ప్రైవేట్‌ ల్యాబ్‌ల్లో ఈ టెస్టులు జరుగుతున్నాయని వివరించారు. ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా నియంత్రణ చర్యలపై మంత్రి హర్షవర్ధన్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.  కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని హర్షవర్ధన్‌ సూచించారు. ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాం, త్రిపుర మినహా మిగిలిన రాష్ట్రాలు గ్రీన్‌ జోన్‌లోనే ఉన్నాయని చెప్పారు.

ఏపీ, తెలంగాణకు కేంద్ర బృందాలు!

కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రత అధికంగా నమోదవుతున్న 10 రాష్ట్రాలకు మరిన్ని బృందాలను పంపించాలని కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా నిర్ణయించింది. వైద్య నిపుణులు, సీనియర్‌ అధికారులతో కూడిన ఈ బృందాలు కరోనా వ్యాప్తి నియంత్రణ విషయంలో రాష్ట్రాలకు సహకరిస్తాయి. కేంద్ర బృందాలను గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పంపనున్నట్లు ఆరోగ్య శాఖ శనివారం ప్రకటించింది. మే 3వ తేదీన 20 బృందాలను కరోనా ప్రభావం ఉధృతంగా ఉన్న 20 జిల్లాలకు పంపించినట్లు గుర్తుచేసింది.

సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్‌ వంటి కేంద్ర బల గాల్లో వైరస్‌ వ్యాప్తి ఎక్కువైంది. శనివారం కొత్తగా 116 మంది జవాన్లు కరోనా బారినపడ్డారు. దీంతో కేంద్ర పారా మిలటరీ దళాల్లో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 650కి చేరిందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే కరోనా విజృంభిస్తున్న మహారాష్ట్రలో 750 మంది పోలీసులకు కరోనా వైరస్ సోకడంతో పోలీసు కుటుంబాలు గడగజలాడుతున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 40 లక్షల సంఖ్యను దాటేశాయి. భారతదేశంతో పాటు ప్రపంచంలో చాలా దేశాలు కోవిడ్-19 నిరోధానికి లాక్ డౌన్‌లో ఉంటున్నాయి.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle