newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

హర్యానా సర్కార్ బంపరాఫర్.. వారికి డబుల్ శాలరీస్

10-04-202010-04-2020 11:02:15 IST
Updated On 10-04-2020 11:28:29 ISTUpdated On 10-04-20202020-04-10T05:32:15.074Z10-04-2020 2020-04-10T05:31:59.046Z - 2020-04-10T05:58:29.661Z - 10-04-2020

హర్యానా సర్కార్ బంపరాఫర్..  వారికి డబుల్ శాలరీస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తన ప్రతాపం చూపిస్తోంది. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు వైద్య సిబ్బంది రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నారు. తమ ప్రాణాలను పణంగా పెడుతూ డాక్టర్లు, నర్సులు కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. అలాంటి వారికి హర్యానా ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో పోరాడుతున్న డాక్టర్లు, నర్సులు, ఇతర పారా మెడికల్ సిబ్బందికి డబుల్ శాలరీలు ఇస్తామని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కీలక ప్రకటన చేశారు.

ఈ మహమ్మారి తగ్గేంత వరకు వీళ్లకు నెలకు ఇచ్చే జీతం డబుల్ ఇస్తామన్నారు.అంతేకాకుండా కరోనా వైరస్ విధులు నిర్వర్తిస్తూ ఎవరైనా పోలీసు చనిపోతే వారి కుటుంబాలకు రూ. 30 లక్షల పరిహారాన్ని ఇస్తామని సీఎం ప్రకటించారు. ఇక గతంలో పంజాబ్ ప్రభుత్వం కూడా కరోనా వారియర్స్‌కు రూ.50 లక్షలతో ప్రత్యేక హెల్త్ ఇన్సూరెన్స్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అటు కేంద్రం ప్రకటించిన రూ.లక్షా 70వేల కోట్ల ప్యాకేజీలో కూడా కరోనా నియంత్రణలో శ్రమిస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటే డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బందికి రూ.50 లక్షల ఇన్సూరెన్స్ ప్రకటించింది. 

అదేవిధంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వేతనాల కోత నుంచి వైద్యసిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందిని మినహాయించింది. అంతేకాదు జీహెచ్ఎంసీలో పనిచేసేవారికి సీఎం ప్రత్యేక ప్రోత్సాహంగా రూ.7500, గ్రామపంచాయితీలు, మునిసిపాలిటీలలో పనిచేసేవారికి రూ.5000 ప్రత్యేక ప్రోత్సాహక వేతనం అందిస్తామని సీఎం కేసీయార్ ప్రకటించారు. అదేవిధంగా కేంద్రం ఇండియా కోవిడ్ 19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టం ప్రిపేర్డ్‌నెస్ ప్యాకేజీ 15 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. 

కరోనా వైరస్ బాధితులకు తక్షణ వైద్య సాయం అందించేందుకే వీలుగా రూ.15 వేల కోట్ల సాయం ప్రకటించింది. ఈ నిధుల ద్వారా కరోనా బాధితులకు అవసరమయిన తక్షణ వైద్య సహాయం, ఇతర మౌలిక వసతుల కల్పన జరుగుతుంది.

కరోనా పరీక్షా కేంద్రాలు, వ్యక్తిగత రక్షణ సదుపాయాలు (పిపిఇ)ల కొనుగోలు, ఐసోలేషన్ బెడ్లు, ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లను సమకూర్చుకోవచ్చు. అంతేకాకుండా అత్యవసరమయిన వైద్యసదుపాయాలు, పరికరాలు, శిక్షణ, వైద్య మరియు మందుల కొనుగోలు, వైద్యసిబ్బంది నియామకం చేపడతారు. మొత్తం మీద దేశవ్యాప్తంగా కరోనాతో పోరాటం చేస్తున్నవారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాయి. 

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   5 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   8 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   21 hours ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle