newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

స్నేహాన్ని గౌరవిస్తాం.. కానీ శత్రువుకు శాస్తి చేసితీరుతాం.. ప్రధాని హెచ్చరిక

29-06-202029-06-2020 13:34:28 IST
Updated On 29-06-2020 14:23:04 ISTUpdated On 29-06-20202020-06-29T08:04:28.165Z29-06-2020 2020-06-29T08:04:19.478Z - 2020-06-29T08:53:04.954Z - 29-06-2020

స్నేహాన్ని గౌరవిస్తాం.. కానీ శత్రువుకు శాస్తి చేసితీరుతాం.. ప్రధాని హెచ్చరిక
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లడఖ్‌ ప్రాంతంపై కన్నేసిన వారికి భారత్‌ తగిన సమాధానం చెప్పిందని ప్రధాని మోదీ తెలిపారు. స్నేహస్ఫూర్తికి గౌరవమిస్తూనే, ఎంతటి శత్రువుకైనా తగు సమాధానం చెప్పే సామర్థ్యం భారత్‌కు ఉందని చైనాను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన ఆకాశవాణిలో మాసాంతపు ‘మన్‌కీ బాత్‌’లో మాట్లాడారు. దేశ గౌరవానికి భంగం వాటిల్లబోనివ్వమని మన జవాన్లు నిరూపించారంటూ ప్రధాని.. గల్వాన్‌ ఘటనలో వీరమరణం చెందిన 20 మంది జవాన్లకు నివాళులర్పించారు. స్వయం సమృద్ధి సాధించడమే మన లక్ష్యమని, అదే అమరజవాన్లకు ఘన నివాళి అని పేర్కొన్నారు. విశ్వాసం, స్నేహం, సోదరభావం అనే విలువలకు కట్టుబడి ముందుకు సాగుదామన్నారు. 

స్థానికంగా తయారైన వస్తువులనే కొని, దేశానికి సేవ చేయాలని, దేశాభివృద్ధికి తోడ్పడాలని ప్రజలను కోరారు.  దేశీయ వస్తువులను మీరు కొంటున్నారంటే దేశాన్ని బలోపేతం చేయడంలో మీ పాత్ర కూడా ఉన్నట్లే ’అని మోదీ పేర్కొన్నారు. ‘‘భారతీయులంతా మేడిన్‌ ఇండియా వస్తువులనే కొనండి. కరోనా లాక్‌డౌన్లతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు ఈ నిర్ణయం ఊతమిస్తుంది. కరోనా నుంచి మనమంతా ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా, అవకాశాలుగా మార్చుకోవడంపై దృష్టిసారించాం. ఆత్మనిర్భర్‌ భారత్‌ వైపు అడుగులు వేశాం. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రజలు స్థానికత స్వరం(వోకల్‌ ఫర్‌ లోకల్‌) పెంచాల్సిన అవసరముంది’’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. స్వదేశీ వస్తువులనే కొనాలనే నినాదం ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతోందన్నారు. అసోం నుంచి రజనీ అనే మహిళ తనకు లేఖ రాశారని, చైనాతో ఘర్షణ నేపథ్యంలో ఆమె స్థానిక వస్తువులే కొంటున్నారని చెప్పారు.

‘‘భారత్‌ పొరుగుదేశాలతో స్నేహహస్తాన్ని కోరుకుంటుంది. కానీ, దేశం వైపు దుష్ట దృష్టితో చూసేవారిని దునుమాడుతాం. ప్రత్యర్థికి దీటు గా జవాబిస్తాం. లద్దాఖ్‌లో భారత భూభాగంపై కన్నేసిన వారికి మన సైన్యం తగిన గుణపాఠం చెప్పింది. సైనికుల శౌర్యమే భారత్‌ బలం. దేశ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయబోమని చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీతో పోరాడి అసువులుబాసిన 20 మంది వీర సైనికులు రుజువుచేశారు’’ అని మోదీ అన్నారు. అమర సైనికుల కుటుంబాలు తమ పిల్లలను సైన్యంలో పంపేందుకు సిద్ధపడ్డారని ఆయన వివరించారు. బిహార్‌కు చెందిన కుందన్‌ కుమార్‌(ఇటీవల లద్దాఖ్‌లో అమరుడయ్యారు) తండ్రి తన మనుమలను సైన్యంలోకి పంపిస్తానని చెప్పారన్నారు. ‘‘స్వాతంత్య్రం వచ్చినప్పుడు ఎన్నో దేశాలకంటే బలమైన శక్తిగా భారత్‌ ఉండేది. అప్పట్లో మనకంటే వెనుకబడిన దేశాలు ఇప్పుడు రక్షణ రంగంలో ముందంజలో ఉన్నా యి. మనం ఆ కోణంపై దృష్టిపెట్టలేదు. గత ఆరేళ్లుగా రక్షణశాఖను బలోపేతం చేస్తున్నాం’’ అని మోదీ వివరించారు.

కరోనా వైపరీత్యం వస్తుందని ఆరేడు నెలల క్రితం ఎవరూ ఊహించలేదని, అప్పటి నుంచీ 2020లో మనం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూనే ఉన్నామని చెప్పారు. ‘‘చాలా మంది 2020 మంచిది కాదని, అది ఎప్పుడు ముగుస్తుందా? అని చూస్తున్నారు. అది సరికాదు. సవాళ్లను అవకాశాలుగా మలచుకోవాలి. కరోనాను సైతం అనుకూలంగా మలచుకుని, ఆత్మ నిర్భర్‌ భారత్‌ను నిర్మిద్దాం’’ అని పిలుపునిచ్చారు. ‘‘మాస్కులు ధరించకుండా, భౌతిక దూరాన్ని పాటించకుంటే మీతో పాటు ఇతరులను, ప్రత్యేకించి మీ కుటుంబాల్లోని పెద్దలు, చిన్నారులను ఇబ్బందులకు గురి చేసినవారవు తారు. దేశ ప్రజలంతా దేశ ఆర్థిక పరిసితిని గాడిలో పెట్టేందుకు సహకరించాలి’’ అని కోరారు. కరోనా కాలం మన సాంప్రదాయ ఆటలకు ప్రాధాన్యత కల్పించిందని ప్రధాని అన్నారు. 

తమిళనాడులో పళ్లంగుల్‌, కర్ణాటకలో అలీగులీ మనే, తెలుగు రాష్ట్రాల్లో వామనగుంటలు(వొనగుంతలు) ఆట సరదా ఆటలైనప్పటికీ వ్యూహాలుంటాయన్నారు. ఈ ఆటలు దక్షిణ భారతం నుంచి ఆగ్నేయ దేశాలకు, ప్రపంచానికీ పాకాయన్నారు. ఇవన్నీ మన బాల్యాన్ని గుర్తుకుతెస్తాయని చెప్పారు.

భారత్‌లో కరోనాను ప్రజలే కట్టడి చేశారని ప్రధాని మోదీ అన్నారు. ఆయన భారత సంతతి అమెరికా వైద్యుల సంఘం (ఏఏపీఐ) వార్షిక సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ‘‘భారత్‌లో సరైన సమయంలో లాక్‌డౌన్‌ విధించాం. ప్రజల సహకారంతోనే వైరస్‌ విస్తృతిని కట్టడి చేశాం. అమెరికాలో ప్రతి 10 లక్షల కేసుల్లో 350, ఐరోపాలో 600 చొప్పున మరణాలు నమోదవ్వగా.. భారత్‌లో ఆ రేటు 12 కంటే తక్కువగా ఉంది. కరోనా తో భారత్‌లో వైద్య వనరులు అభివృద్ధి చెందా యి. పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్కులను ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నాం’’ అని వివరించారు. యోగా ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఒక జీవనశైలిగా మారిందన్నారు. ఆయుర్వేదానికి ప్రాధాన్యత పెరిగిందని గుర్తుచేశారు. ‘ఫిట్‌ ఇండియా’ ఉద్యమం ఉధృతమైందన్నారు. 80 వేల మంది వైద్యులకు సభ్యత్వం ఉన్న ఏఏపీఐ సమావేశంలో భారత ప్రధాని ఒకరు ప్రసంగించడం  ఇదే ప్రథమం.

కరోనాను ఓడించడంపైనే దృష్టి.. దేశం దృష్టి మొత్తం కరోనా వైరస్‌ను నిలువరించడంపైనే ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ అన్‌లాక్‌ కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి బలోపేతం చేయాలని అన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఎంత అప్రమత్తత చూపారో అన్‌లాక్‌ సమయంలోనూ అంతే జాగ్రత్తలు పాటించాలని ప్రజలను కోరారు. ‘మాస్కు ధరించకున్నా, రెండడుగుల భౌతిక దూరం వంటి ఇతర నిబంధనలను పాటించకున్నా, మీతోపాటు మీ చుట్టుపక్కల వారిని కూడా ప్రమాదంలోకి నెట్టేసినట్లేనని మీరు ఎప్పుడూ గుర్తుంచుకోండి’అని ఆయన ప్రజలను హెచ్చరించారు. అన్‌లాక్‌ సమయంలో ఇతర విషయాల్లోనూ నిబంధనలను ఎత్తివేసినట్లు పేర్కొన్న ప్రధాని.. కొన్ని రంగాల్లో దశాబ్దాలుగా ఉన్న ఆంక్షలను తొలగించినట్లు తెలిపారు. ఈ ఏడాది తుపానులు, భూకంపాలతో పాటు కొన్ని పొరుగు దేశాల దుష్ట పన్నాగాలను సైతం ఎదుర్కొవాల్సి వచ్చిందని ప్రధాని పేర్కొన్నారు.

 

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

   2 hours ago


ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

   2 hours ago


మేళాలు, సభల వల్లే  కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

మేళాలు, సభల వల్లే కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

   12 hours ago


కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

   19 hours ago


మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి  కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

   20 hours ago


ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

   18 hours ago


టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

   a day ago


వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

   13-05-2021


ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి  బొంబాయి హైకోర్టు  హితవు

ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి బొంబాయి హైకోర్టు హితవు

   12-05-2021


కరోనా కేసుల అప్డేట్స్.. కొత్త‌గా 3,48,421 మందికి కరోనా

కరోనా కేసుల అప్డేట్స్.. కొత్త‌గా 3,48,421 మందికి కరోనా

   12-05-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle