newssting
BITING NEWS :
*దిశ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృదం.. శంషాబాద్ డీసీపీ నేతృత్వంలో విచారణ కమిటీ *హైదరాబాద్ మెట్రోలో పెప్పర్ స్ప్రేలకు అనుమతి * ఎన్‌ఆర్‌సీ బిల్లుకిమంత్రివర్గం ఆమోదం*కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొనసాగుతున్న పోలింగ్*రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక గత మూడు నెలలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు*చిత్తూరుజిల్లాలో దారుణం... కాలేజి నుండి వస్తుండగా బాలిక కిడ్నాప్*విజయవాడలో అజిత్ సింగ్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు*నేడు పోలీస్‌ కస్టడీకి దిశ నిందితులు..నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు..వారం రోజుల పాటు విచారణ*నేడు ఆర్బీఐ విధాన సమీక్ష.. వడ్డీరేట్ల పై కీలక ప్రకటన చేయనున్న ఆర్బీఐ *శబరిమల సన్నిధిలో సెల్ ఫోన్లు బంద్... స్వామి గర్భగుడి పరిసర ప్రాంతాల్లో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేదించిన ట్రావెన్ కోర్ బోర్డు *తెలంగాణ సెక్యూరిటీ కమిషన్, పోలీస్ కంప్లైట్ అథారిటీని ఈ నెల 27వ తేదీలోగా ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశం*వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. రోజుకు నలుగురిని విచారించిన సిట్ బృందం.. రేపు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించనున్న సిట్

స్వామి నిత్యానంద ఎక్కడున్నాడో తెలుసా?

03-12-201903-12-2019 17:38:48 IST
2019-12-03T12:08:48.675Z03-12-2019 2019-12-03T12:08:35.930Z - - 06-12-2019

స్వామి నిత్యానంద ఎక్కడున్నాడో తెలుసా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వివాదాస్పద స్వామీజీ నిత్యానంద అదృశ్యం

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఆశ్రమం

యోగిణి సర్వజ్ఞపీఠం పేరుతో నడుస్తున్న ఆశ్రమం 

ఆశ్రమంలో అమ్మాయిల్ని నిర్బంధించినట్టు ఆరోపణలు

దేశం విడిచి పారిపోయిన స్వామీజీ

ట్రినిడాడ్ లో వున్నట్టు సమాచారం

దొంగ పాస్ పోర్టుతో పరారీ

2018లో ముగిసిన నిత్యానంద పాస్ పోర్ట్ 

స్వామీ నిత్యానంద... ఈయన పేరు అందరికీ చిరపరిచితం. వివిధ ఆరోపణల నేపథ్యంలో దొంగ పాస్‌పోర్టుతో దేశం విడిచి పారిపోయిన నిత్యానంద పోలీసులకు చిక్కే అవకాశం కనిపించడంలేదు. ప్రస్తుతం స్వామిజీ నిత్యానంద ట్రినిడాడ్‌ దీవుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల అక్కడ ఓ ప్రైవేట్‌ దీవిని కొనుగోలు చేశాడు నిత్యానంద.. దానికి కైలాస అని పేరు కూడా పెట్టినట్టు చెబుతున్నారు.

ఈ దీవికి దేశం హోదా ప్రకటించాలని కోరుతున్నాడు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిత్యానంద యోగిణి సర్వజ్ఞపీఠం పేరుతో ఆశ్రమం నిర్వహిస్తున్నాడు. ఆ ఆశ్రమంలో అక్రమంగా అమ్మాయిలను నిర్బంధించారంటూ జనార్ధనశర్మ అనే ఓ వ్యక్తి కేసు పెట్టాడు. పిల్లల్ని తీవ్రంగా హింసించారని ఆరోపించారు. గుజరాత్ రాష్ట్ర పిల్లల రక్షణ పరిరక్షణ కమిషన్‌తో పాటు గుజరాత్ హైకోర్టును ఆయన ఆశ్రయించారు.

అయితే పోలీసుల చొరవతో ఇద్దరు కుమార్తెలకు విముక్తి లభించగా, పెద్ద కుమార్తెలిద్దరు నిత్యానంద సంస్థను విడిచి పెట్టడానికి నిరాకరించారు. ఆశ్రమంయలో ఉన్న పిల్లల్ని గుర్తించాల్సిందిగా గుజరాత్ హైకోర్టు నవంబర్ 26న పోలీసులను ఆదేశించింది. అంతేకాదు ఇంటర్‌పోల్, విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఇతర సంబంధిత అధికారులను కూడా సంప్రదించాలని హైకోర్టు పోలీసులకు సూచించింది. దీంతో కేసు నమోదు చేసిన  గుజరాత్ పోలీసులు పరారీలో ఉన్న నిత్యానందకోసం గాలిస్తున్నారు. 

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆశ్రమాన్ని జల్లెడ పట్టారు. అక్కడి పరిస్థితిని చూసి నోరెళ్ళబెట్టారు. అక్కడ అక్రమంగా అమ్మాయిలను నిర్బంధించినట్టు దర్యాప్తులో తెలుసుకున్నారు. దీంతో నిత్యానందపై కేసు రిజిస్టర్ చేశారు. మరోవైపు నిత్యానందను తొమ్మిదేళ్లనాటి కేసు వెంటాడుతోంది. ఆశ్రమానికి వచ్చిన ఓ మహిళపై అత్యాచారం చేసాడని ఆరోపణ దాదాపు నిర్ధారణ అయింది.  గతంలో ఉన్న కేసుల్లో నిత్యానంద వాయిదాలకు కోర్టు మెట్లెక్కలేదు. దీంతో ఆయన అరెస్ట్ కు రంగం సిద్ధమయింది. దీంతో నిత్యానంద నకిలీ పాస్ పోర్టుతో దేశం విడిచిపారిపోయాడు. 

నిత్యానంద ఆశ్రమంలో పోలీసులు దాడులు చేయడం కలకలం రేపుతోంది. ఈదాడులలో ల్యాప్‌టాప్, మొబైల్స్, ట్యాబ్స్‌ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆశ్రమంలోని భక్తులంతా ఆశ్రమాన్ని వీడారు.  అంతేకాదు స్వాధీనం చేసుకున్న డివైస్‌లలో మైనర్ పిల్లలపై శారీరక దాడి, వేధింపులు, తీవ్రంగా హింసిస్తున్న వీడియోలు, ఫోటోలను  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిత్యానంద పాస్‌పోర్ట్  గడువు 2018 సెప్టెంబర్‌లో ముగిసిందనీ,  అత్యాచారం ఆరోపణల కారణంగా రెన్యువల్‌  చేయలేదనీ ప్రస్తుతం నిత్యానంద ఎక్కడ ఉన్నారో తెలియదని చెబుతున్నారు అధికారులు. ట్రినిడాడ్ లో వున్నట్టు తెలియడంతో పోలీసులు నిత్యానందను రప్పించేందుకు ఏం చేయాలో ఆలోచిస్తున్నారు. గతంలో స్వామీజీతో హీరోయిన్ రంజిత వ్యవహారం ఎంతటి సంచలనం కలిగించిందో అందరికీ తెలిసిందే. 

 

సూడాన్‌‌లో భారీ పేలుడు.. 18మంది భారతీయుల సజీవదహనం

సూడాన్‌‌లో భారీ పేలుడు.. 18మంది భారతీయుల సజీవదహనం

   a day ago


లారీడు ఉల్లి మాయం... పొలంలో ఉల్లిపంట మాయం... ఉల్లి నేరాలు షురూ

లారీడు ఉల్లి మాయం... పొలంలో ఉల్లిపంట మాయం... ఉల్లి నేరాలు షురూ

   05-12-2019


రాత్రిపూట స్త్రీలకు ఉచిత ప్రయాణం.. పంజాబ్ ప్రభుత్వ కీలక నిర్ణయం

రాత్రిపూట స్త్రీలకు ఉచిత ప్రయాణం.. పంజాబ్ ప్రభుత్వ కీలక నిర్ణయం

   05-12-2019


డబ్బులేదు-అమెరికా అధ్యక్ష పదవికి పోటీచేయను: కమలా హ్యారిస్

డబ్బులేదు-అమెరికా అధ్యక్ష పదవికి పోటీచేయను: కమలా హ్యారిస్

   04-12-2019


ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. విమానాల దారి మళ్ళింపు

ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. విమానాల దారి మళ్ళింపు

   04-12-2019


రాజ్ భవన్‌కు బెదిరింపులేఖ.. యూపీలో కలకలం

రాజ్ భవన్‌కు బెదిరింపులేఖ.. యూపీలో కలకలం

   04-12-2019


బెంగళూరు మెట్రో కీలక నిర్ణయం.. పెప్పర్ స్ప్రేలకు అనుమతి

బెంగళూరు మెట్రో కీలక నిర్ణయం.. పెప్పర్ స్ప్రేలకు అనుమతి

   04-12-2019


నేరాలు చేసే వారి వయసును పరిగణించాలా: వెంకయ్యనాయుడు ప్రశ్న

నేరాలు చేసే వారి వయసును పరిగణించాలా: వెంకయ్యనాయుడు ప్రశ్న

   03-12-2019


ఎటు చూసినా శిథిలాలే.. మెట్టుపాళ్యంలో అడుగడుగునా కన్నీళ్ళే

ఎటు చూసినా శిథిలాలే.. మెట్టుపాళ్యంలో అడుగడుగునా కన్నీళ్ళే

   03-12-2019


పార్లమెంటును కుదిపేసిన దిశా ఘటన

పార్లమెంటును కుదిపేసిన దిశా ఘటన

   02-12-2019


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle