newssting
BITING NEWS :
*దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

హిజ్బుల్‌‌కి భారీ ఎదురుదెబ్బ.. టాప్‌ కమాండర్‌ హతం?

06-05-202006-05-2020 18:50:19 IST
Updated On 07-05-2020 09:29:25 ISTUpdated On 07-05-20202020-05-06T13:20:19.098Z06-05-2020 2020-05-06T13:19:51.304Z - 2020-05-07T03:59:25.289Z - 07-05-2020

హిజ్బుల్‌‌కి భారీ ఎదురుదెబ్బ.. టాప్‌ కమాండర్‌ హతం?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కాశ్మీర్ లోయలో అరాచకం సృష్టిస్తున్న తీవ్రవాద సంస్థ హిజ్బుల్ కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మూడు రోజుల క్రితం కశ్మీర్‌లోని హంద్వారాలో ముష్కరుల కాల్పుల్లో అమరులైన మన వీరజనాన్ల ప్రాణత్యాగానికి సైన్యం ఘనమైన నివాళి అర్పించే దిశగా సాగుతోంది. కశ్మీర్‌లో నక్కిన ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతోంది. అందులో భాగంగా గత రెండు రోజులుగా నిరాటంకంగా భారీ ఆపరేషన్లు చేపట్టింది. ఈ క్రమంలో ఉగ్రవాదుల కదలికలపై పక్కా సమాచారం సేకరించిన సేనలు మంగళవారం రాత్రి వారి జాడను కనిపెట్టాయి. ఇప్పటికే పుల్వామా జిల్లా షార్షలీలో ఇద్దరు ముష్కరుల్ని బలగాలు మట్టుబెట్టాయి.

కశ్మీర్‌లో సైనిక బలగాల వీరోచిత పోరాటంలో హిజ్బుల్ టాప్ కమాండర్ తలవంచక తప్పలేదు. మరో ఆపరేషన్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ టాప్‌ కమాండర్‌ రియాజ్‌ నైకూ పోలీసుల వలలో చిక్కాడు. ఇటీవల అతడు తన స్వగ్రామం బెయ్‌పొరకు వచ్చినట్లు పక్కా సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన దళాలు మంగళవారం రాత్రి గ్రామాన్ని దిగ్బంధించి.. ముష్కరుడు ఉన్న ఇంటిని చుట్టుముట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాది కాల్పులు ప్రారంభించడంతో సైన్యం ఎదురుకాల్పులు జరిపింది. ఇప్పటికే అతడు మరణించినట్లు స్థానికులు చెబుతున్నప్పటికీ.. పోలీసులు మాత్రం ఇంకా ధ్రువీకరించలేదు. 

మరికొంత మంది అతడు ప్రాణాలతో చిక్కాడని చెబుతున్నారు. దీనిపై ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది. అయితే, రాత్రి నుంచి ఆయా ప్రాంతాల్లో ఏకబిగిన భీకర కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. రియాజ్ నేపథ్యం పెద్దదే. తొలుత ఉపాధ్యాయుడిగా పనిచేసిన రియాజ్‌ 33 ఏళ్ల వయసులో ఉగ్రవాదం వైపు ఆకర్షితుడయ్యాడు. కరడుగట్టిన ఉగ్రవాది హిజ్బుల్‌ కమాండర్‌ బుర్హాన్‌ వానీ హతమైన తర్వాత ఆ బాధ్యతల్ని రియాజ్‌ తీసుకున్నట్టు తెలుస్తోంది.

మరో కీలక ముష్కరుడు జాకీర్‌ ముసా హిజ్బుల్‌ నుంచి వేరుపడిన తర్వాత సంస్థలో రియాజ్‌ కీలకంగా మారాడు. లోయలో యువకుల్ని ఉగ్రవాదంవైపు ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించాడు. స్థానిక స్పెషల్‌ పోలీస్‌ ఆఫీసర్స్‌ను బెదిరించి రాజీనామా చేయించడంలోనూ కీలకంగా వ్యవహరించినట్లు పోలీసుల వద్ద ఆధారాలున్నాయి. నిత్యం సరిహద్దుల వెంట కాల్పుల విరమణకు పాకిస్తాన్ తూట్లు పొడుస్తూనే వుంది. 

అరుణాచల్, లద్దాఖ్, కార్గిల్‌లలో భూకంపం

అరుణాచల్, లద్దాఖ్, కార్గిల్‌లలో భూకంపం

   2 hours ago


భారత్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. చైనా కంపెనీల తాజా రాగం

భారత్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. చైనా కంపెనీల తాజా రాగం

   4 hours ago


ఒక్క రోజులో 60 వేల కేసులు.. అల్లాడుతున్న అమెరికా

ఒక్క రోజులో 60 వేల కేసులు.. అల్లాడుతున్న అమెరికా

   4 hours ago


ఈసీ కీలక నిర్ణయాలు... కరోనా ఎఫెక్టే కారణమా?

ఈసీ కీలక నిర్ణయాలు... కరోనా ఎఫెక్టే కారణమా?

   10 hours ago


భారత్‌లో రికార్డు స్థాయిలో కేసులు.. ఒక్కరోజులో 23వేలు, 442 మంది మృతి

భారత్‌లో రికార్డు స్థాయిలో కేసులు.. ఒక్కరోజులో 23వేలు, 442 మంది మృతి

   11 hours ago


భారత్‌పై దుందుడుకు వైఖరి..  చైనా నిజ స్వరూపం ఇదే.. ట్రంప్‌ స్పష్టత

భారత్‌పై దుందుడుకు వైఖరి.. చైనా నిజ స్వరూపం ఇదే.. ట్రంప్‌ స్పష్టత

   11 hours ago


భారత్‌లో కరోనా బీభత్సం.. 30 రోజుల్లో 4 లక్షల కేసులు.. ఐదు రోజుల్లో లక్ష కేసులు

భారత్‌లో కరోనా బీభత్సం.. 30 రోజుల్లో 4 లక్షల కేసులు.. ఐదు రోజుల్లో లక్ష కేసులు

   04-07-2020


భారత్ వివాదాలను పెంచుకోదలుస్తోందా.. మోదీ వ్యాఖ్యకు చైనా ఖండన

భారత్ వివాదాలను పెంచుకోదలుస్తోందా.. మోదీ వ్యాఖ్యకు చైనా ఖండన

   04-07-2020


రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 24 గంటల్లో 20,903 కొత్త కేసులు.. 379 మంది మృతి

రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 24 గంటల్లో 20,903 కొత్త కేసులు.. 379 మంది మృతి

   04-07-2020


చైనా, పాక్‌ల నడ్డివిరిచిన భారత్.. విద్యుత్ పరికరాల దిగుమతిపై నిషేధం

చైనా, పాక్‌ల నడ్డివిరిచిన భారత్.. విద్యుత్ పరికరాల దిగుమతిపై నిషేధం

   04-07-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle