newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

20లక్షల కోట్ల ప్యాకేజీలో వ్యవసాయానికి ఎంత?

14-05-202014-05-2020 16:37:08 IST
Updated On 14-05-2020 18:16:35 ISTUpdated On 14-05-20202020-05-14T11:07:08.303Z14-05-2020 2020-05-14T11:07:02.026Z - 2020-05-14T12:46:35.136Z - 14-05-2020

20లక్షల కోట్ల ప్యాకేజీలో వ్యవసాయానికి ఎంత?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆత్మ నిర్భర భారత్‌ అభియాన్‌కు సంబంధించిన వివరాలను ఒక్కొక్కటిగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడిస్తున్నారు. ఇవాళ వ్యవసాయరంగంపై ఫోకస్ పెట్టారు. రెండవ రోజు కేటాయింపుల్లో తొమ్మిది విభాగాలకు కేటాయింపులు. సన్నకారు రైతులకు తక్కువ రేటుకే రుణాలు ఇస్తామన్నారు. వలస కార్మికులకు నగదు పంపిణీ జరిగింది. సకాలంలో వడ్డీలు చెల్లించేవారికి మే 31 వరకూ వడ్డీ రాయితీ ప్రకటించారు.

పట్టణాల్లో పేదలు, వలస కూలీలకు రోజుకి మూడుపూటలా అన్నపానీయాలు అందిస్తాం. మూడుకోట్ల మంది రైతులకు రుణాలు ఇస్తామన్నారు. గ్రామీణ బ్యాంకులు. సహకార బ్యాంకుల్లో రూ.29,500 కోట్లు రీ ఫైనాన్స్ చేశామన్నారు మంత్రి నిర్మలా సీతారామన్. 

రైతులకు 25 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులు. పట్టణ స్వయం సహాయక సంఘాలకు రూ.12 వేల కోట్లు అందించాం. మూడుకోట్ల మంది రైతులకు రుణాల కేటాయింపు. వలస కార్మికులు, మినిమం వేజెస్ అందరికీ అందిస్తాం. రైతులకు రూ.4.22 కోట్ల రూపాయలు రుణాలు అందించాం. ప్రతి కంపెనీ ఏటా కుటుంబానికి ఆరోగ్య పరీక్షలు. అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇవ్వాలి. కిసాన్ క్రెడిట్ కార్డుదారులకు 25 వేల కోట్లు అందించాం. 

10 మందికంటే ఎక్కువగా వున్న ప్రతి సంస్థ ఈఎస్ఐ సదుపాయం కల్పించాలి. సోషల్ సెక్యూరిటీ అందరికీ కల్పిస్తాం. వలస కార్మికులకు సహాయ శిబిరాలు, భోజన ఏర్పాట్లకు 11వేల కోట్లు కేటాయింపు. గ్రామీణ మౌలిక సదుపాయాల కోసం 11 వేలకోట్ల కేటాయించాం. పట్టణ స్వయం సహాయక సంఘాలకు 12 వేల కోట్లు కేటాయించింది ప్రభుత్వం. పశుపోషకులకు, మత్స్యకారులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డులిస్తాం. 

కనీస వేతనం 30 శాతమందికే అందుతోంది. ఇప్పుడు అందరికీ అందిస్తాం. రాబోయే 2 నెలల్లో వలస కార్మికులకు ఆహారధాన్యాలు అందిస్తాం. 5 కేజీల బియ్యం లేదా గోధుమలు అందిస్తాం. నాన్ ఆధార్  హోల్డర్లకు 5 కేజీల బియ్యం, కిలో పప్పుధాన్యాలు ఇస్తాం. 8 కోట్లమంది వలస కార్మికులకు అందిస్తాం. వీరికోసం 3500 కోట్లు ఖర్చుపెడతాం. మరో 2 నెలలు ఈ పథకం కొనసాగుతుంది.

ఎన్ డీ ఆర్ఎఫ్ కోసం రాష్ట్రాలకు 11,002 కోట్లు కేటాయింపు. 12వేల స్వయం సహాయక సంఘాలు 3 కోట్ల మాస్కులు, లక్షా 20 వేల లీటర్ల శానిటైజర్లు పంపిణీ చేశాం. దేశంలో ఎక్కడైనా రేషన్ కార్డు ద్వారా లాభం పొందవచ్చు. నేషనల్ పోర్టబిలిటీ వన్ నేషన్-వన్ రేషన్ కార్డు 67 కోట్ల మందికి ప్రయోజనం పొందవచ్చు. మార్చి 2021 నాటికి ఈ ప్రక్రియ అందరికీ అందేలా చూస్తాం. వ్యవసాయ రుణాలపై 3 నెలల పాటు మారటోరియం. ఉచిత ఆహారధాన్యాల పంపిణీ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. పీఎం ఆవాస్ యోజన పథకం కింద రెంటల్ హౌసెస్ స్కీం ప్రారంభించబోతున్నాం. గవర్నమెంట్ ఫండింగ్ హౌసింగ్ కాంప్లెక్స్ లు. పీపీపీ విధానం ద్వారా ఇవి నిర్మిస్తాం. 

పైసా పోర్టల్ ద్వారా స్వయం సహాయక సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ అందించామని నిర్మలా సీతారామన్ తెలిపారు. 50 లక్షల మంది స్ట్రీట్ వెండర్స్ కోసం రూ5000 కోట్ల రుణ సదుపాయం.  ప్రతి ఒక్కరికి 10వేలు పెట్టుబడి సాయం చేస్తాం. ఈ నెలాఖరుకి అందుబాటులోకి తెస్తాం. ముద్రరుణాలపై మారటోరియం అనంతరం 2 శాతం వడ్డీ వసూలు చేస్తాం. 

హౌసింగ్ కి సంబంధించి మధ్యతరగతివారికి 6 -18 లక్షల ఆదాయం కలిగినవారికి క్రెడిట్ లింక్ సబ్సిడీ ఫెసిలిటీ ఈ ఏడాది 31 మార్చి 2020 వరకూ అందించాం. ఈ స్కీం మార్చి 2021 వరకూ పొడిగించాం. 3.3 కోట్ల మంది ప్రయోజనం పొందవచ్చు. వడ్డీ రాయితీ అందుకోవచ్చు. గిరిజనులు, ఆదివాసీలకు అటవీ సంరక్షణ బాధ్యతలు అప్పగిస్తాం. వారికి ఉపాధి కల్పిస్తాం. 6000 వేల కోట్లు ఈ పథకం కోసం క్యాంపా  ఫండ్స్ కింద కేటాయించాం. 

30 వేల కోట్లు నాబార్డుకి కేటాయిస్తాం. రబీ పంటల కోతల కోసం దీనిని ఉపయోగించవచ్చు. ఖరీఫ్ పంటల ఏర్పాట్లు కోసం గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులకు రుణం ఇచ్చేందుకు ఈ సదుపాయం రైతులకు అందించవచ్చు. ఇప్పటికే 90వేల కోట్లు కేటాయింపులకు ఇది అదనం. 2.5 కోట్లమంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు లేనివారికి ఇది ప్రయోజనం. 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   3 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   3 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   5 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   14 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle