newssting
BITING NEWS :
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై అన్నాడీఎంకేలో అసంతృప్తులు. సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం ఎవరికివారు నేనంటే నేనే అంటూ వాదులాడుకునే స్థాయికి చేరిన వివాదం. వివాదానికి తెరదించేలా అక్టోబరు 7న అధికారిక ప్రకటిన చేయనున్నట్లు స్పష్టం చేసిన పార్టీ * కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టం బిల్లు ఆమోదాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన కేరళకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ టీఎన్‌ ప్రతాపన్‌. వ్యవసాయ రంగం అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని, కేం‍ద్రప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరిస్తోందని సుప్రీం పిటిషన్ లో పేర్కొన్న ఎంపీ. కేం‍ద్రప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మూడు చట్టాలు రాజ్యాంగ విరుద్దమని, చెల్లదని రద్దుచేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరిన ఎంపీ * అసోం మాజీ మహిళా ముఖ్యమంత్రి సైదా అన్వర తైమూర్ (84) అనారోగ్యంతో ఆస్ట్రేలియాలో కన్నుమూత. అసోం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా 4 దశాబ్దాల పాటు పనిచేసిన సైదా అన్వర తైమూర్. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సైదా అన్వర అసోం మొట్టమొదటి మహిళా సీఎం. గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలో ఉన్న తన కుమారుడి వద్ద ఉంటున్న సైదా అన్వర తీవ్ర అనారోగ్యానికి గురై కన్నుమూత * బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి(61)కి కరోనా సోకిన సంగతి తెలిసిందే. హిమాలయాల పర్యటనలో ఉండగా స్వల్ప జ్వరం రావడంతో పరీక్షలు చేయగా పాజిటివ్‌ ఫలితాలు. రిషికేశ్‌ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరినట్లుగా ట్వీట్. తన డ్రైవర్‌కు పాజిటివ్‌ వచ్చిందని, అతడి ద్వారా వ్యాపించి ఉంటుందని ట్వీట్ లో వెల్లడించిన ఉమా భారతి * రైలు ప్రయాణికుల నెత్తిన చార్జీల భారం మోపేందుకు రైల్వే శాఖ కసరత్తులు. అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దిన రైల్వే స్టేషన్ల ప్రయాణికులపై చార్జీల మోత. ప్రయాణికుడు కొనుగోలు చేసే టికెట్ ధరను బట్టి పెరుగుదలకు అవకాశం. గరిష్ఠంగా రూ.35 నుండి కనిష్ఠంగా పది రూపాయల వరకు వసూలు చేయనున్న వినియోగ రుసుము* దేశవ్యాప్తంగా మొత్తం 7 వేల రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటిలో రద్దీగా ఉండే స్టేషన్లలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించి వినియోగ రుసుమును వసూలు చేస్తామని రైల్వే శాఖ ఇది వరకే ప్రకటించింది. ఇలా అభివృద్ధి చేసిన స్టేషన్లు దాదాపు 1000 వరకు ఉన్నాయి. రైల్వే శాఖ ప్రతిపాదనకు కేంద్రం కనుక ఆమోద ముద్ర వేస్తే ఈ స్టేషన్లలోని ప్రయాణికుల జేబులకు చిల్లులు పడడం ఖాయం * నిర్మాణంలో ఉన్న ఓ భవనం ఆకస్మాత్తుగా కుప్పకూలడంతో ముగ్గురు దుర్మరణం. గుజరాత్ రాష్ట్రంలోని వడోదర నగరంలో సోమవారం రాత్రి జరిగిన ఘటన. బావామాన్ పురా ప్రాంతంలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం. ఈ ఘటనలో అక్కడికక్కడే మరణించిన ముగ్గురు వ్యక్తులు. కరోనా బారిన పడ్డ ఒడిశా డిప్యూటీ స్పీకర్ రజనీకాంత్ సింగ్‌తోపాటు 11 మంది ఎమ్మెల్యేలు. నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, పాత్రికేయులకు ప్రత్యేకంగా కరోనా పరీక్షలు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్, 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకినట్టు నిర్ధారణ * ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి అధికంగా సాగుతున్న వరద నీటి ప్రవాహం. జలాశయం 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటి విడుదల చేస్తున్న అధికారులు. జలాశయం ఇన్ ఫ్లో 2,05,017 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 3,06,819 క్యూసెక్కులు. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. 883.90 అడుగులకు చేరిన ప్రస్తుతం నీటి మట్టం * తమ భూములకు సరైన నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు కృష్ణంరాజు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ విస్తరణలో తమ భూమికి సరైన నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్ దాఖలు. పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు * దేశంలో సోమవారం నుండి ప్రారంభమైన వాయువ్య భారతం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌, బికనీర్‌ల నుంచి ఈనెల 17నే ఉపసంహరణ ప్రారంభం కావాల్సి ఉండగా, ఈసారి 11 రోజులు ఆలస్యం. ఏపీ నుంచి అక్టోబరు 15న రుతుపవనాలు నిష్క్రమిస్తాయని అంచనా. కాగా, దక్షిణ ఏపీలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. దీని ప్రభావంతో రాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం * నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం. 18 క్రస్టు గేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 3,10,631 క్యూసెక్కులు కాగా పూర్తి స్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 309.6546 టీఎంసీలుగా నమోదు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుత నీటిమట్టం 589.20 అడుగులకు చేరిక * మూసీ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం అధికంగా ఉండటంతో 2 గేట్ల నుంచి నీటి విడుదల చేస్తున్న అధికారులు. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 645 అడుగులు(4.46టీఎంసీలు) కాగా 644 అడుగుల(4.20టీఎంసీలు)కు చేరిన ప్రస్తుత నీటి మట్టం. అలాగే ఇన్ ఫ్లో 4,505 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3,978 క్యూసెక్కులుగా నమోదు * కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు లంచం కేసులో అరెస్టయిన ముగ్గురు సహనిందితులకు ఏసీపీ ప్రత్యేక కోర్టు బెయిల్‌ మంజూరు. చేసింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి శ్రీనాథ్‌యాదవ్‌, మధ్యవర్తి అంజిరెడ్డి, వీఆర్‌ఏ సాయిరాజ్‌కు బెయిల్‌

స్వచ్చభారత్ లేకుంటే కరోనాతో దేశం ధ్వంసమయ్యేది...ప్రధాని మోదీ వ్యాఖ్య

09-08-202009-08-2020 08:51:55 IST
2020-08-09T03:21:55.721Z09-08-2020 2020-08-09T03:21:53.115Z - - 30-09-2020

స్వచ్చభారత్ లేకుంటే కరోనాతో దేశం ధ్వంసమయ్యేది...ప్రధాని మోదీ వ్యాఖ్య
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రాణాంతక మహమ్మారి కోవిడ్-19 వైరస్ 2020లో కాకుండా 2014లోనే వచ్చి ఉంటే జరిగి ఉండే విధ్వంసం గురించి ఎవరైనా ఉహించుకోవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. స్వచ్ఛభారత్ మిషన్‌తో భారత్ పారిశుథ్యంపై సాధికారత సాధించడం వల్లే కోవిడ్-19పై సమర్ధవంతమైన పోరాటం చేయగలిగామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2014కు ముందు కోవిడ్-19 వచ్చి ఉండే పరిస్థితిని ఊహించవచ్చని అన్నారు. 60 శాతం మంది కనీసం ఇళ్లలో మరుగుదొడ్లు లేక బహిరంగ విసర్జనకే పరిమితమయ్యే వారని, అలాంటి పరిస్థితుల్లో లాక్‌డౌన్ విధించడం అసాధ్యమయ్యేదని పరోక్షంగా అప్పటి కాంగ్రెస్ పాలకులకు ప్రధాని చురకలు వేశారు. 

ఢిల్లీలో రాష్ట్రీయ స్వచ్ఛందా కేంద్రాన్ని మోదీ శనివారంనాడు ప్రారంభించిన అనంతరం స్కూలు పిల్లలతో మాట్లాడారు. 'గత కొద్ది సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు  గాంధీజీ స్ఫూర్తితో స్వచ్ఛ భారత్ మిషన్‌ను తన జీవితాలకు లక్ష్యంగా మలుచుకున్నారు. ఇందుకు అనుగుణంగా కేవలం 60 నెలల్లో 60 కోట్ల మందికి పైగా ప్రజలకు టాయెలెట్ సౌకర్యాలను మేము కల్పించగలిగాం' అని ప్రధాని అన్నారు.

యావత్ ప్రపంచం మహాత్మాగాంధీ చాటిన విలువలు, సిద్ధాంతాలను అక్కున చేర్చుకుంటోందని చెప్పారు. గత ఏడాది గాంధీజీ 150వ జయంత్యుత్సవాలను కూడా అసాధారణ రీతిలో జరిగాయని గుర్తు చేశారు. మహాత్మాగాంధీకి ఎంతో ఇష్టమైన గీతం 'వైష్ణవ్ జన్ తో' పాడేందుకు వివిధ దేశాలకు చెందిన కళాకారులు ఏకతాటిపైకి వచ్చి గళం విప్పారని చెప్పారు. కోవిడ్‌ వ్యాప్తిని అరికట్టేందుకు పిల్లలతో సహా ప్రతి ఒక్కరూ సామాజిక దూరం నిబంధనలు పాటించాలని, మాస్క్‌లు ధరించాలని మోదీ మరోసారి విజ్ఞప్తి చేశారు.

కరోనా నేపథ్యంలోనైనా స్వచ్ఛత, పరిశుభ్రతలతో మన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని స్కూల్‌ విద్యార్థులకు ప్రధాని ఉద్భోదించారు. కరోనా నుంచి ఎవరికి వారే కాపాడుకోవాలన్నారు. బయటకు వెళ్లినప్పుడు మాస్క్‌ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయరాదని సూచించారు. స్వచ్ఛ్‌ భారత్‌ మిషన్‌ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఏర్పాటు చేసిన రాష్ట్రీయ స్వచ్ఛత కేంద్రాన్ని ప్రధాని శనివారం ప్రారంభించారు. గాంధీకి నివాళిగా ఐదేళ్లలో స్వచ్ఛ్‌ భారత్‌ మిషన్‌ సాధించిన విజయాలకు ప్రతీకగా 11 జోన్లతో ఈ కేంద్రాన్ని నిర్మించారు. 

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. స్వచ్ఛ్‌ భారత్‌ కార్యక్రమాలు దేశ ప్రజల్లో చెప్పుకోదగిన మార్పులు తీసుకొచ్చాయన్నారు. ఐదేళ్లలో 6 లక్షల గ్రామాలు బహిరంగ మలవిసర్జన రహితంగా అవతరించాయని ప్రధాని తెలిపారు. ఇది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద మార్పుగా అభివర్ణించారు.

కాగా, రూ.లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించనున్నారు. పీఎం కిసాన్‌ పథకం 6వ ఇన్‌స్టాల్‌మెంట్‌ కింద 8.5 కోట్ల మంది రైతులకు రూ.17 వేల కోట్లను కూడా ప్రధాని విడుదల చేస్తారని శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ రంగ పథకం కింద వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ద్వారా ఆర్థిక సాయానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పంట కోత నిర్వహణ, పంట నిల్వ, సేకరణ కేంద్రాలు, ప్రాసెసింగ్‌ యూ నిట్లు, రైతు సమూహానికి సంబంధించిన వ్యవసాయ ఆస్తులు వంటి మౌలిక సదుపాయాలకు ఈ నిధి ఉపయోగపడుతుంది. వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకొని అధిక ధరలకు అమ్ముకోవడానికి కూడా రైతులకు అవకాశం లభిస్తుంది.

 

బ్రేకింగ్.. ఉపరాష్ట్రపతి వెంకయ్యకు కరోనా పాజిటివ్!

బ్రేకింగ్.. ఉపరాష్ట్రపతి వెంకయ్యకు కరోనా పాజిటివ్!

   4 hours ago


ఆ సీనియర్ ఐపీఎస్ అధికారి.. భార్యను చితక్కొడుతూ అడ్డంగా దొరికిపోయారు

ఆ సీనియర్ ఐపీఎస్ అధికారి.. భార్యను చితక్కొడుతూ అడ్డంగా దొరికిపోయారు

   11 hours ago


కరోనా గాలి ద్వారా వ్యాపిస్తుందా..?

కరోనా గాలి ద్వారా వ్యాపిస్తుందా..?

   14 hours ago


ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంచలన నిర్ణయం.. ప్రభుత్వ తీరే కారణమా..!

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంచలన నిర్ణయం.. ప్రభుత్వ తీరే కారణమా..!

   14 hours ago


నాలుక కోసి అత్యాచారం చేసిన కామాంధులు.. చికిత్స పొందుతూ యువతి మృతి

నాలుక కోసి అత్యాచారం చేసిన కామాంధులు.. చికిత్స పొందుతూ యువతి మృతి

   16 hours ago


కోవిడ్ నేర్పిన గుణపాఠం అదే.. ప్రధాని మోదీ

కోవిడ్ నేర్పిన గుణపాఠం అదే.. ప్రధాని మోదీ

   16 hours ago


రైలు ప్రయాణమా.. కాస్త ఖర్చవుతుంది..!

రైలు ప్రయాణమా.. కాస్త ఖర్చవుతుంది..!

   17 hours ago


సరిహద్దుల్లో బ్రహ్మోస్ క్షిపణులు.. యుద్ధానికి భారత్ సన్నద్ధం

సరిహద్దుల్లో బ్రహ్మోస్ క్షిపణులు.. యుద్ధానికి భారత్ సన్నద్ధం

   18 hours ago


అన్ లాక్ 5.0...కరోనా వ్యాప్తికి ఆహ్వానం కానుందా?

అన్ లాక్ 5.0...కరోనా వ్యాప్తికి ఆహ్వానం కానుందా?

   28-09-2020


ఢిల్లీలో ట్రాక్టర్ తగలబెట్టిన రైతులు.. ప్రభుత్వం పట్టించుకునేనా

ఢిల్లీలో ట్రాక్టర్ తగలబెట్టిన రైతులు.. ప్రభుత్వం పట్టించుకునేనా

   28-09-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle