newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

30 ఏళ్ల క్రితం అత్యాచారాలపై అమితాబ్ సంచలన వ్యాఖ్యలు..

06-12-201906-12-2019 16:40:07 IST
Updated On 12-12-2019 15:37:17 ISTUpdated On 12-12-20192019-12-06T11:10:07.742Z06-12-2019 2019-12-06T11:10:02.765Z - 2019-12-12T10:07:17.386Z - 12-12-2019

30 ఏళ్ల క్రితం అత్యాచారాలపై అమితాబ్ సంచలన వ్యాఖ్యలు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులైన నలుగురు ఇవాళ ఉదయం చటాన్‌పల్లి వద్ద ఎన్‌కౌంటర్‌లో మరణించిన సంగతి తెలిసిందే. గత నెల 28న తొండుపల్లి టోల్ గేట్ వద్ద దిశను కిడ్నాప్ చేసి షాద్‌నగర్ పరిధి చటాన్‌పల్లిలో హత్యాచారం చేసిన అనంతరం ఆమెను ఆ నిందితులు దహనం చేశారు. ఫోన్ కాల్ ద్వారా నలుగురు నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

ఏ1 ఆరిఫ్ పాషా, ఏ2 జొల్లు శివ, ఏ3 జొల్లు నవీన్, ఏ4 చెన్నకేశవులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దిశ ఫోన్ పాతి పెట్టినట్లు నిందితులు తెలపడంతో వారిని పోలీసులు సంఘటనా స్థలానికీ తీసుకువెళ్లారు. ఇదే క్రమంలో నలుగురు నిందితులు రాళ్లు రువ్వడంతో పాటు అక్కడ ఉన్న కర్రలతో దాడిని ప్రయత్నించారు.పోలీసుల దగ్గర ఉన్న ఆయుధాలు లాక్కొని కాల్పులు ప్రారంభించారు.

దీంతో అప్రమత్తమైన పోలీసులు కూడా కాల్పులు జరపడంతో నిందితులు అక్కడిక్కడే మరణించారు. దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ కేసులో నిందితులకు ఎన్ కౌంటర్ లో మరణించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు మాత్రమే గాక సామాన్య ప్రజలు కూడా తెలంగాణ పోలీసులకు నీరాజనాలు పలుకుతున్నారు. 

నిర్భయ కేసులో కూడా ఇలాంటి చర్యనే ఢిల్లీ పోలీసులు చేయాల్సింది అంటూ కామెంట్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకుండా ఉండాలంటే చట్టాలను మార్చాలని దేశ వ్యాప్తంగా డిమాండ్ ఊపందుకుంది. ఈ సందర్భంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూ ఆయన మెడకు చుట్టుకుంది. ఆయన 1990లో ప్రముఖ మ్యాగజైన్ 'మూవీ' కిచ్చిన ఇంటర్వ్యూ లో అమితాబ్ చేసిన కామెంట్స్ ఆ మ్యాగజైన్ కవర్ పై కూడా వేసింది.

30 సంవత్సరాల కిందట అమితాబ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి. "అత్యాచారం తప్పదనుకున్నప్పుడు... వెనక్కి పడుకుని దాన్ని ఎంజాయ్ చేయండంటూ" అమితాబ్ చెప్పాడని సోషల్ మీడియాలో హోరెత్తుతోంది. అమితాబ్ కామెంట్స్ తో వచ్చిన ఆ మ్యాగజైన్ కవర్ పిక్ ను నెటిజన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. సూపర్ స్టార్లే ఇలా మాట్లాడితే... మహిళలకు రక్షణ ఎక్కడుంటుందని కొందరు ప్రశ్నిస్తున్నారు.

మహిళలపై అమితాబ్ కు ఇంత చులకన భావమా? అంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ అభిమానులు మాత్రం ఏదో యధాలాపంగా అన్న మాటలను ఇప్పుడు చర్చకు అవసరమా? అంటూ వారు కామెంట్ చేస్తున్నారు. మొత్తం మీద దిశా ఘటనతో అమితాబ్ గతంలో చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. దీనిపై అమితాబ్ ఇంకా స్పందించాల్సి ఉంది.

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   4 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   4 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   6 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   15 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle