హెయిర్ సెలూన్లు, లిక్కర్ దుకాణాలకు నో పర్మిషన్
25-04-202025-04-2020 17:28:48 IST
Updated On 25-04-2020 17:55:17 ISTUpdated On 25-04-20202020-04-25T11:58:48.583Z25-04-2020 2020-04-25T11:58:42.992Z - 2020-04-25T12:25:17.199Z - 25-04-2020

దేశవ్యాప్తంగా మే3 వరకూ కొనసాగుతున్న లాక్ డౌన్లో కేంద్రం మరిన్ని సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. గ్రామీణ, చిన్న పట్టణాల్లో షాపులు తెరిచేందుకు అనుమతించిన కేంద్రం.. తమ ఆదేశాలు కేవలం అమ్మకాలు సాగించే దుకాణాలకు మాత్రమే పరిమితమని స్పష్టం చేసింది. అటు హెయిర్ సెలూన్లు, లిక్కర్ దుకాణాలు తెరవడం కోసం తాము ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని కేంద్ర హోంశాఖ జేఎస్ పుణ్య సలిల శ్రీవాస్తవ వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని దుకాణాలు తెరవచ్చని.. పట్టణ ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా చోట్ల దుకాణాలు తెరుచుకోవచ్చునని తెలిపారు. కాగా, షాపింగ్ మాల్స్, మార్కెటింగ్ కాంప్లెక్సులలో దుకాణాలు మాత్రం తెరవడానికి వీల్లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. మద్యం దొరక్క ఇబ్బందులు పడుతున్న మందుబాబులు మద్యంషాపులు తెరవాలని డిమాండ్ తెరమీదకు తెచ్చారు. పరిమిత సమయంలో బార్ల తరుపులు తెరవాలని వారు ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నారు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు బాగా పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రం మద్యంషాపులను సడలింపులనుంచి తొలగించింది. అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతిచ్చింది. మద్యం అమ్మకాలు లేకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్ధికంగా నష్టం జరగడం మరో ఎత్తు. ముఖ్యంగా లిక్కర్ సేల్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం భారీగా వస్తుంది. అలాంటిది కరోనా లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా మద్యం షాపులు మూతపడటంతో ఆదాయం శూన్యం అయింది. ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసినా లాక్ డౌన్ వేళ అక్రమంగా మద్యం అమ్మకాలు కొనసాగుతూనే వున్నాయి. దీంతో ఆల్ ఇండియా లిక్కర్ సమాఖ్య విడతల వారీగా మద్యం దుకాణాలను తెరవాలని దాదాపు 10 రాష్ట్రాల సీఎంలకు లేఖ రాసిన విషయం విదితమే. ఇదిలా ఉంటే ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ ధాక్రే లాక్ డౌన్ సమయంలో.. సామాజిక దూరాన్ని ఖచ్చితంగా పాటించేలా చేసి మద్యం దుకాణాలు తెరవాలంటే మహా సీఎం ఉద్ధవ్ థాక్రేకు లేఖ రాశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఎంతో అవసరం అని ఆయన లేఖలో పేర్కొన్నారు. మరి మహా సీఎం ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం మద్యం దుకాణాలు తెరవబోమని ఇద్దరు సీఎంలు ఖరాఖండీగా చెప్పేశారు. ఆదాయం కోసం ప్రజల ప్రాణాలు పణంగా పెట్టలేమంటున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు.

మాల్దీవులు, నేపాల్ సహా ఆరు దేశాలకు భారతీయ వ్యాక్సిన్లు
2 hours ago

జాక్ మా కనిపించాడుగా..!
3 hours ago

న్యాయవాది నుంచి ఉపాధ్యక్షురాలి దాకా 'కమల హ్యారిస్' ప్రయాణం
3 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 13,823 మందికి కరోనా
3 hours ago

రిపబ్లిక్ డే 'ట్రాక్టర్ ర్యాలీ'కి సన్నాహాలు..
4 hours ago

నేడే జో బైడన్, కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారం..
5 hours ago

ఒక విషాదం మరవకముందే మరొకటి.. పశ్చిమ బెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం..!
6 hours ago

వ్యాక్సిన్ తీసుకోడానికి భయపడకండంటున్న కేంద్రప్రభుత్వం
16 hours ago

సరిహద్దుల్లో ఏకంగా గ్రామాన్నే నిర్మించిన చైనా.. మోడీ ఏం చేస్తారో!
21 hours ago

హింస సమాధానం కానేకాదు.. మెలనియా ట్రంప్ వీడ్కోలు సందేశం
a day ago
ఇంకా