newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

హెర్డ్ ఇమ్యూనిటీ భారత్‌కు వర్తించదు.. టీకాతోనే కరోనా కట్టడి

31-07-202031-07-2020 10:59:53 IST
Updated On 31-07-2020 11:01:49 ISTUpdated On 31-07-20202020-07-31T05:29:53.332Z31-07-2020 2020-07-31T05:29:45.376Z - 2020-07-31T05:31:49.358Z - 31-07-2020

హెర్డ్ ఇమ్యూనిటీ భారత్‌కు వర్తించదు.. టీకాతోనే కరోనా కట్టడి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

భారత దేశంలోని అదిక జనసాంద్రత, సామాజిక ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా హెర్డ్ ఇమ్యూనిటీ సంభవించి కరోనా వైరస్ కట్టడి కాగలదన్న నమ్మకం అవాస్తవమేనని కేంద్ర ఆరోగ్య శాఖ తేల్చి చెప్పింది. ఒక ప్రాంతంలో ఉండే జనాభాలో ఎంత మందిలో యాంటీ బాడీలు అభివృద్ధి చెందితే అంత ఎక్కువగా హెర్డ్‌ ఇమ్యూనిటీని సాధించవచ్చని గత కొంతకాలంగా ప్రపంచం అభిప్రాయపడుతోంది. అయితే దీనిపై శాస్త్రవేత్తల్లోనే ఏకాభిప్రాయం కలగడం లేదు.  

70 నుంచి 90 శాతం ప్రజల్లో యాంటీబాడీలు ఉత్పత్తి అయితే దానిని హెర్డ్‌ ఇమ్యూనిటీగా పరిగణించవచ్చునని ఇప్పటివరకు భావిస్తున్నారు. అయితే 60 శాతం మందిలో వచ్చినా దానిని హెర్డ్‌ ఇమ్యూనిటీగా చెప్పుకోవచ్చునని ఇప్పటివరకు భావిస్తున్నారు. అయితే జనాభాలో 60 శాతం మందిలో వచ్చినా దానిని హెర్డ్‌ ఇమ్యూనిటీగా చెప్పుకోవచ్చునని వైరాలజిస్టులు  చెబుతున్నారు. 

అయితే ఈ అభిప్రాయం భారత్‌లోని ప్రత్యేక పరిస్థితుల్లో ఆచరణ సాధ్యం కాదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.  కొన్ని ప్రాంతాల్లో నివసించే జనాభాలో వైరస్‌ను తట్టుకునే యాంటీబాడీలు బాగా అభివృద్ధి చెందినప్పటికీ అవి స్వల్పకాలం మాత్రమే ఉంటాయని వెల్లడించింది. అందుకే హెర్డ్ ఇమ్యూనిటీతో వైరస్‌ని జయంచడం సాధ్యం కాదని టీకా కార్యక్రమం ద్వారా మాత్రమే ఇమ్యూనిటీని సాధించగలమని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారి రాజేష్‌ భూషణ్‌ చెప్పారు. 

గురువారం మీడియా సమావేశంలో రాజేష్ మాట్లాడుతూ హెర్డ్‌ ఇమ్యూనిటీతో కరోనాని జయించవచ్చునని మన దేశం భావించడం సరైంది కాదనేశారు. అధిక జనసాంద్రత, సామాజిక ఆర్థిక పరిస్థితులతో ఒకేసారి దేశవ్యాప్తంగా హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధ్యం కాదు. ఒక్కో సమయంలో కొన్ని ప్రాంతాల్లో హెర్డ్‌ ఇమ్యూనిటీ కనిపిస్తుంది. టీకాతో మాత్రమే కరోనాను జయించగలం అని ఆయన స్పష్టం చేశారు. అప్పటివరకూ ప్రజలందరూ నిబంధనలు పాటిస్తూ క్రమశిక్షణతో ఉండాలని రాజేష్‌ హితవు పలికారు.  

కరోనా వైరస్‌ను హెర్డ్‌ ఇమ్యూనిటీ ద్వారా నియంత్రించవచ్చునని ఇన్నాళ్లూ పెట్టుకున్న ఆశలు అడియాసలు అయ్యాయి. భారత్‌లాంటి అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. ఆరోగ్య శాఖ అభిప్రాయాలకు సమర్థన అన్నట్లుగా భారత్‌ వంటి దేశాల్లో జాతీయ స్థాయిలో హెర్డ్‌ ఇమ్యూనిటీని సాధించాలనుకోవడం తప్పిదం అవుతుందని ప్రముఖ వైరాలజిస్టు జమీల్‌ అభిప్రాయపడ్డారు. దేశంలో 70శాతం మందికి కరోనా సోకి వారిలో ఇమ్యూనిటీ పెరగాలని కోరుకోవడం సరికాదన్నారు. ఈ ప్రక్రియలో చాలా మంది ప్రాణాలు కోల్పోతారని  హెచ్చరించారు.

తాజాగా జర్నల్‌ సైన్స్‌లో ప్రచురించిన అధ్యయనం కూడా గతంలో ఉన్న అంచనాల కంటే తక్కువ మందిలో యాంటీబాడీలు ఉన్నా హెర్డ్‌ ఇమ్యూనిటీ అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చునని వెల్లడించింది. అయితే కోట్లలో జనాభా ఉన్న భారత్‌లో సాధారణ ప్రక్రియ ద్వారా హెర్డ్‌ ఇమ్యూనిటీ అసాధ్యం అన్న అంశంలో శాస్త్రవేత్తలో ఏకాభిప్రాయం నెలకొని ఉంది.

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   11 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   14 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   02-08-2020


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle