newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

21 రాష్ట్రాల రాజధానుల్లో కుళాయి నీళ్లు కల్తీ: కేంద్రం షాకింగ్ రిపోర్ట్

17-11-201917-11-2019 10:57:06 IST
2019-11-17T05:27:06.149Z17-11-2019 2019-11-17T05:27:01.806Z - - 11-08-2020

 21 రాష్ట్రాల రాజధానుల్లో కుళాయి నీళ్లు కల్తీ: కేంద్రం షాకింగ్ రిపోర్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలోని 21 రాష్ట్రాల రాజధానీ నగరాల్లో కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్ననీరు తాగడానికి పనికిరాదని తాజా అధ్యయనం తెలిపింది. ఈ 21 రాష్ట్రాల రాజధానుల్లో ముంబై నుంచి తీసుకున్న పైప్ వాటర్‌ నమూనాలు మాత్రమే నాణ్యతా ప్రమాణాల్లో నెగ్గినట్లు ఈ అధ్యయనం స్పష్టం చేసింది. పైపుల ద్వారా సరఫరా చేస్తున్న నీటి నాణ్యతపై ఈ రిపోర్టును ఇచ్చింది సాక్షాత్తూ కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖే కావడం గమనార్హం.

కేంద్ర వినియోగదారు వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజాపంపిణీ శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ శనివారం ఈ నివేదికను విడుదల చేశారు. తొలి రెండు దశల్లో 21 నగరాల నుంచి కుళాయి నీటి నాణ్యతను తనిఖీ చేయడానికి నమూనాలు తీసుకున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. ప్రధాన మంత్రి జల్ జీవన్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా ఈ అధ్యయనాన్ని చేపట్టామని మంత్రి వివరించారు. 

జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కుళాయి నీటి నాణ్యతను పాటిస్తున్నది దేశం మొత్తం మీద ముంబై నగరమేనని నమూనా పరీక్షలు తేల్చివేశాయి. ముంబైతో పాటు నీటి నమూనాలను ఢిల్లీ చండీగర్, తిరువనంతపురం, పాట్నా, భోపాల్, గౌహతి, గాంధీ నగర్, లక్నో, జమ్మూ, జైపూర్, డెహ్రాడూన్, చెన్నయ్, కోల్‌కతా తదితర నగరాలనుంచి తీసుకోగా ఒక్క ముంబై శాంపిల్స్ తప్ప మిగతా నగరాల నీటి నమూనాలు మొత్తంగా నీని నాణ్యతా పరిక్షల్లో విఫలమయ్యాయని కేంద్ర మంత్రి తెలిపారు. 

ముంబై నగరం నుంచి తీసుకున్న అన్ని నీటి నమూనాలు మాత్రం పరీక్షలో నెగ్గాయి. అంటే ముంబై నగరవాసులకు సరఫరా చేస్తున్న కుళాయి నీటిని ప్రజలు నిక్షేపంగా తాగవచ్చన్నమాట. కుళాయి నీటిని తాగడానికి యోగ్యంగా చేయడానికి కేంద్రప్రభుత్వం నుంచి ఏ సహాయం కావాలో తెలపాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలను కోరుతూ ఉత్తరం రాశానని రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు.

నీటి నాణ్యతా పరీక్షలకోసం 48 పరామితులతో తనిఖీ చేస్తామని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) తెలిపింది. అయితే తాజా అధ్యయనంలో రేడియో యాక్టివిటీ పరీక్షను క్లోరిన్ అవశేషాలను మినహాయించారు. తీసుకున్న నమూనాలన్నింటికీ అర్గానోలెప్టింక్ మరియు ఫిజికల్, కెమికల్ టెస్టులు, బాక్టీరియలాజికల్ పరీక్షలను మినహాయించామని బీఐఎస్ తెలిపింది. 

నాణ్యతకోసం తీసుకున్న వివిధ నమూనాలలో చాలావరకు తమ ప్రమాణాలకు అనుగుణంగా లేవని బీఐఎస్ తెలిపింది. పైన పేర్కొన్న నగరాలతో పాటు హైదరాబాద్, భువనేశ్వర్, రాంచీ, రాయ్‌పూర్, అమరావతి, షిమ్లా వంటి నగరాల్లోని నీటి నమూనాలను కూడా తీసుకున్నామని, కానీ తమ సంస్థ విధించిన నిబంధనలలో అనేక శాంపిల్స్ విఫలమైనట్లు బీఐఎస్ తెలిపింది.

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   3 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   4 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   6 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   15 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle