newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

స్వదేశానికి భారతీయుల రాక 13 దేశాలు.. 64 విమానాలు.. 14,800 మంది ప్రయాణికులు

06-05-202006-05-2020 17:23:12 IST
Updated On 06-05-2020 17:35:44 ISTUpdated On 06-05-20202020-05-06T11:53:12.216Z06-05-2020 2020-05-06T11:53:00.505Z - 2020-05-06T12:05:44.379Z - 06-05-2020

స్వదేశానికి భారతీయుల రాక 13 దేశాలు.. 64 విమానాలు.. 14,800 మంది ప్రయాణికులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశం తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. 13 దేశాల నుంచి 64 విమానాల ద్వారా భారతీయులను తరలించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా మే 7వ తేది నుంచి 13 వరకు  విమాన సర్వీసులను నడపనుంది. బ్రిటన్‌ నుంచి 7, అమెరికా నుంచి 7 విమానాల ద్వారా భారతీయలను స్వదేశానికి తరలించనుంది. 64 విమానాల ద్వారా దాదాపు 15 వేల మంది భారతీయులను స్వదేశానికి తీసుకురానుంది. అలాగే దీనికి సంబంధించిన ప్రయాణ ఖర్చుల వివరాలను కూడా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 

ప్రాణాంతక కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకువచ్చేందుకు రంగం సిద్ధమైంది. వాయు, సముద్ర మార్గాల ద్వారా దాదాపు 14,800 మందిని భారత్‌కు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఈ మేరకు గురువారం నుంచి దశల వారీగా 64 విమానాలు, 3 నౌకల ద్వారా వారిని స్వదేశానికి చేరుస్తామని పేర్కొంది. 

లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న తరుణంలో భారత్‌ నుంచి అమెరికా, ఫిలిప్పైన్స్‌, సింగపూర్‌, బంగ్లాదేశ్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, యూకే, సౌదీ అరేబియా, ఖతార్‌, సింగపూర్‌, ఒమన్‌, బహ్రెయిన్‌, కువైట్‌ తదితర 13 దేశాలకు విమానాలు బయల్దేరతాయని వెల్లడించింది. ఇక గురువారం నుంచి ప్రారంభం కానున్న ప్రక్రియలో తొలిరోజు 10 విమానాలల్లో దాదాపు 2300 మందిని భారత్‌కు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

అదే విధంగా రెండో రోజు తొమ్మిది దేశాల నుంచి సుమారు 2050 భారతీయులు చెన్నై, కొచ్చి, ముంబై, అహ్మదాబాద్‌, బెంగళూరు, ఢిల్లీకి చేరుకోనున్నట్లు సమాచారం. మూడో రోజు మధ్య ప్రాచ్య దేశాలు, యూరప్‌, దక్షిణాసియా, అమెరికా నుంచి భారతీయులు స్వదేశం చేరుకుంటారని తెలుస్తోంది.

ఇక భారత నౌకా దళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ జలాశ్వ ద్వారా దాదాపు 1000 మందిని భారత్‌కు తీసుకురానున్నట్లు వెల్లడించింది. అదే విధంగా ఐఎన్‌ఎస్‌ శార్దూల్‌, ఐఎన్‌ఎస్‌ మగర్‌ ట్రిప్పునకు 300 మంది చొప్పున ప్రయాణీకులను చేరవేయనున్నట్లు పేర్కొంది. 

కాగా ప్రయాణానికి సిద్ధమైన వారు తమకు జ్వరం, దగ్గు, డయాబెటిస్‌, శ్వాసకోశ ఇబ్బందులు, కరోనాకు సంబంధించిన లక్షణాలు ఉంటే ముందుగానే సమాచారం ఇవ్వాలని.. అదే విధంగా తప్పనిసరిగా భౌతిక దూరం నిబంధనలు పాటించాలని విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో కరోనా లక్షణాలు లేనివారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. 

ఇక కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో మార్చి నెల చివర్లో భారత్‌ అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో విదేశాల్లో చిక్కుకుపోయిన తమను భారత్‌కు తీసుకువెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేయడంతో.. ప్రస్తుతం లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు దృష్ట్యా ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే స్వదేశానికి వచ్చేందుకు అయ్యే చార్జీలను ప్రయాణీకులే భరించాల్సి ఉంటుంది. అదే విధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను ప్రయాణీకులు పాటించాల్సి ఉంటుంది. 

బ్రిటన్‌ నుంచి భారత్‌కు వచ్చేందుకు విమాన ఛార్జీని రూ. 50 వేలుగా, అమెరికా నుంచి భారత్‌కు వచ్చే విమాన ఛార్జీని రూ. లక్షగా నిర్ణయించారు. కాగా కరోనా వైరస్‌ వ్యాప్తిని నిలువరించడానికి కేంద్ర ప్రభుత్వం మార్చి 24న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే  విదేశీ విమానాలను దేశంలోకి అనుమతించ లేదు. దీంతో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయూలు స్వదేశానికి వచ్చే అవకాశం లేకుండా పోయింది. 

తాజాగా వీరిని భారత్‌కు తీసుకురావాలని కేంద్ర నిర్ణయించింది. విదేశాల నుంచి వచ్చిన వారిని 15 రోజుల పాటు క్వారెంటైన్‌లో ఉంచాలని కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. 

ఇక ఉపాధి నిమిత్తం దేశంలో ఇతర ప్రాంతాలకు వెళ్లిన కూలీలను సైతం తరలిస్తామని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ మంగళవారం మీడియా సమావేశంలో తెలిపారు. కూలీల తరలింపు ఖర్చును రాష్ట్రాలే భరిస్తాయని అన్నారు. గుజరాత్‌లో 21,500 మంది కూలీలు చిక్కుకున్నారని, 18 రైళ్లలో వీరందరిని స్వస్థలాలకు తరలిస్తామని లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఉన్న కూలీల వివరాలను సేకరిస్తున్నామని పేర్కొన్నారు.

 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   3 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   3 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   6 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   14 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle