newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

స్వైన్ ఫ్లూ వైరస్‌తో వణుకుతున్న బెంగళూరు

22-02-202022-02-2020 08:09:46 IST
2020-02-22T02:39:46.630Z22-02-2020 2020-02-22T02:39:33.125Z - - 05-08-2020

స్వైన్ ఫ్లూ వైరస్‌తో వణుకుతున్న బెంగళూరు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఒకవైపు ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌-19(కరోనా వైరస్‌) ప్రకంపనలు కొనసాగుతుండగానే బెంగళూరు నగరంలో స్వైన్‌ ఫ్లూ  కేసులు నమోదు కావడం మరింత ఆందోళన రేపుతోంది. తాజాగా జర్మనీ సాఫ్ట్‌వేర్ గ్రూప్ కుచెందిన భారత సంస్థ ‘సాప్‌’ ఉద్యోగులకు ప్రాణాంతక  స్వైన్‌ ఫ్లూ కారక హెచ్‌1ఎన్‌1 వైరస్‌ సోకడంతో ఆ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తాత్కాలికంగా తన కార్యాలయాలన్ని మూసివేయడంతో పాటు, ఉద్యోగులకు ఇంటినుంచే పనిచేసే సదుపాయాన్ని కల్పించింది. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం, హెచ్1ఎన్1 లక్షణాలలో జ్వరం, చలి, గొంతు నొప్పిలాంటివి సాధారణ జలుబు లక్షణాలుగా పైకి కనిపించినప్పటికీ, ఈ వైరల్ న్యుమోనియా ఆరోగ్యకరమైన యువకులను కబళించే తీవ్రత ఉన్న కారణంగా ఈ ముందస్తు చర్యలు చేపట్టింది.

బెంగళూరులో సాప్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులు హెచ్‌1ఎన్‌1 వైరస్‌ ఫలితం పాజిటివ్‌ వచ్చింది. దీంతో శానిటైజేషన్ కోసం భారత్‌లోని తన కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేసినట్టు సాప్‌ ప్రకటించింది. బెంగళూరు, గుర్గావ్‌, ముంబై ఆఫీసులలో సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలిపింది. అలాగే తదుపరి నోటీసు వచ్చేంతవరకు తమ ఉద్యోగులందరూ ఇంటి నుండే పని చేయాలని కోరింది.   

చలి, దగ్గు, జ్వరం వంటి సాధారణ వ్యాధి లక్షణాలు పొడసూపినా సరే తమ సంస్థ ఉద్యోగులు వెంటనే వైద్య సలహాకోసం వైద్యులను సంప్రదించాలని శాప్ యాజమాన్యం తన ఉద్యోగులకు సూచించింది. మా ఉద్యోగుల ఆరోగ్యం మా ప్రధమ ప్రాధాన్యత. సమస్య తీవ్రమైంది కాబట్టే హె1ఎన్1 వైరస్ వ్యాప్తిని అరికట్టే ఉద్దేశంతోనే తాము ముందుజాగ్రత్తగా ఈ సమాచారాన్ని బహిరంగం చేస్తూ తమ ఉద్యోగులకు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పినట్లు శాప్ పేర్కొంది.

కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ 2009లో హెచ్1ఎన్1ని సాంక్రమిక వ్యాధిగా ప్రకటించింది. ప్రతి సంవత్సరం సీజనల్ ఇన్ప్లూయంజా బారిన భారతీయులు పడుతుండడంతో సాధారణ చలి, దగ్గు, జ్వరం లక్షణాల పట్ల కూడా ఆందోళన చెందాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఒకరికి సోకితే వేలు, లక్షలమందికి అంటుకునే అంటువ్యాధులకు భారత్ కూడా నిలయం అనేది తెలిసిన విషయమే.

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   an hour ago


భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

   5 hours ago


మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

   7 hours ago


బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

   8 hours ago


భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

   8 hours ago


భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

   9 hours ago


దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   a day ago


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   04-08-2020


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   04-08-2020


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle